PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-be74d058-1a42-41bb-8587-31169b794ee4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-be74d058-1a42-41bb-8587-31169b794ee4-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారాలు మే 11 అంటే ఈరోజుతో ముగిసాయి. రేపు ఒక్కరోజు ఆయా పార్టీ నాయకులు రెస్ట్ తీసుకుంటారు. నెక్స్ట్ డే పోలింగ్ జరుగుతుంది అంటే మే 13వ తేదీన ముఖ్యమంత్రిని నిర్ణయించే ఎన్నికలు జరుగుతాయి. వచ్చే నెలలో ఈ ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. అయితే ఈ రిజల్ట్స్ ఇంకా రాకముందే చంద్రబాబు నాయుడు గెలుపు తనదే అనే భరోసా, ధీమాను వ్యక్తం చేస్తున్నారు. Chandrababu {#}Loksabha;Elections;Narendra Modi;TDP;Janasena;Party;kalyan;media;YCP;CM;CBN;Jaganఏపీ: ఎన్నికల్లో గెలుస్తానని బలంగా నమ్ముతున్న చంద్రబాబు.. అందుకు కారణాలు ఇవేనా..??ఏపీ: ఎన్నికల్లో గెలుస్తానని బలంగా నమ్ముతున్న చంద్రబాబు.. అందుకు కారణాలు ఇవేనా..??Chandrababu {#}Loksabha;Elections;Narendra Modi;TDP;Janasena;Party;kalyan;media;YCP;CM;CBN;JaganSat, 11 May 2024 17:00:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారాలు మే 11 అంటే ఈరోజుతో ముగిసాయి. రేపు ఒక్కరోజు ఆయా పార్టీ నాయకులు రెస్ట్ తీసుకుంటారు. నెక్స్ట్ డే పోలింగ్ జరుగుతుంది అంటే మే 13వ తేదీన ముఖ్యమంత్రిని నిర్ణయించే ఎన్నికలు జరుగుతాయి. వచ్చే నెలలో ఈ ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. అయితే ఈ రిజల్ట్స్ ఇంకా రాకముందే చంద్రబాబు నాయుడు గెలుపు తనదే అనే భరోసా, ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

 వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రభుత్వ ఉద్యోగులలో తీవ్ర వ్యతిరేకత ఉందని చంద్రబాబు నమ్ముతున్నారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణంగా వైసీపీ భారీ సంఖ్యలో ఓటర్లను కోల్పోతుందని నమ్ముతున్నారు. ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి ఏమీ చేయలేదని వ్యతిరేకత కూడా ఉందని ఆయన అనుకుంటున్నారు. అలాగే జనసేన బీజేపీ టీడీపీ ఈ మూడు పార్టీల కలయిక కారణంగా ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. మోదీ మద్దతుదారులందరూ కూటమికే ఓట్లు వేస్తారని అనుకుంటున్నారు. ముఖ్యంగా బ్రాహ్మణ వైశ్య సామాజిక వర్గాల ఓట్లు అన్ని తమకే పడిపోతాయనే నమ్మకంలో ఉన్నారు.

అంతేకాకుండా జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అవుతాను ఇస్తానని హామీ ఇచ్చానని, ఆ కారణం చేత ప్రజలు తనమే ఎన్నుకుంటారని బలంగా విశ్వసిస్తున్నారు. కళ్యాణ్ వాళ్ళ కాపు ఓట్లు తమకు పడటం ఖాయమని అనుకుంటున్నారు. టీడీపీ అనుకూల మీడియా కూడా జనాలను తమ వైపు తిప్పేలా చేసిందని, ఈసారి సీఎం పీఠం అధిరోహించడం ఖాయమని చంద్రబాబు నమ్ముతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఆయన నమ్మకాలు నిజమవుతాయా లేదా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు జగన్ మాట ఇచ్చినట్టుగా 99% మేనిఫెస్టో అమలు చేసి ప్రజల్లో విశ్వాసాన్ని గెలుచుకున్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే తాను ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని హెచ్చరిస్తున్నారు. సర్వేల ప్రకారం జనం కూడా జగన్ వైపే ఉన్న స్పష్టంగా చెబుతున్నాయి. ఈసారి చంద్రబాబు ఓడిపోతే ఆయన పొలిటికల్ కెరీర్ కు శుభం కార్డు పడినట్లే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>