PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-vs-jagan-who-is-the-real-hero-of-the-poor0206e4a1-48cf-4d23-ae43-120c7a3dca3a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-vs-jagan-who-is-the-real-hero-of-the-poor0206e4a1-48cf-4d23-ae43-120c7a3dca3a-415x250-IndiaHerald.jpg- పేద‌రికంపై పోరులో జ‌గ‌న్ హీరో అన్న ప్ర‌పంచ సంస్థ‌లు - అన్న క్యాంటిన్లు, రంజాన్ తోఫా, సంక్రాంతి, క్రిస్మ‌స్ కానుక‌లిచ్చిన బాబు ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) అటు కేంద్ర‌మైనా.. ఇటు రాష్ట్ర‌మైనా.. ప‌నిచేసేది.. కేవ‌లం ఉన్న‌వారి కోసం కాదు. బిలో పోవ‌ర్టీ లైన్‌.. అంటే పేదరిక రేఖ‌కు దిగువన ఉన్న‌వారి కోసమే ఏ ప్ర‌భుత్వ‌మైనా ప‌నిచేస్తుంది. గ‌తంలో ఇందిర‌మ్మ హ‌యాం నుంచి ఇప్ప‌టి మోడీ వ‌ర‌కు.. కూడా పేద‌ల‌ను సెంట్రిక్గా చేసుకుని అనేక ప‌థ‌కాలు తీసుకువ చ్చారు. గ‌రీబీ హ‌ఠావో! నినాదం ఇందిర‌మ్మ ఇస్తే.. పేద‌రిక AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; jagan; yvcp; tdp; chandrababu; poor{#}Ramzan;Amaravathi;India;Hero;YCPచంద్ర‌బాబు Vs జ‌గ‌న్‌: పేద‌ల నిజ‌మైన హీరో ఎవ‌రు..?చంద్ర‌బాబు Vs జ‌గ‌న్‌: పేద‌ల నిజ‌మైన హీరో ఎవ‌రు..?AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; jagan; yvcp; tdp; chandrababu; poor{#}Ramzan;Amaravathi;India;Hero;YCPSun, 12 May 2024 08:49:00 GMT- పేద‌రికంపై పోరులో జ‌గ‌న్ హీరో అన్న ప్ర‌పంచ సంస్థ‌లు
- అన్న క్యాంటిన్లు, రంజాన్ తోఫా, సంక్రాంతి, క్రిస్మ‌స్ కానుక‌లిచ్చిన బాబు

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

అటు కేంద్ర‌మైనా.. ఇటు రాష్ట్ర‌మైనా.. ప‌నిచేసేది.. కేవ‌లం ఉన్న‌వారి కోసం కాదు. బిలో పోవ‌ర్టీ లైన్‌.. అంటే పేదరిక రేఖ‌కు దిగువన ఉన్న‌వారి కోసమే ఏ ప్ర‌భుత్వ‌మైనా ప‌నిచేస్తుంది. గ‌తంలో ఇందిర‌మ్మ హ‌యాం నుంచి ఇప్ప‌టి మోడీ వ‌ర‌కు.. కూడా పేద‌ల‌ను సెంట్రిక్గా చేసుకుని అనేక ప‌థ‌కాలు తీసుకువ చ్చారు. గ‌రీబీ హ‌ఠావో! నినాదం ఇందిర‌మ్మ ఇస్తే.. పేద‌రిక నిర్మూల‌న అని మోడీ అంటున్నారు. గ‌డిచిన ప‌దేళ్ల‌లో తాము 2 కోట్ల మంది పేద‌ల‌ను పేద‌రికం నుంచి బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చామ‌ని చెబుతున్నారు.


ఇదే సూత్రాన్ని ఏపీకి అన్వ‌యించుకుంటే.. పేద‌రికంపై పోరు ఎవ‌రు చేశారు. అంటే.. 2014-2024 వ‌ర‌కు పేద‌ల‌ను ఎవ‌రు బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చారు? అనే ప్ర‌శ్న వేసుకుంటే.. స్టాండ‌ర్డ్ స్కీం అనే మాట చెప్పుకో వాలి. ఇది కొంత లోతుగా ప‌రిశీలించాల్సి విష‌యం. పేద‌ల‌ను అప్ప‌టిక‌ప్పుడు.. ఆదుకోవ‌డం ఒక మాట‌. అంటే.. వారికి ఆ రోజుకు పూట‌గ‌డిచేలా చేయ‌డం ఒక విధానం. దీంతో పాటు వారికి ఇళ్లు క‌ట్టించి లేదా.. స్థ‌లాలు ఇచ్చి.. ఆర్థికంగా వారిని ఆదుకునేలా చేయ‌డం అనేది మ‌రో కాన్సెప్ట్‌.


ఈ రెండు విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. చంద్ర‌బాబు తాత్కాలిక మెరుగుద‌ల కోసం చేసిన ప్ర‌య‌త్న‌మే ఎక్కు వ‌గా క‌నిపిస్తుంది. రంజాన్ తోఫా, సంక్రాంతి, క్రిస్మ‌స్ కానుక‌లు ఈ కోవ‌లేవే. ఇక‌, రేష‌న్ పంపిణీలో స‌రుకు లు పెంచ‌డం(టీడీపీ చెబుతున్న‌ది ఇదే) వంటివి చేసిన మాట నిజం. మ‌రో కీల‌క నిర్ణ‌యం.. అన్న క్యాంటీ న్లు. ఇవి కూడా.. పేద‌ల ఆక‌లిని అయితే తీర్చాయి. కాద‌న‌లేని వాస్త‌వం. అయితే.. ఇవి తాత్కాలికంగా మారాయి. అంటే.. పేద‌రికాన్ని పూర్తిగా నిర్మూలించే చ‌ర్య‌లుగా మాత్రం రాలేక పోయాయి.


ఇక‌, జ‌గ‌న్ హ‌యాంకు వ‌చ్చే స‌రికి.. పేద‌రికాన్ని నిర్మూలించే క్ర‌తువులో భాగంగా ఆయ‌న ఒక‌వైపు రేష‌న్ ఇస్తూనే మ‌రోవైపు.. చేతి నిండా ఏదో ఒక ప‌థ‌కం రూపంలో సొమ్ములు ఇచ్చారు. అదేవిధంగా ఇళ్లు లేని వారికి ఏకంగా.. స్థ‌లాలు పంచారు. ఇది పేదరికంపై నిజ‌మైన పోరుగా .. ప్రపంచ స్థాయి సంస్థ‌లు పేర్కొన్నాయి. కేంద్రం కూడా.. గ‌త ఏడాది ఇచ్చిన పేద‌రిక అంచ‌నా రాష్ట్రాల్లో ఏపీలో చాలా వ‌ర‌కు పేద‌రికం త‌గ్గిపోయింద‌ని.. ప్ర‌జ‌ల కొనుగోలు శ‌క్తి.. పెరిగిన‌ట్టు పేర్కొంది. పేద‌రికాన్ని ఎప్పుడూ కూడా.. కొనుగోలు శ‌క్తితోనే పోలుస్తారు కాబ‌ట్టి.. వైసీపీకి ఇది క‌లిసి వ‌చ్చింది. అయితే.. ఏదీ కూడా.. చేప‌ట్టిన వెంట‌నే అయిపోదు.. క‌దా! వైసీపీ కూడా అంతే! అయితే.. బాబుతో పోలిస్తే. మాత్రం చాలా బెట‌ర‌నే చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>