PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-pitapuram-vangageetha-janasena-ycp-tdpfa802220-c550-4dfe-872e-87a3819c3213-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-pitapuram-vangageetha-janasena-ycp-tdpfa802220-c550-4dfe-872e-87a3819c3213-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఏపీలో ఏం నడుస్తుందయ్యా అంటే ఎలక్షన్ ఫీవర్ నడుస్తుందని చెప్పవచ్చు. ఏపీలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు ఒక లెక్క ఉంటే, పిఠాపురం నియోజకవర్గంలో మరో లెక్క ఉంది. ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండే ఏ హీరోనైనా తెరమీద చూసి ఉంటారు.కానీ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు మాత్రం డైరెక్టుగా చూసే అవకాశం పవన్ కళ్యాణ్ వల్ల దక్కింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభ్యర్థిగా పిఠాపురం నియోజకవర్గం లో పోటీ చేస్తున్నారు.ఈ ఎన్నిక ఆయనకు చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. ఒకవేళ ఇక్కడ ఓడితే మాత్రం పవన్ కళ్యాPawan;pitapuram;vangageetha;janasena;ycp;tdp{#}Telugu;kalyan;pithapuram;Party;Andhra Pradeshఏపీ: పవన్ పిఠాపురంలో గెలిస్తే జరిగేది ఇదేనా..?ఏపీ: పవన్ పిఠాపురంలో గెలిస్తే జరిగేది ఇదేనా..?Pawan;pitapuram;vangageetha;janasena;ycp;tdp{#}Telugu;kalyan;pithapuram;Party;Andhra PradeshSun, 12 May 2024 08:21:00 GMT ప్రస్తుతం ఏపీలో ఏం నడుస్తుందయ్యా అంటే ఎలక్షన్ ఫీవర్ నడుస్తుందని చెప్పవచ్చు. ఏపీలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు ఒక లెక్క ఉంటే, పిఠాపురం నియోజకవర్గంలో మరో లెక్క ఉంది. ఇప్పటివరకు  తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండే ఏ హీరోనైనా తెరమీద చూసి ఉంటారు.కానీ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు మాత్రం డైరెక్టుగా చూసే అవకాశం పవన్ కళ్యాణ్ వల్ల దక్కింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభ్యర్థిగా పిఠాపురం నియోజకవర్గం లో పోటీ చేస్తున్నారు.ఈ ఎన్నిక ఆయనకు చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. ఒకవేళ ఇక్కడ ఓడితే మాత్రం పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం ముగిసినట్టే.  దీంతో ఆయన దీన్ని ఎంతో కీలకంగా తీసుకొని మరీ ప్రచారంలో మునిగిపోయారు. 

అంతేకాకుండా ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు కమెడియన్లు అందరిని అక్కడికి తీసుకు వచ్చి ప్రచారం చేయించుకుంటున్నారు. ఈ విధంగా చేసినా కానీ పవన్ కళ్యాణ్ కు గెలుపుపై ధీమా రావడం లేదు. ఒక మహిళ నాయకురాల్ని ఓడించడం కోసం ఇన్ని కుయుక్తులు పన్నుతున్నాడని చాలామంది అనుకుంటున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ అక్కడ గెలిస్తే సరికొత్తగా అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రతిసారి ప్రచారంలో వాగ్దానాలు ఇస్తున్నాడు. ఇదే తరుణంలో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అదేంటంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే అభివృద్ధి కంటే ఎక్కువ ఆయన మరో పనుల్లో వెళ్తారని అంటున్నారు. ఆయన గెలిచినా, ఓడినా ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్, హరహర వీరమల్లు, ఓజి వంటి పెద్ద సినిమాల షూటింగ్లో పాల్గొంటారనే వార్త వినిపిస్తోంది.

 ఈ సినిమాలకు సంబంధించి ఆయన కమిట్మెంట్ తీసుకున్నారని, ఎన్నికల ముగిసిన వెంటనే నెలరోజుల పాటు  రెస్ట్ తీసుకొని ఆ తర్వాత వరుసగా షూటింగ్లలో పాల్గొంటారని కొంతమంది ఆరోపిస్తున్నారు. మరి ఇలాంటి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే అభివృద్ధి ఏం చేస్తారు. అభివృద్ధి కంటే ఎక్కువ ఆయన తన సొంత కెరియర్ పైన దృష్టి పెడతారని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తూ వస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నేను పిఠాపురం అంటే ఆంధ్రప్రదేశ్ లోనే అద్భుతమైన నియోజకవర్గంగా  తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నారు. చూడాలి పిఠాపురం ప్రజలు వంగ గీతవైపు ఉన్నారా పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారా అనేది ఎన్నికల రిజల్ట్ తర్వాత తెలియనుంది..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>