PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/asembly-elections54ea3fa9-080f-4429-ad37-7c45127575e7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/asembly-elections54ea3fa9-080f-4429-ad37-7c45127575e7-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లో సోమవారం జరగనున్న పోలింగ్ కి నేటితో ప్రచార కార్యక్రమాలు ముగిసాయి. ప్రస్తుతం ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచార ప్రసంగానికి సినీ గ్లామర్ తోడైంది. దాంట్లో భాగంగానే వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికు మద్దతుగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రచారం చేసారు.అల్లు అర్జున్ తన భార్య స్నేహా రెడ్డితో కలిసి ఈరోజు నంద్యాలకు వెళ్లారు.ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసానికి అల్లు అర్జున్ వెళ్లడంపై అభ్యంతరాలు వ్asembly elections{#}shilpa;Anandam;Election Commission;monday;Janasena;Nandyala;kalyan;media;Reddy;YCP;Allu Arjun;Tollywood;Wife;MLA;Arjunఅల్లు అర్జున్ : అడా ఉంటా...ఈడా ఉంటా...!!అల్లు అర్జున్ : అడా ఉంటా...ఈడా ఉంటా...!!asembly elections{#}shilpa;Anandam;Election Commission;monday;Janasena;Nandyala;kalyan;media;Reddy;YCP;Allu Arjun;Tollywood;Wife;MLA;ArjunSat, 11 May 2024 22:52:56 GMTఆంధ్రప్రదేశ్లో సోమవారం జరగనున్న పోలింగ్ కి నేటితో ప్రచార కార్యక్రమాలు ముగిసాయి. ప్రస్తుతం ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచార ప్రసంగానికి సినీ గ్లామర్ తోడైంది. దాంట్లో భాగంగానే  వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికు మద్దతుగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రచారం చేసారు.అల్లు అర్జున్ తన భార్య స్నేహా రెడ్డితో కలిసి ఈరోజు నంద్యాలకు వెళ్లారు.ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసానికి అల్లు అర్జున్ వెళ్లడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. శిల్పా రవిచంద్రారెడ్డి, అల్లు అర్జున్ గత పదిహేనేళ్లుగా స్నేహితులు. శిల్పా రవి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ ను చూసేందుకు వేలాదిగా జనం తరలివచ్చారు. దీంతో స్థానికులు ఇబ్బందికి గురయ్యారని ఈసీ అనుమతి లేకుండా జనసమీకణ చేశారంటూ ఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసారు.

అల్లు అర్జున్ దంపతులు నంద్యాలకు వెళ్లి అక్కడ వైసీపీ అభ్యర్థి రవిచంద్రారెడ్డి ఇచ్చిన విందుకు అటెండ్ అయ్యారు.అలాగే ప్రచారంలో తన స్నేహితుడు అయినా రవిచంద్రారెడ్డికి తమందరి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు.అల్లు అర్జున్ అటు జనసేన అభ్యర్థికి మద్దతు ప్రకటించి ఇటు వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది వైసీపీకి వ్యతిరేకంగా ఒకవైపు పవన్ కళ్యాణ్ ఒక పెద్ద యుద్ధమే చేస్తుంటే ఒకవైవు అల్లు అర్జున్ ఇలా ఈ విధంగా వైసీపీకి మద్దతుగా ప్రచారం చేయడం కంటిమీద కునుకు లేకుండా చేసింది. దాంతో జనసైనికులు అందరూ అల్లు అర్జున్ పై ఆగ్రహంతో ఉన్నారు..అలాగే ఒకవైపు ఏపీలో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుండగా అల్లు అర్జున్ అక్కడికి వెళ్లడం వల్ల వైసీపీ నేతల్లో పట్టలేని ఆనందం పొందారు.బన్నీ ఆడా ఉంటా ఈడా ఉంటా డైలాగ్ ఫాలో అవుతున్నారని కొందరు నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. అనుమతి తీసుకోకుండా ఇలా జన సమీకరణ చేయడం పై ఆ నియోజకవర్గానికి చెందిన రిటర్నింగ్ ఆఫీసర్ఐ.పీసీ సెక్షన్ 188 కింద ఈ కేసు నమోదు చేయగా క్రైమ్ నెంబర్ 71/2024గా కేసును కూడా రిజిస్టర్ చేసారని తెలుస్తుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>