PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/chandrababu270be65a-30cf-4f78-9bb5-862da0607af1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/chandrababu270be65a-30cf-4f78-9bb5-862da0607af1-415x250-IndiaHerald.jpgఏపీలో రాజకీయం క్లైమాక్స్ కి చేరింది. పోలింగ్ కు మరి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ప్రస్తుతం ప్రత్యర్థులను రాజకీయంగా విమర్శించే అవకాశం కూడా లేదు. అయితే జగన్ ఇటీవల కొన్ని న్యూస్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తన సోదరి షర్మిల గురించి పలు సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ కక్షతోనే ప్రత్యర్థి పార్టీలతో చేతులు కలిపి..కుటుంబంలో చీలిక తెచ్చారని ఆరోపించారు. అంతేకాదు చంద్రబాబుతో మిలాఖత్ అయ్యారని విమర్శించారు. ఈ మేరకు తన సొంత మీడియాలో వార్తా కథనాలు, పార్టీ నాయకుల చేత విమర్శలు చchandrababu{#}CBN;Andhra Pradesh;Jagan;Sharmila;Congress;Party;Electionsపచ్చ కుట్రలు పీక్‌: వైఎస్‌ కుటుంబాన్ని కూడా చీల్చిన బాబు?పచ్చ కుట్రలు పీక్‌: వైఎస్‌ కుటుంబాన్ని కూడా చీల్చిన బాబు?chandrababu{#}CBN;Andhra Pradesh;Jagan;Sharmila;Congress;Party;ElectionsSun, 12 May 2024 10:10:00 GMTఏపీలో రాజకీయం క్లైమాక్స్ కి చేరింది. పోలింగ్ కు మరి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ప్రస్తుతం ప్రత్యర్థులను రాజకీయంగా విమర్శించే అవకాశం కూడా లేదు. అయితే జగన్ ఇటీవల కొన్ని న్యూస్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తన సోదరి షర్మిల గురించి పలు సంచలన ఆరోపణలు చేశారు.


రాజకీయ కక్షతోనే ప్రత్యర్థి పార్టీలతో చేతులు కలిపి..కుటుంబంలో చీలిక తెచ్చారని ఆరోపించారు. అంతేకాదు చంద్రబాబుతో మిలాఖత్ అయ్యారని విమర్శించారు. ఈ మేరకు తన సొంత మీడియాలో వార్తా కథనాలు, పార్టీ నాయకుల చేత విమర్శలు చేయించారు. దీంతో షర్మిల విలేకరుల సమావేశం నిర్వహించి వీటన్నింటికీ కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో జగనన్నా అంటూ కంటతడి కూడా పెట్టారు. జగన్ జైలుకి వెళ్లిన సమయంలో తాను పార్టీకి చేసిన సేవను గుర్తు చేశారు.

అయితే జగన్ ఆరోపిస్తున్నట్లు షర్మిల నిజంగానే చంద్రబాబుతో మిలాఖత్ అయ్యారా అంటే.. ఆమె ప్రస్తుతం ఏపీ పీసీసీ అధ్యక్షురాలు. కాంగ్ఎస్ జాతీయ పార్టీ. ఇందులో ఆమె సొంత నిర్ణయాలు అంటూ ఏమీ ఉండవు. అన్నీ పార్టీ చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. ఒకవేళ పార్టీ రహస్యంగా చంద్రబాబు కు సహకరించాలని చెబుదామన్నా.. ఆయన సింగిల్ గా ఏమీ లేరు. ఎన్డీయే కూటమి లో భాగస్వామిగా ఉన్నారు.

ఇలాంటి సమయంలో చంద్రబాబు కోసం కాంగ్రెస్ పార్టీ ఎందుకు పనిచేస్తుంది అనే అనుమానం వ్యక్తం అవుతుంది. మరోవైపు షర్మిల కూడా తన అన్ననే టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు తప్ప బీజేపీని, టీడీపీని పల్లెత్తు మాట అనడం లేదు. ప్రారంభంలో బీజేపీపై కొన్ని విమర్శలు చేసినా.. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆమె వైసీపీపై మాత్రమే డోస్ పెంచుతూ.. మిగతా పార్టీలను వదిలేశారు. దీంతో ప్రజల్లో కూడా నిజంగానే షర్మిల, చంద్రబాబు కలిసిపోయారా అనే అనుమానం వచ్చేలా వ్యవహరించారు. మొత్తం మీద ఆమె అన్ని పార్టీలను సమానంగా విమర్శిస్తే.. ఈ పరిస్థితి వచ్చేది కాదన్నది విశ్లేషకుల అభిప్రాయం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>