Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollyaood30e47bcb-701e-41bd-95bb-2908f3b542e8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollyaood30e47bcb-701e-41bd-95bb-2908f3b542e8-415x250-IndiaHerald.jpgసంయుక్త మేనన్.. అచ్చం స్టార్ హీరోయిన్ సమంత పోలికలను కలిగి ఉండే ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. మలయాళ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ సొగసరి వచ్చిన తక్కువ సమయంలోనే మంచి హిట్లను ఖాతాలో వేసుకుంది. దీంతో ఎంతో మంది డైరెక్టర్లకు లక్కీ హీరోయిన్ అనే పేరును కూడా సంపాదించుకుంది సంయుక్తా. సాయి దుర్గ తేజ్ హీరోగా సంయుక్త మేనన్ హీరోయిన్గా వచ్చిన విరుపాక్ష మూవీ ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరోవైపు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో కలTollyaood{#}Kollywood;Heroine;Makeup;Success;Industry;Cheque;Hero;Tollywood;Cinema;Teluguతెలుగు సినిమాల్లో నటించడం చాలా కష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్?తెలుగు సినిమాల్లో నటించడం చాలా కష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్?Tollyaood{#}Kollywood;Heroine;Makeup;Success;Industry;Cheque;Hero;Tollywood;Cinema;TeluguSat, 11 May 2024 09:15:00 GMTసంయుక్త మేనన్.. అచ్చం స్టార్ హీరోయిన్ సమంత పోలికలను కలిగి ఉండే ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. మలయాళ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ సొగసరి వచ్చిన తక్కువ సమయంలోనే మంచి హిట్లను ఖాతాలో వేసుకుంది. దీంతో ఎంతో మంది డైరెక్టర్లకు లక్కీ హీరోయిన్ అనే పేరును కూడా సంపాదించుకుంది సంయుక్తా. సాయి దుర్గ తేజ్ హీరోగా సంయుక్త మేనన్ హీరోయిన్గా వచ్చిన విరుపాక్ష మూవీ ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


 మరోవైపు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో కలిసి నటించిన సార్ మూవీ కూడా టాలీవుడ్ లో మంచి హిట్ సాధించడంతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయింది ఈ హీరోయిన్. అయితే ఇలా వరుసగా విజయాలు సాధించినప్పటికీ తెలుగులో మాత్రం ఎందుకో పెద్దగా అవకాశాలు అందుకోవట్లేదు. ప్రస్తుతం టాలీవుడ్లో అడపాదడపా అవకాశాలు మాత్రమే ఈ హీరోయిన్ తలుపు తడుతూ ఉన్నాయి. దీంతో మరోసారి అటు కోలీవుడ్ ఇండస్ట్రీ పైన దృష్టి పెట్టింది సంయుక్త మేనన్. అయితే టాలీవుడ్ సినిమాలలో నటించడంపై ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ ముద్దుగుమ్మ.


 ఈ క్రమంలోనే తెలుగు సినిమాలపై సంయుక్త మేనన్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయ్. తెలుగు సినిమాల్లో నటించడం తనకు ఎంతో కష్టం అంటూ చెప్పుకొచ్చింది హీరోయిన్ సంయుక్త. మలయాళ సినిమాలు చేయడమే ఎంతో ఈజీ అంటూ చెప్పుకొచ్చింది. తెలుగు భాష రాకపోవడం ఒక కారణం అయితే.. మేకప్ భారీగా వేసుకోవాల్సిన రావటం  మరో ఇబ్బంది అంటూ తెలిపింది. మలయాళ సినిమాలలో ఎక్కువగా మేకప్ వెయ్యరు. కానీ తెలుగులో భారీగా మేకప్ వేయాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఇక ముఖంపై ఏదో బరువు మోస్తున్న ఫీలింగ్ ఉంటుంది అంటూ సంయుక్త చేసిన కామెంట్స్ కాస్త ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>