PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/avinash-reddy05df1616-6d81-4900-885e-7757232095bb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/avinash-reddy05df1616-6d81-4900-885e-7757232095bb-415x250-IndiaHerald.jpgఏపీలో పోలింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రచారం చివరి దశలో ఉంది. ముఖ్య నేతలు ఎన్నికల వ్యూహాల్లో బిజీగా ఉన్నారు. కడపలో ఎప్పుడు ఎన్నిక జరిగినా అంత ఆసక్తి ఉండేది కాదు. ఎందుకంటే అది వైఎస్ కుటుంబానికి కంచు కోట. ఎప్పుడు అక్కడ మెజార్టీ గురించే చర్చంతా ఉండేది. కానీ ఈ సారి పోరు ఆసక్తి కరంగా మారింది. వైఎస్ కుటుంబ సభ్యులు రెండు పార్టీల వారీగా చీలిపోయారు. దీంతో ఈ ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు షర్మిళ అవినాష్ హంతకుడు ఓటు వేయొద్దు.. అంటూ తీవ్ర విమర్శలు చేస్తూ ప్రచారం సాగిస్తూంటే.. అవినాష్ మాత్రం సavinash reddy{#}devineni avinash;Shakti;CBN;Reddy;Fatherకడపలో ఆఖరి అస్త్రం బయటకు తీసిన అవినాష్ రెడ్డి?కడపలో ఆఖరి అస్త్రం బయటకు తీసిన అవినాష్ రెడ్డి?avinash reddy{#}devineni avinash;Shakti;CBN;Reddy;FatherSat, 11 May 2024 10:01:00 GMTఏపీలో పోలింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రచారం చివరి దశలో ఉంది. ముఖ్య నేతలు ఎన్నికల వ్యూహాల్లో బిజీగా ఉన్నారు.  కడపలో ఎప్పుడు ఎన్నిక జరిగినా అంత ఆసక్తి ఉండేది కాదు. ఎందుకంటే అది వైఎస్ కుటుంబానికి కంచు కోట. ఎప్పుడు అక్కడ మెజార్టీ గురించే చర్చంతా ఉండేది. కానీ ఈ సారి పోరు ఆసక్తి కరంగా మారింది.  వైఎస్ కుటుంబ సభ్యులు రెండు పార్టీల వారీగా చీలిపోయారు.


దీంతో ఈ ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు షర్మిళ అవినాష్ హంతకుడు ఓటు వేయొద్దు.. అంటూ తీవ్ర విమర్శలు చేస్తూ ప్రచారం సాగిస్తూంటే.. అవినాష్ మాత్రం సెంటిమెంట్ ను రైజ్ చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. తద్వారా సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. తన ఇద్దరి అక్కలు చంద్రబాబు ట్రాప్ లో పడ్డారని.. ఇద్దరూ కూడా ఆయన డైరెక్షన్ లోనే నడుస్తున్నారని ఆరోపించారు.


తనపై వైఎస్ షర్మిళ, సునీతా రెడ్డిలు చేస్తున్న వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారు. తన అక్కలు చేస్తున్న ఆరోపణలు తనను ఎంతగానో బాధిస్తున్నాయని.. వారితో పోరాడే శక్తి తనకు ప్రజలే ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. వారిద్దరూ పని గట్టుకొని పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నానై నిరాధార ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.


వాచ్ మెన్ రంగన్న నార్కో టెస్ట్ పై ఎవరూ మాట్లాడరు. వివేకాను తానే చంపానని దస్తగిరి చెప్పుకుంటున్నా ఎవరూ మాట్లాడటం లేదు. కానీ మా అక్కలు రెండున్నరేళ్లుగా మాట్లాడకుండా ఇప్పుడొచ్చి ప్రశ్నిస్తుంటే కోపం కంటే బాధే ఎక్కువగా ఉంది. మా నాన్న భాస్కర్ రెడ్డి ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ అందరికీ పనిచేసి పెట్టేవారు. ఆయన్ను జైలు పాలు చేశారు. నేనేమీ తప్పు చేయకపోయినా అన్యాయంగా మాట్లాడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తిడుతున్న వాళ్లు నన్ను క్షమాపణలు అడగాలి. నేను అది వినాలి అంటూ అవినాష్ వ్యాఖ్యానించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>