PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-chandra-babu6760d2e1-7ab4-42c8-8b98-d135c71419c7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-chandra-babu6760d2e1-7ab4-42c8-8b98-d135c71419c7-415x250-IndiaHerald.jpgఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఎన్నో హామీలను పొందుపరిచారు. ఆ హామీలను నెరవేర్చాలంటే కనీసం ఒక లక్ష 50 వేల కోట్లు అవసరమవుతాయని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. సంవత్సరానికి సంక్షేమ పథకాల కోసం 70 వేల కోట్లు ఖర్చు పెట్టడమే తలకు మించిన భారంగా మారిందని అన్నారు. అంతకుమించి ఎక్కువ ప్రజల కోసం ఖర్చు పెట్టే పరిస్థితిలో ఏపీ లేదని తేల్చి చెప్పారు. చంద్రబాబు మాత్రం తాను సంపద క్రియేట్ చేసి ప్రజలకు పంచి పెడతానని అంటున్నారు. jagan chandra babu{#}sampada;Letter;Assembly;gold;Andhra Pradesh;Reddy;CBN;Jagan`అమ్మ ఒడి`పై కూట‌మి వ‌ర్సెస్ జ‌గ‌న్‌.. ఎవ‌రిని న‌మ్మాలి..?`అమ్మ ఒడి`పై కూట‌మి వ‌ర్సెస్ జ‌గ‌న్‌.. ఎవ‌రిని న‌మ్మాలి..?jagan chandra babu{#}sampada;Letter;Assembly;gold;Andhra Pradesh;Reddy;CBN;JaganSun, 12 May 2024 15:19:00 GMTఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఎన్నో హామీలను పొందుపరిచారు. ఆ హామీలను నెరవేర్చాలంటే కనీసం ఒక లక్ష 50 వేల కోట్లు అవసరమవుతాయని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. సంవత్సరానికి సంక్షేమ పథకాల కోసం 70 వేల కోట్లు ఖర్చు పెట్టడమే తలకు మించిన భారంగా మారిందని అన్నారు. అంతకుమించి ఎక్కువ ప్రజల కోసం ఖర్చు పెట్టే పరిస్థితిలో ఏపీ లేదని తేల్చి చెప్పారు. చంద్రబాబు మాత్రం తాను సంపద క్రియేట్ చేసి ప్రజలకు పంచి పెడతానని అంటున్నారు.

వాస్తవానికి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా ఏపీ రాష్ట్రంలో సంపద సృష్టించలేదు. ఆయన ఉన్న కాలంలో అప్పులయ్యాయే తప్ప రాష్ట్రం సొంతంగా సంపద సృష్టించిన దాఖలాలు లేవు ఈ విషయాన్ని జగన్ ను ఒకానొక సమయంలో అఫీషియల్ స్టాటిస్టిక్స్ తో సహా వెల్లడించారు. చంద్రబాబు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి అమ్మ ఒడి కింద రూ.15 వేలు ఇస్తానని తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. కానీ ఇది ఎవ‌రికీ సాధ్యం కాని పని అని స్పష్టంగా చెప్పవచ్చు. ఒక్క‌రికి ఇచ్చేందుకే రూ.6 వేల కోట్ల‌కు పైగా ఖ‌ర్చ‌వుతోంది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి ఇవ్వాలంటే ఖర్చు తడిసి మోపెడవుతుంది. చంద్రబాబు పెన్షన్లు కూడా ఎక్కువగా ఇస్తానని మాటిచ్చారు. ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కాదు.

జగన్ అమ్మ ఒడి ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఇవ్వగలనని చెప్పారు. ఎందుకంటే ఒక్క‌రికి మాత్రమే సాధ్యమవుతుంది. చెబితే కచ్చితంగా ఇచ్చే నైజం జగన్ ది కాబట్టి ఎక్కువగా హామీ ఇవ్వదలుచుకోలేదు. చంద్రబాబు ఎలాగూ ఇవ్వరు కాబట్టి నరం లేని నాలుకతో ఇష్ట రాజ్యాంగ హామీలు ఇచ్చుకుంటూ వెళ్లిపోయారు. గతంలో కూడా ఆయన అంతే హామీలను ఇచ్చారు కానీ వాటిలో ఒకటి కూడా నెరవేర్చుకోలేదు ఈ సంగతి ఏపీ ప్రజలకు తెలియనిది కాదు. సో, ఎన్ని ప్రలోభాలకి గురి చేయాలని చంద్రబాబు ట్రై చేసినా వలలో పడేంత అమాయకమైన ప్రజలు ఏపీలో ఎవరూ లేరు. బాబు ప్రతి ఇంటికి జాబు అన్నారు కానీ ఏమైంది? కోటి ఉద్యోగాలు, బెంజ్ కార్లు, కిలో బంగారం అంటూ బాబు ఇస్తున్న హామీలు చూస్తుంటే ఎవరికైనా ఆయన ఒట్టి మాటలు మాత్రమే చెబుతూ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారనే విషయం అర్థమవుతుంది కాబట్టి చంద్రబాబుని నమ్మితే నిండా మునిగిపోతారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>