EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kejriwala47ea7ba-cccd-4ec2-bbdb-fde647673fa5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kejriwala47ea7ba-cccd-4ec2-bbdb-fde647673fa5-415x250-IndiaHerald.jpgసార్వత్రిక ఎన్నికలు పతాక స్థాయికి చేరిన వేళ దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింత్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. మద్యం విధానంతో ముడి పడిన మనీ లాండరింగ్ కేసులో సుప్రీం కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఒక జాతీయ పార్టీ అధినేతగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తూ జూన్ 1 వరకు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం శుక్రవారం తెలిపింది. బెయిల్ పై కేజ్రీవాల్ విడుదలను వ్యతిరేకించిన ఈడీ వాదనలను తోసిపుచ్చింది. జూన్ 1న చివరkejriwal{#}Sanjeev;Supreme Court;Lawyer;Friday;court;Arvind Kejriwal;history;KCR;June;Elections;Partyసీక్రెట్‌: కవితకు రాని బెయిల్‌.. కేజ్రీవాల్‌కు ఎలా వచ్చింది?సీక్రెట్‌: కవితకు రాని బెయిల్‌.. కేజ్రీవాల్‌కు ఎలా వచ్చింది?kejriwal{#}Sanjeev;Supreme Court;Lawyer;Friday;court;Arvind Kejriwal;history;KCR;June;Elections;PartySun, 12 May 2024 09:30:00 GMTసార్వత్రిక ఎన్నికలు పతాక స్థాయికి చేరిన వేళ దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్   అరవింత్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. మద్యం విధానంతో ముడి పడిన మనీ లాండరింగ్ కేసులో సుప్రీం కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఒక జాతీయ పార్టీ అధినేతగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తూ జూన్ 1 వరకు బెయిల్ మంజూరు చేసింది.


ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం శుక్రవారం తెలిపింది. బెయిల్ పై కేజ్రీవాల్ విడుదలను వ్యతిరేకించిన ఈడీ వాదనలను తోసిపుచ్చింది. జూన్ 1న చివరి విడత ఎన్నికలు పోలింగ్ ముగుస్తుంది. ఆ మరుసటి రోజే జూన్ 2 న తిహాడ్ జైలుకి వెళ్లి కేజ్రీవాల్ లొంగిపోవాలని ఆదేశించింది. గంటల వ్యవధిలోనే పూచీకత్తు నిబంధనలు పూర్తి చేసి జైలు అధికారులకు సమర్పించడంతో 50 రోజులుగా జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న ఆయన శుక్రవారం సాయంత్రం విడుదల అయ్యారు.


ఎన్నికల ప్రచారం కోసం బెయిల్ ఇవ్వడం గతంలో ఎన్నడూ లేదంటూ ఈడీ తరఫు న్యాయవాది అభ్యంతరం లేవనెత్తారు. కేజ్రీవాల్ కు మధ్యంతర ఉపశమనాన్ని గట్టిగా వ్యతిరేకించారు. అయితే ఈ వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. బెయిల్ అంశాన్ని పరిశీలించాల్సినప్పుడు సంబంధిత వ్యక్తి చుట్టూ ఉండే పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. అయిదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలు చాలా ముఖ్యమైనవి.


97 కోట్ల మంది ఇందులో భాగస్వాములు అవుతున్నారు. ఆయన ఇంకా దోషిగా తేలలేదు. ఎటువంటి నేర చరిత్ర లేదు. ఇది జాతీయ పార్టీ అధ్యక్షుడు కాబట్టి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు వివరించింది. అయితే ఇదే సమయంలో కేసీఆర్ కుమార్తె కు బెయిల్ ఎందుకు రాలేదంటే.. ఆమె తన కుమారుడి పరీక్షలు ఉన్నాయని.. ఒక తల్లిగా నేను పక్కన ఉండాలని  పిటిషన్ వేయగా.. కోర్టు తిరస్కరించింది.  కేజ్రీవాల్ తన అరెస్టును ఛాలెంజ్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల నేపథ్యంలోనే ఆయనకు బెయిల్ వచ్చింది.  అందవల్లే కవితకు రాలేదని స్పష్టం అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>