PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lokeshb0b99a7d-2d6e-4843-8503-5cac1eddf9d3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lokeshb0b99a7d-2d6e-4843-8503-5cac1eddf9d3-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుమారుడు టీడీపీ పార్టీలో అత్యంత కీలక సభ్యులలో ఒకరు అయినటువంటి నారా లోకేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. లోకేష్ చాలా సంవత్సరాలు విదేశాల్లో అత్యున్నత విద్యను అభ్యసించి ఆ తర్వాత రాజకీయాలపై ఆసక్తితో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి కీలక సభ్యుడుగా మారాడు. ఇక పోయినసారి ఈయన తెలుగుదేశం పార్టీ నుండి మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలోకి దిగారు. తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు కుమారుడు కావడంతో ఈయన అవలీలగా మంగళగిరి నుండి గెలుస్తాడు అlokesh{#}thursday;Party;Telugu Desam Party;Nara Lokesh;Assembly;CBN;TDP;Lokesh;Lokesh Kanagaraj;Mangalagiriమరోసారి నోరు జారిన నారా లోకేష్... ఈసారి ఎందుకో తెలుసా..?మరోసారి నోరు జారిన నారా లోకేష్... ఈసారి ఎందుకో తెలుసా..?lokesh{#}thursday;Party;Telugu Desam Party;Nara Lokesh;Assembly;CBN;TDP;Lokesh;Lokesh Kanagaraj;MangalagiriSun, 12 May 2024 12:34:00 GMTతెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుమారుడు టీడీపీ పార్టీలో అత్యంత కీలక సభ్యులలో ఒకరు అయినటువంటి నారా లోకేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. లోకేష్ చాలా సంవత్సరాలు విదేశాల్లో అత్యున్నత విద్యను అభ్యసించి ఆ తర్వాత రాజకీయాలపై ఆసక్తితో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి కీలక సభ్యుడుగా మారాడు. ఇక పోయినసారి ఈయన తెలుగుదేశం పార్టీ నుండి మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలోకి దిగారు.

తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు కుమారుడు కావడంతో ఈయన అవలీలగా మంగళగిరి నుండి గెలుస్తాడు అని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈయన ఓడిపోయాడు. ఇక ఓటమి తర్వాత కూడా ఈయన మంగళగిరి నియోజకవర్గాన్ని వదిలి పెట్టలేదు. ఐదు సంవత్సరాలు ఇక్కడి ప్రజలతో, నాయకులతో, కార్యకర్తలతో టచ్ లో ఉంటూ వచ్చారు.

ఇక దాని తోనే అర్థం అయ్యింది ఈయన మరోబ్సారి కూడా ఇక్కడి నుండే పోటీ చేయబోతున్నాడు అని, అనుకున్నట్లుగానే లోకేష్ మరికొన్ని రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో మంగళగిరి నుండి పోటీలోకి దిగారు. ఇకపోతే ఇప్పటికే లోకేష్ నోరు జారీ నవ్వుల పాలైన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక మరోసారి కూడా లోకేష్ అలాగే నోరు జారాడు. గురువారం రోజు రాత్రి మంగళగిరి నియోజకవర్గంలోని కురగల్లు , నిడమర్రు ప్రాంతాలను లోకేష్ పర్యటించారు.

ఈ సందర్భంగా నిడమర్రు గ్రామంలో ఈయన మాట్లాడుతూ... కూటమి అధికారంలోకి వచ్చినట్లు అయితే ప్రస్తుతం 300 రూపాయలుగా ఉన్న పెన్షన్ ను 400 రూపాయలుగా చేస్తాము అని అన్నారు. దానితో ఈ సభకు హాజరైన సభ్యులు షాక్ అయ్యారు. దానితో వెంటనే వెనకాల ఉన్న ఓ వ్యక్తి 3000 నుండి 4000 చేస్తాం అని చెప్పండి సార్ అనడంతో ఆయన ఆ తర్వాత మేము అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న పెన్షన్ ను 3000 నుండి 4000 చేస్తాం అని అన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>