PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vanga-geetha-pawan-jaganf5631670-ff10-4bbf-b14f-a438dac9e431-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vanga-geetha-pawan-jaganf5631670-ff10-4bbf-b14f-a438dac9e431-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఈసారి పిఠాపురం ఎన్నికలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.. ముఖ్యంగా ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉన్నప్పటికీ వైసీపీ పార్టీ నుంచి వంగా గీత పోటీ చేస్తున్నారు. ఈ రోజున ఎన్నికలలోని చివరి ప్రచారంలో భాగంగా పిఠాపురం వేదికగా జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఈసారి వంగా గీతను గెలిపిస్తే ఆమెకు దక్కే పదవి గురించి కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. పవన్ పైన కీలక వ్యాఖ్యలు చేస్తూ అంతకుముందు వంగా గీత గెలుపు పైన చాలా ఉద్వేగానికి లోనయ్యారు జగన్.. ముఖ్యమంత్రి జగన్ పిఠాపురం వేదికగా పలు అVANGA GEETHA;PAWAN;JAGAN{#}Deputy Chief Minister;Godavari River;Janasena;CBN;geetha;pithapuram;kalyan;Jagan;YCPజగన్: పవన్ ను ఓడిస్తే.. వంగా గీతకు బంపర్ ఆఫర్..!జగన్: పవన్ ను ఓడిస్తే.. వంగా గీతకు బంపర్ ఆఫర్..!VANGA GEETHA;PAWAN;JAGAN{#}Deputy Chief Minister;Godavari River;Janasena;CBN;geetha;pithapuram;kalyan;Jagan;YCPSat, 11 May 2024 18:16:04 GMTఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఈసారి పిఠాపురం ఎన్నికలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.. ముఖ్యంగా ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉన్నప్పటికీ వైసీపీ పార్టీ నుంచి వంగా గీత పోటీ చేస్తున్నారు. ఈ రోజున ఎన్నికలలోని చివరి ప్రచారంలో భాగంగా పిఠాపురం వేదికగా జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఈసారి వంగా గీతను గెలిపిస్తే ఆమెకు దక్కే పదవి గురించి కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. పవన్ పైన కీలక వ్యాఖ్యలు చేస్తూ అంతకుముందు వంగా గీత గెలుపు పైన చాలా ఉద్వేగానికి లోనయ్యారు జగన్..


ముఖ్యమంత్రి జగన్ పిఠాపురం వేదికగా పలు అంశాలను వెల్లడించారు.. వంగ గీతను ఈసారి గెలిపిస్తే తన క్యాబినెట్లో డిప్యూటీ సీఎం గా అవకాశం కల్పిస్తారని మీ బిడ్డ మాట ఇస్తున్నాడు అంటూ వెల్లడించారు.. జగన్ ప్రభుత్వంలో గత ఐదేళ్ల కాలంలో కాపు వర్గానికి డిప్యూటీ సీఎం పదవి కేవలం గోదావరి జిల్లాల వారికి అవకాశం ఇచ్చారని ఇప్పుడు కూడా ఖచ్చితంగా వంగ గీతకు ఇస్తానంటూ వెల్లడించారు. అలాగే పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి పైన కూడా విమర్శలు చేశారు.


చంద్రబాబు చేసే ప్రతి మోసం వెనుక కూడా పవన్ కళ్యాణ్ ఉన్నారని ఇలాంటి వ్యక్తికి ఓటు వేస్తే ఎవరికి మేలు జరుగుతుందో ఆలోచించి ఓటు వేయండి అంటూ జగన్ వెల్లడించారు.. చంద్రబాబు సాధ్యం కానీ హామీలను మేనిఫెస్టోలో పెట్టారని అవన్నీ ప్రజలను మోసం చేయడానికి అన్నట్టుగా తెలిపారు.. మహిళలను రైతులను వెన్నుపోటు పొడవడానికి పవన్ అనే కత్తిని కూడా ఉపయోగిస్తున్నారు అంటూ చంద్రబాబు పైన వ్యాఖ్యలు చేశారు జగన్.. దత్తపుత్రుడిని నమ్మే పరిస్థితి ఉంటుందా అంటూ కూడా నిలదీశారు. అలాగే పిఠాపురంలో ఓటు వేస్తే ప్రతి ఒక్క రూపు ఆలోచించి ఓటు వేయండి అంటూ తెలియజేశారు. వంగా గీత ఇక్కడి మనిషి.. మీ అందరితో కలిసిమెలిసి ఉంటుంది ఈమెను గెలిపించండి అంటూ తెలిపారు.
">
మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>