PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan-interview-views-are-more-than-cbns256cb70a-8cd5-4f22-9e42-c7bf34ef7b03-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan-interview-views-are-more-than-cbns256cb70a-8cd5-4f22-9e42-c7bf34ef7b03-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ను చూసి కూటమి వణుకుతోందా అనే ప్రశ్నకు అవుననే సమధానం వినిపిస్తోంది. దాదాపుగా 26 సర్వేలు జగన్ కు అనుకూలంగా ఉండటం జగన్ కు ఎంతగానో ప్లస్ అవుతోందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో 12 గంటల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా వైసీపీ అభ్యర్థులు రిలీఫ్ గా ఉంటే కూటమి అభ్యర్థులు మాత్రం తెగ టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది. jagan{#}Hanu Raghavapudi;Survey;News;Elections;CM;YCP;Andhra Pradesh;Jaganజగన్ వేవ్ చూసి గజగజా వణుకుతున్న కూటమి.. ఓటర్ల శాపనార్థాలు మామూలుగా లేవుగా!జగన్ వేవ్ చూసి గజగజా వణుకుతున్న కూటమి.. ఓటర్ల శాపనార్థాలు మామూలుగా లేవుగా!jagan{#}Hanu Raghavapudi;Survey;News;Elections;CM;YCP;Andhra Pradesh;JaganSun, 12 May 2024 20:20:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ను చూసి కూటమి వణుకుతోందా అనే ప్రశ్నకు అవుననే సమధానం వినిపిస్తోంది. దాదాపుగా 26 సర్వేలు జగన్ కు అనుకూలంగా ఉండటం జగన్ కు ఎంతగానో ప్లస్ అవుతోందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో 12 గంటల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా వైసీపీ అభ్యర్థులు రిలీఫ్ గా ఉంటే కూటమి అభ్యర్థులు మాత్రం తెగ టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది.
 
రాష్ట్రంలో 2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ కాబోతున్నాయని పొలిటికల్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. సీఎం వైఎస్ జగన్ గత ఐదేళ్లలో చేసిన సంక్షేమం, అభివృద్ధి ఆయనను ప్రజల్లో తిరుగులేని నాయకుడిగా మరోసారి నిలుపుతున్నాయని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సందర్భంగా వివిధ సర్వే సంస్థలు విడుదల చేస్తున్న మెజారిటీ సర్వేలు వైసీపీదే విజయమని తేల్చి చెబుతున్నాయి.
 
రాష్ట్రంలో మళ్లీ ఫ్యాన్ ప్రభంజనం ఖాయమని తెలుస్తోంది. 2019లో రాయలసీమలో సాధించిన సీట్లను రిపీట్ చేయడంలో వైసీపీ సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 120 నుంచి 130 సీట్లలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, 20 నుంచి 21 సీట్లలో వైసీపీ ఎంపీ అభ్యర్థులు విజయం సాధించే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది.
 
టైమ్స్ నౌ, చాణ్యక్య గ్రూప్ ఆత్మసాక్షి, జన్మత్ పోల్స్, పోల్ స్ట్రాజటీ గ్రూప్, పొలిటికల్ క్రిటిక్ లాంటి ప్రముఖ సంస్థలు జగన్ కు తిరుగులేదని చెబుతున్నాయి.  సీఎం వైయస్ జగన్ సిద్ధం సభలు, మేమంతా సిద్ధం యాత్రకు ప్రజల నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.. జగన్ అమలు చేసిన పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజల నుంచి కూడా మద్దతు ఉండటం ప్లస్ అవుతోందని తెలుస్తోంది. కూటమి అభ్యర్థులు చాలా చోట్ల డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేయాలని ప్రయత్నించినా తాము వైసీపీకే ఓటు వేస్తామని ఓటర్లు శాపనార్థాలు పెట్టినట్టు సమాచారం అందుతోంది.
 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>