PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/nara-bhuvaneshwari-can-she-make-her-husband-win8ae76e53-2920-4b5f-8cb5-320aee099da6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/nara-bhuvaneshwari-can-she-make-her-husband-win8ae76e53-2920-4b5f-8cb5-320aee099da6-415x250-IndiaHerald.jpgఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు ఎదురుగాలి వీస్తోందని ఇప్పటికే పలు సర్వేల ద్వారా వెల్లడైంది. తాజాగా వెలువడిన రేస్ సర్వే ఫలితాలలో సైతం కుప్పంలో బాబు ఓటమి ఖాయమని తేలిపోయింది. కుప్పంలో చంద్రబాబు ఓటమి పాలైతే మాత్రం చంద్రబాబుకు అంతకు మించిన అవమానం అయితే ఉండదు. బాబును ఓడించడానికి ఉన్న ఏ అవకాశాన్ని వైసీపీ వదులుకోవడం లేదు. kuppam{#}bhuvaneshwari;Chittoor;Nara Bhuvaneshwari;media;bharath;Sri Bharath;kuppam;TDP;Party;CBN;Survey;YCP;Jaganకుప్పంలో తేడా కొడుతుంది.. భువనేశ్వరి మనీ మేనేజ్ మెంట్ మొదలైందా?కుప్పంలో తేడా కొడుతుంది.. భువనేశ్వరి మనీ మేనేజ్ మెంట్ మొదలైందా?kuppam{#}bhuvaneshwari;Chittoor;Nara Bhuvaneshwari;media;bharath;Sri Bharath;kuppam;TDP;Party;CBN;Survey;YCP;JaganSun, 12 May 2024 12:40:00 GMTఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు ఎదురుగాలి వీస్తోందని ఇప్పటికే పలు సర్వేల ద్వారా వెల్లడైంది. తాజాగా వెలువడిన రేస్ సర్వే ఫలితాలలో సైతం కుప్పంలో బాబు ఓటమి ఖాయమని తేలిపోయింది. కుప్పంలో చంద్రబాబు ఓటమి పాలైతే మాత్రం చంద్రబాబుకు అంతకు మించిన అవమానం అయితే ఉండదు. బాబును ఓడించడానికి ఉన్న ఏ అవకాశాన్ని వైసీపీ వదులుకోవడం లేదు.
 
కుప్పం వైసీపీ అభ్యర్థి భరత్ గత మూడేళ్లుగా కుప్పంలో గెలుపు కోసం అహర్శిషలు శ్రమిస్తున్నారు. కుప్పం ప్రజలకు మేలు చేసేలా నియోజకవర్గంలో వైసీపీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. భరత్ ను గెలిపిస్తే కుప్పంను మరింత అభివృద్ధి చేస్తానని జగన్ చాలా సందర్భాల్లో మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ అంతర్గత సర్వేలలో సైతం స్థానికంగా తేడా కొడుతోందని వెల్లడైనట్టు తెలుస్తోంది.
 
కుప్పం నియోజకవర్గంలో భువనేశ్వరి మనీ మేనేజ్ మెంట్ మొదలైందని గెలుపు కోసం ఏ నియోజకవర్గంలో ఖర్చు చేయని విధంగా ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే మంత్రాలకు చింతకాయలు రాలవు అనే విధంగా భువనేశ్వరి ఎంత కష్టపడినా ఈ ఎన్నికల్లో కూటమికి అనుకూల ఫలితాలు రావడం సులువు కాదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
74 సంవత్సరాల వయస్సులో చంద్రబాబుకు కుప్పంలో ఘోర పరాజయం ఎదురైతే మాత్రం ఈ నియోజకవర్గంలో పార్టీ ఎప్పటికీ పుంజుకునే ఛాన్స్ అయితే ఉండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భువనేశ్వరికి సైతం రాజకీయాల గురించి అనుభవం కానీ అవగాహన కానీ లేవు. ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఏం జరుగుతుందో చూడాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబుకు ఇంత ఇబ్బందికర పరిస్థితి గతంలో ఎప్పుడూ రాలేదని భవిష్యత్తులో కూడా ఎప్పుడూ రాకపోవచ్చని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ వ్యూహాలకు ప్రతివ్యూహాలను అమలు చేసే విషయంలో చంద్రబాబు చిత్తు అవుతున్నాడని తెలుస్తోంది. చంద్రబాబుకు ఈ ఎన్నికల ఫలితాలతో చుక్కలు కనిపించడం ఖాయమని తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>