PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-klayand48f5f3b-ee50-4785-a2b5-b146ff020454-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-klayand48f5f3b-ee50-4785-a2b5-b146ff020454-415x250-IndiaHerald.jpgఆంధ్రాలో జరగబోతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌లకు ఇంకా రెండంటే రెండు రోజులు మాత్రమే సమయం వున్నది. అయితే ఈ క్రమంలో ఇక్కడ చిత్ర‌ విచిత్రమైన ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ అంశం గాజు గ్లాసు గుర్తు. అవును, గాజు గ్లాసు గుర్తు గురించి ఇక్కడ ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ గుర్తు కనుక దానికి సాధారణంగానే మంచి పాపులారిటీ ఏర్పడింది. ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. జ‌న‌సేన‌కు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును.. ఆ పార్టీ పోటీలో లేని చోట అంటే దాదాపు 18 మంది స్pawan klayan{#}High court;Jaggayyapeta;kalyan;Janasena;central government;News;CBN;Vijayawada;Partyఏపీ: స్వతంత్ర అభ్యర్థులు గాజుగ్లాసు గుర్తుని ఎంచుకోవడం వెనుక బాబు హస్తం?ఏపీ: స్వతంత్ర అభ్యర్థులు గాజుగ్లాసు గుర్తుని ఎంచుకోవడం వెనుక బాబు హస్తం?pawan klayan{#}High court;Jaggayyapeta;kalyan;Janasena;central government;News;CBN;Vijayawada;PartySat, 11 May 2024 10:40:34 GMTఆంధ్రాలో జరగబోతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌లకు ఇంకా రెండంటే రెండు రోజులు మాత్రమే సమయం వున్నది. అయితే ఈ క్రమంలో ఇక్కడ చిత్ర‌ విచిత్రమైన ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ అంశం గాజు గ్లాసు గుర్తు. అవును, గాజు గ్లాసు గుర్తు గురించి ఇక్కడ ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ గుర్తు కనుక దానికి సాధారణంగానే మంచి పాపులారిటీ ఏర్పడింది. ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. జ‌న‌సేన‌కు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును.. ఆ పార్టీ పోటీలో లేని చోట అంటే దాదాపు 18 మంది స్వ‌తంత్ర అభ్య‌ర్థులకు ఈ గుర్తునే కేటాయించింది ఎన్నికల సంఘం.

ఇది కేంద్ర ఎన్నిక‌ల సంఘ చేసిన ఘనకార్యం అని వేరే చెప్పాల్సిన పనిలేదు. బేసిగ్గా ఒక రాష్ట్రంలో ఒక కీల‌క పార్టీకి కేటాయించిన గుర్తును.. ప్ర‌త్య‌ర్థుల‌కు కేటాయించకూడదు. కానీ, జనసేన రిజిస్ట‌ర్డ్ పార్టీ కాద‌నే కార‌ణంగా.. జ‌న‌సేన‌కు కేటాయించి గాజు గ్లాసు గుర్తును స్వ‌తంత్రుల‌కు కేటాయించింది. చంద్ర‌బాబు పోటీలో ఉన్న కుప్పంలో న‌వ‌రంగ్ పార్టీ త‌ర‌ఫున స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న మ‌హిళా నాయ‌కురాలికి కూడా.. ఈ గుర్తునే కేటాయించడం కొసమెరుపు. దీంతో కీల‌క పార్టీ అధ్య‌ర్థుల ఓట్లు చీలిపోతాయ‌నే భయం కూట‌మి పార్టీల‌ను వెంటాడుతోంది. ఈ నేప‌థ్యం లో జ‌నసేన హైకోర్టు త‌లుపు తట్టినా పెద్దగా ఫలితం లేకపోయింది.

అదంతా ఒకెత్తయితే ఇక్కడ ప్రత్యేకించి నవతరం పార్టీ గురించి మాట్లాడుకోవాలి. ఈ పార్టీకి కూడా గాజు గ్లాసు గుర్తునే కేటాయించింది ఎన్నికల సంఘం. అయితే లాస్ట్ నిముషంలో వారు తమ గాజు గ్లాసు గుర్తుని విరమించుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్లాన్ వెనుక చంద్రబాబు హస్తం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. బాబు కావాలనే ఆ పార్టీని గాజు గ్లాసు గుర్తు తీసుకోవలసిందిగా కోరినట్టు భోగట్టా. ఆ తరువాత విత్ డ్రా విషయం కూడా ఆయనే చేసుకున్నారట. దాంతో ఇపుడు జనసేనలో బాబుగారి పట్ల ఒకింత అసహనం చోటుచేసుకుందని గుసగుసలు వినబడుతున్నాయి. ఇప్పటివరకు ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు విజయవాడ పార్లమెంటుతోపాటు గాజువాక, భీమిలీ, విజయనగరం, మదనపల్లి, మైదుకూరు, మచిలీపట్నం, జగ్గయ్యపేట అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించినట్టు సమాచారం



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>