Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawanab965dd8-852c-4589-ad69-6dc88d7033d9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawanab965dd8-852c-4589-ad69-6dc88d7033d9-415x250-IndiaHerald.jpgపచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది అన్న రేంజ్ లో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఒకేసారి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉండడంతో.. అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే గెలుపు గుర్రాలను బరిలోకి దింపాం. ఈసారి తప్పకుండా మాదే విజయం అంటూ ఇక ఒక వైపు టిడిపి వైసిపి పార్టీలు ఎంతో ధీమాతో ఉన్నాయ్. కానీ ఒక పవన్ కళ్యాణ్ వ్యవహారం మాత్రం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ క్రమంలోనే ప్రచారంలో దూసుకుపోయారు. ఆPawan{#}Ram Charan Teja;MLA;Film Industry;Elections;Assembly;TDP;Andhra Pradesh;pithapuram;kalyan;Janasena;mediaప్చ్ ప‌వ‌నూ... చివ‌ర‌కు వ‌దిన‌మ్మ సురేఖ‌... అన్న కొడుకు చ‌ర‌ణ్‌తోనూ...?ప్చ్ ప‌వ‌నూ... చివ‌ర‌కు వ‌దిన‌మ్మ సురేఖ‌... అన్న కొడుకు చ‌ర‌ణ్‌తోనూ...?Pawan{#}Ram Charan Teja;MLA;Film Industry;Elections;Assembly;TDP;Andhra Pradesh;pithapuram;kalyan;Janasena;mediaSun, 12 May 2024 15:30:00 GMTపచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది అన్న రేంజ్ లో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఒకేసారి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉండడంతో.. అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే గెలుపు గుర్రాలను బరిలోకి దింపాం. ఈసారి తప్పకుండా మాదే విజయం అంటూ ఇక ఒక వైపు టిడిపి వైసిపి పార్టీలు ఎంతో ధీమాతో ఉన్నాయ్. కానీ ఒక పవన్ కళ్యాణ్ వ్యవహారం మాత్రం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.


 ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ క్రమంలోనే ప్రచారంలో దూసుకుపోయారు. ఆయనకు మద్దతుగా దాదాపుగా చిత్ర పరిశ్రమ మొత్తం తరలివచ్చింది. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరూ కాదనకుండా అందరూ ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షమైపోయారు. ఇక కొంతమంది సోషల్ మీడియా ద్వారా మద్దతు పలికారు. పవన్ కళ్యాణ్ గెలిపించండి ప్రజా గొంతుకను అసెంబ్లీలో వినిపిస్తాడు అంటూ ఇక ఇలా పవన్ కు మద్దతుగా ప్రచారం చేసిన ప్రతి ఒక్కరూ ఓటర్లను అభ్యర్థించారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా ఎందుకు పవన్ మరి ఇంతలా మద్దతు కోరుకుంటున్నారు అన్నది అందరిలో నెలకొన్న ప్రశ్న.


 గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల కూడా ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి రాజకీయాలకు విరామం ఇవ్వకుండా.. ప్రజల పక్షాన నిలబడుతూనే ఉన్నారు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు నేనున్నాను అనే భరోసా ఇస్తూ వస్తున్నారు. తనను గెలిపిస్తే ఏం చేస్తాను అన్న విషయాన్ని కూడా ఎన్నోసార్లు చెప్పారు. ఇలా  ఎన్నో రోజులుగా ప్రజల్లోనే ఉంటున్న పవన్ ఇంకా ప్రజలు తనను నమ్మలేదు అని అనుకుంటున్నాడు. ఇన్నాళ్లు ప్రజల్లో ఉంటూ ప్రజల కోసమే పని చేసిన తనకు ఇండస్ట్రీని మొత్తం పిలిపించుకుని ప్రచారం చేయించుకోవాల్సిన అవసరం ఏముంది అని పవన్ ఎందుకు అనుకోవట్లేదు. టిడిపి తో కలిసి కొనసాగుతున్న పవన్ ను అటు ప్రజలు నమ్మలేదు అన్న విషయం పవన్ కు కూడా అర్థమయ్యే ఉంటుంది అని కొంతమంది అనుకుంటున్నారట. చివరికి ఇక తన అన్న కొడుకు రామ్ చరణ్ ఇక వదినమ్మ సురేఖను కూడా వదలకుండా రాజకీయాలకు దూరంగా ఉండే వాళ్ళని కూడా ప్రచార రంగంలోకి దింపి తన గెలుపు కోసం ప్రచారం చేయించుకున్నాడు  దీంతో పవన్ కు తన మీద తనకే నమ్మకం లేకుండా పోయిందా అనే చర్చ కూడా మొదలైంది అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>