PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politics-poling-station149834b9-8958-4290-bd43-4074e6335fcb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politics-poling-station149834b9-8958-4290-bd43-4074e6335fcb-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సరిగ్గా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడెక్కడ ఉన్న ఓటర్లంతా తమ సొంత నియోజకవర్గాలకు వచ్చి ఓటు వేయడానికి సిద్ధమవుతున్నారు.. అయితే ఈసారి ఎన్నికల పోలింగ్ శాతం పెంచే విధంగా అధికారులు మరింత చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇక షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఎన్నికల కోడ్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఈసారి లోక్సభ ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతుండగా మొదటి దశ ఓటింగ్ ఏప్రిల్ 19న జరిగింది.. ఇప్పుడు మే 13వ తేదీన మరొక దశ ఓటింగ్ జరగబోతోంది.. ఈ నేపథ్యంలోనే మీరు ఓటు వేయడAP;POLITICS;POLING STATION{#}Adah Sharma;E-mail;Smart phone;News;India;District;Electionsమీ పోలింగ్ స్టేషన్ ఎక్కడుంది?ఈ చిన్న ట్రిక్ తో సమాచారం..!మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడుంది?ఈ చిన్న ట్రిక్ తో సమాచారం..!AP;POLITICS;POLING STATION{#}Adah Sharma;E-mail;Smart phone;News;India;District;ElectionsSat, 11 May 2024 11:00:00 GMTvoterportal.eci.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.

* మొబైల్ వుంటే చిటికెలో సమాచారం

•ఓటు హక్కు వినియోగించుకోవడం తప్పనిసరి..


(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)

ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సరిగ్గా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడెక్కడ ఉన్న ఓటర్లంతా తమ సొంత నియోజకవర్గాలకు వచ్చి ఓటు వేయడానికి సిద్ధమవుతున్నారు.. అయితే ఈసారి ఎన్నికల పోలింగ్ శాతం పెంచే విధంగా అధికారులు మరింత చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇక షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఎన్నికల కోడ్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఈసారి లోక్సభ ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతుండగా మొదటి దశ ఓటింగ్ ఏప్రిల్ 19న జరిగింది.. ఇప్పుడు మే 13వ తేదీన మరొక దశ ఓటింగ్ జరగబోతోంది.. ఈ నేపథ్యంలోనే మీరు ఓటు వేయడానికి మీ ప్రాంతంలోనే పోలింగ్ బూత్ గురించిన సమాచారం.. పోలింగ్ స్టేషన్ గురించిన సమాచారం తెలుసుకోవాలంటే ఈ చిన్న ట్రిక్ ఫాలో కావాల్సిందే..


ప్రస్తుత కాలంలో చాలామంది ఎక్కడెక్కడ నుంచో ఓటు వేయడానికి అవకాశాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఏ నియోజకవర్గంలో ఏ పోలింగ్ స్టేషన్ నుండి ఓటు వేయాలి అని చాలామంది తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు.. అలాంటి వారి కోసమే ఈ చిన్న ట్రిక్ తీసుకురావడం జరిగింది. ముందుగా మీ పోలింగ్ బూత్ మీ ఇంటి నుండి ఎంత దూరంలో ఉందో కూడా తెలుసుకునే వెసులుబాటును కూడా ఇక్కడ పొందుపరిచారు.. ముఖ్యంగా ఈ సమాచారం ఎన్నికల రోజున మీ సమయాన్ని మరింత ఆదా చేస్తుంది. మరి మీ పోలింగ్ బూత్,  పోలింగ్ అధికారి స్థానం గురించిన సమాచారాన్ని ఆన్లైన్లో ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం..

18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును కలిగి ఉంటారు.. దీని తర్వాత మీ పేరు ఓటర్ జాబితాలో చేర్చబడుతుంది.. మీ ఓటర్ కార్డు జిల్లా ఎన్నికల కేంద్రం నుండి తయారవుతుంది. అంతేకాదు ఈ ఓటర్ కార్డులో మీ శాశ్వత చిరునామా ఉంటుంది.. దాని ఆధారంగానే మీ వార్డు గురించిన సమాచారం అందుబాటులో ఉంటుంది.. ముఖ్యంగా ఈ  వివరాలన్నింటి సహాయంతో మీరు ఓటు వేసే రోజున మీ పోలింగ్ బూత్ ఎక్కడుందో వెతకవచ్చు. ఇక మీరు ఓటు వేసే పోలింగ్ స్టేషను వెతకడానికి మీరు ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.

ఇందుకోసం ముందుగా వినియోగదారులు ఓటర్ హెల్ప్ లైన్ యాప్ కోసం ఐఓఎస్ వినియోగదారులైతే ఆప్ స్టోర్ లో .. ఆండ్రాయిడ్ వినియోగదారులైతే ప్లే స్టోర్ లో వెళ్లి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు..

ముందుగా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ను మీ స్మార్ట్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవ్వండి..

యాప్ లోకి లాగిన్ అయిన తర్వాత..EPIC No., మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ని ఉపయోగించవచ్చు.

ఇప్పుడు సెర్చ్ పై క్లిక్ చేసి అక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఒకదానిని ఎంచుకోవాలి..

దీని తర్వాత యాప్ లో అడిగిన సమాచారాన్ని పొందుపరిచి ఓటర్ కార్డు పై ఉన్న సమాచారం ద్వారా సులభంగా మీరు మీ పోలింగ్ బూత్ ను గుర్తించవచ్చు..

అంతేకాదు ఎన్నికల సంఘం వెబ్సైట్లో కూడా మీరు ఈ సమాచారాన్ని తెలుసుకోవచ్చు..

ముందుగా ఎన్నికల సంఘం వెబ్సైటును తెరవాలి.. వెబ్సైట్ కి చేరుకున్న తర్వాత ఓటర్ పోర్టల్ (voterportal.eci.gov.in) కి వెళ్లండి.

ఇక్కడ ఓటర్ ఐడి కార్డ్ లేదా ఈ మెయిల్ లేదా మొబైల్ నెంబర్ ను  ఉపయోగించి లాగిన్ అవ్వాలి.

ఇక తర్వాత ఫైండ్ మై పోలింగ్ స్టేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.. దానిపై క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఓటర్ కార్డు పై ఉన్న వివరాల సహాయంతో మీ పోలింగ్ బూత్ ను సులభంగా కనుగొనవచ్చు.. మీకు కావాలంటే ఓటర్లు,  ఓటింగ్ స్లిప్ ని కూడా డౌన్లోడ్ చేసుకునే  వెసులుబాటు ఉంటుంది..


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>