Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-ku-babori-meede-doubt-andukea3cde52b-d245-455a-af2d-e543130351fd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-ku-babori-meede-doubt-andukea3cde52b-d245-455a-af2d-e543130351fd-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ప్రజల్లోకి వచ్చారు. కానీ అడుగడుగునా ఆయనకు చేదు అనుకోవాలి. మరి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనైనా పవన్ ఎమ్మెల్యేగా గెలుస్తారా. ప్రస్తుతం అందరిలో ఉన్న ప్రశ్న ఇదే. అయితే ఇక పిఠాపురంలో సినీ సెలబ్రిటీల హడావిడి.. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచార నిర్వహిస్తున్న తీరు చూస్తుంటే ఇంకా పవన్ కి గెలుపు పై ధీమా రాలేదా అనే అనుమానం కూడా కలుగుతుంది. అదేంటో గాని పార్టీ పెట్టిన కొత్తలోనే పవన్ కళ్యాణ్ కు ప్రజలకు నచ్చని చంద్రబాబు నచ్చేసాడు. ఇంకేముంది పాPawan{#}Jabardasth;Assembly;Party;Andhra Pradesh;kalyan;CBNపవన్ కు బాబోరి మీదే డౌట్.. అందుకే ఇంత హడావిడి?పవన్ కు బాబోరి మీదే డౌట్.. అందుకే ఇంత హడావిడి?Pawan{#}Jabardasth;Assembly;Party;Andhra Pradesh;kalyan;CBNSun, 12 May 2024 15:00:00 GMTటాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ప్రజల్లోకి వచ్చారు. కానీ అడుగడుగునా ఆయనకు చేదు అనుకోవాలి. మరి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనైనా పవన్ ఎమ్మెల్యేగా గెలుస్తారా.  ప్రస్తుతం అందరిలో ఉన్న ప్రశ్న ఇదే. అయితే ఇక పిఠాపురంలో సినీ సెలబ్రిటీల హడావిడి.. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచార నిర్వహిస్తున్న తీరు చూస్తుంటే ఇంకా పవన్ కి గెలుపు పై ధీమా  రాలేదా అనే అనుమానం కూడా కలుగుతుంది. అదేంటో గాని పార్టీ పెట్టిన కొత్తలోనే పవన్ కళ్యాణ్ కు ప్రజలకు నచ్చని చంద్రబాబు నచ్చేసాడు.


 ఇంకేముంది పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో టిడిపికి మద్దతు పలికారు తప్ప ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగలేదు. ఆ తర్వాత ఏమైందో బాబోరికి కాస్త దూరం జరిగి బిజెపితో పొట్టు పెట్టుకున్నారు. ఇక ఆ పొత్తు కూడా బెడిసి కొట్టండి. రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఒక్కచోట కూడా గెలవలేకపోయారు. ఓడిపోయిన ప్రజల పక్షాన నిలబడ్డారు. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపారు   ఇక ప్రజలకు కష్టం వచ్చిన చోట నిలబడి నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు. ఒక రకంగా పవన్ కళ్యాణ్ను అసెంబ్లీకి పంపిస్తే  తమ సమస్యలను అసెంబ్లీలో వినిపిస్తాడు అనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాడు.


 దీంతో ఇన్నాళ్లు ప్రజల పక్షాన నిలబడిన తనకు ప్రజలు కూడా తన వైపే ఉన్నారు అనే నమ్మకం ఉంది పవన్ కు ఉంది. కానీ ఎక్కడో చంద్రబాబు మీదే పవన్ కి డౌట్. పవన్ చంద్రబాబు కోసం పనిచేస్తు జనసేనను  ముంచేస్తున్నారనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. ఒంటరిగా పోటీ చేసి ఉంటే బాగుండేది అన్నది కూడా కొంతమంది భావన. అయితే గతంలో అధికారంలో ఉండగా ఇచ్చిన హామీలను మరిచిపోయిన చంద్రబాబుపై ఇప్పటికి వ్యతిరేకత ఉంది. అలాంటి బాబుతో  పొత్తు పెట్టుకుని నడుస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇక ఈ పొత్తు తన గెలుపు అవకాశాలను దూరం చేస్తుందా అనే డౌట్ పవన్ లో పట్టుకుందట. అందుకే ఈసారి తప్పకుండా గెలుపు తనదే అనే నమ్మకం ఉన్న.. ఎందుకో జబర్దస్త్ బ్యాచ్, మెగా ఫ్యామిలీ లోని కుటుంబ సభ్యులందరిని పిలిపించుకొని మరి ప్రచారం చేయించుకుంటున్నారన్నది ఏపీ రాజకీయాలు ఒక టాక్ నడుస్తుంది. మరి మరోసారి బాబుతో కలిసి నడుస్తున్న పవన్ భవితవ్యాన్ని ప్రజలు ఎలా నిర్ణయిస్తారో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>