Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kcre033462c-aa06-4911-89aa-1a5ec4bc8727-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kcre033462c-aa06-4911-89aa-1a5ec4bc8727-415x250-IndiaHerald.jpgగత అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడతామనుకుని గట్టిగా నమ్మిన బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు షాక్ ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు గులాబీ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలు మూడోసారి మాత్రం కాంగ్రెస్ వైపు నిలిచారు. దీంతో ఇక గులాబీ పార్టీ కేవలం ప్రతిపక్ష హోదాతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇలా ప్రతిపక్షంలోకి వచ్చిందో లేదో ఏకంగా కారు పార్టీలోని కీలక నేతలందరూ కూడా కేసీఆర్ను వెన్నుపోటు పొడవడం మొదలుపెట్టారు. గతంలో గులాబీ పార్టీలో కీలక పదవులు అనKcr{#}Balka Suman;Congress;MP;Car;Minister;Joseph Vijay;Dalapathi;Eshwar;Peddapalli;Assembly;Telangana;Parliment;KCR;Partyబిఆర్ఎస్ ఆ ఒక్క సీటే గెలుస్తుందని.. కేసీఆర్ కు తెలిసిపోయిందా?బిఆర్ఎస్ ఆ ఒక్క సీటే గెలుస్తుందని.. కేసీఆర్ కు తెలిసిపోయిందా?Kcr{#}Balka Suman;Congress;MP;Car;Minister;Joseph Vijay;Dalapathi;Eshwar;Peddapalli;Assembly;Telangana;Parliment;KCR;PartySun, 12 May 2024 12:15:00 GMTగత అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్  కొడతామనుకుని గట్టిగా నమ్మిన బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు షాక్ ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు గులాబీ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలు మూడోసారి మాత్రం కాంగ్రెస్ వైపు నిలిచారు. దీంతో ఇక గులాబీ పార్టీ కేవలం ప్రతిపక్ష హోదాతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇలా ప్రతిపక్షంలోకి వచ్చిందో లేదో ఏకంగా కారు పార్టీలోని కీలక నేతలందరూ కూడా కేసీఆర్ను వెన్నుపోటు పొడవడం మొదలుపెట్టారు.


 గతంలో గులాబీ పార్టీలో కీలక పదవులు అనుభవించిన వారు సైతం ఇక కారు పార్టీని బదిలీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక ఎప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలుస్తుంది అనే విషయంపై ఆసక్తి నెలకొంది. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న కేసీఆర్ ఇక ఇప్పుడు ఇక రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు వెళ్తూ తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచార నిర్వహిస్తున్నారు. అయితే గతంలో బిఆర్ఎస్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 14 నుంచి 15 స్థానాలలో విజయం సాధిస్తుందని ప్రకటించారు కేసీఆర్. కానీ గత కొంతకాలం నుంచి మాత్రం కేసీఆర్ నోటా మరో కొత్త మాట వినిపిస్తుంది. పెద్దపల్లి స్థానంలో తప్పకుండా బిఆర్ఎస్ గెలుస్తుంది అంటూ చెబుతున్నారు కేసీఆర్.


 ఒక్కసారి కాదు తరచూ ఇలా పెద్దపల్లి సీటు బిఆర్ఎస్ దే అంటూ కేసిఆర్ ప్రస్తావిస్తూ ఉండడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇక గులాబీ దళపతి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే బిఆర్ఎస్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేది కేవలం ఒక పెద్దపల్లి సీటేనా  అనే చర్చ కూడా మొదలైంది. పెద్దపల్లి బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ని బరిలో నిలిపారు కేసీఆర్   అక్కడి నుంచి గతంలో ఎంపీగా పోటీ చేసి గెలిచిన బాల్క సుమన్ ను కాదని కొప్పులకు టికెట్ ఇచ్చారు. సింగరేణి కార్మికుడిగా కిందిస్థాయి నుంచి వచ్చిన ఈశ్వర్ పై ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఉండడంతో పాటు వివాద రహిత నేతగా పేరు ఉండడంతో ఆయనకు టికెట్ ఇచ్చారు అన్నది తెలుస్తుంది. అయితే ఇక ఇప్పుడు బిఆర్ఎస్ తప్పకుండా పెద్దపల్లిలో గెలుస్తుంది అంటూ కేసిఆర్ వ్యాఖ్యానిస్తూ ఉండడంతో ఆయన చేతికి ఏదైనా నివేదిక అందిందా లేకపోతే తన రాజకీయ అనుభవంతో కేవలం ఒక్క సీటే గెలుస్తామని ముందే ఊహించారా అనే చర్చ కూడా జరుగుతుంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>