PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kadapa-jagan-sharmila-prajala-madilo-unnadi-edenata6aa632a5-5ebf-47b3-8787-779de3c6aace-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kadapa-jagan-sharmila-prajala-madilo-unnadi-edenata6aa632a5-5ebf-47b3-8787-779de3c6aace-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈసారి చాలా ఆసక్తికరమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. గతంలో లాగా కాకుండా ఈసారి టిడిపి కూటమి, వైసిపి మరియు కాంగ్రెస్ కూడా బరిలో ఉంది. ఈ విధంగా మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. ఇదే తరుణంలో రాష్ట్ర ప్రజలందరి చూపు ఆ ఒక్క జిల్లాపైనే పడింది. అదే సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లా. ఇది వైయస్సార్సీపీకి కంచుకోట. ఈ జిల్లాలో వైయస్ కుటుంబీకులే ఎక్కువగా పాలిస్తూ ఉంటారు. అలాంటి వైఎస్ కుటుంబంలో ఈసారి విపరీతమైన చీలికలు ఏర్పడ్డాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎjagan;sharmila;avinash;vivekanandaredy;kadapa{#}Y S Vivekananda Reddy;kadapa;Sharmila;devineni avinash;Assembly;Parliament;Congress;Jagan;CM;TDP;YCP;Andhra Pradeshకడప:జగన్VS షర్మిల..ప్రజల మదిలో ఉంది ఇదేనట..!కడప:జగన్VS షర్మిల..ప్రజల మదిలో ఉంది ఇదేనట..!jagan;sharmila;avinash;vivekanandaredy;kadapa{#}Y S Vivekananda Reddy;kadapa;Sharmila;devineni avinash;Assembly;Parliament;Congress;Jagan;CM;TDP;YCP;Andhra PradeshSat, 11 May 2024 12:26:37 GMT ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  ఈసారి చాలా ఆసక్తికరమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. గతంలో లాగా కాకుండా ఈసారి టిడిపి కూటమి,  వైసిపి  మరియు కాంగ్రెస్ కూడా బరిలో ఉంది.  ఈ విధంగా మూడు పార్టీల మధ్య  హోరాహోరీ పోరు జరుగుతుంది. ఇదే తరుణంలో  రాష్ట్ర ప్రజలందరి చూపు ఆ ఒక్క జిల్లాపైనే పడింది. అదే సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లా. ఇది వైయస్సార్సీపీకి కంచుకోట. ఈ జిల్లాలో వైయస్ కుటుంబీకులే ఎక్కువగా పాలిస్తూ ఉంటారు. అలాంటి వైఎస్ కుటుంబంలో ఈసారి విపరీతమైన చీలికలు ఏర్పడ్డాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి  ఎంపీగా అవినాష్ రెడ్డి బరిలో ఉన్నారు.

  అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గమైన పులివెందులలో జగన్ పోటీ చేస్తున్నారు.  ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల కూడా పార్లమెంటు బరిలో ఉంది. ఇదే తరుణంలో షర్మిల  జగన్మోహన్ రెడ్డిని మరియు అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ  విపరీతంగా మాట్లాడుతోంది. మీ రాజన్న బిడ్డను మీరు ఆదరించాలి  అంటూ ప్రచారంలో దూసుకుపోతోంది. ఆమె ప్రధాన అస్త్రంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను వాడుకుంటుంది. వివేకానంద రెడ్డిని హత్యకు కారణమైనటువంటి అవినాష్ రెడ్డిని గెలిపించుకుందామా? లేదంటే మీ రాజన్న బిడ్డ నన్ను ఆదరిస్తారా? లేదా అంటూ సెంటిమెంటు సంధిస్తోంది. ఈ విధంగా ఒకే జిల్లాలో ఓకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు పోటీ చేయడంతో  ప్రజలు ఎవరికి ఓటు వేయాలో తర్జనభర్జన అవుతున్నారట. ఈ క్రమంలోనే  ఒక నిర్ణయానికి కూడా వచ్చారట.

  ఇద్దరికీ సమన్యాయం చేయాలని  వైయస్ అవినాష్ రెడ్డికి ఓటు వేయొద్దని డిసైడ్ అవుతున్నారట. రాజన్న బిడ్డ షర్మిలకు ఒక ఓటు, పులివెందులలో పోటీ చేస్తున్నటువంటి  సీఎం జగన్ కు ఒక ఓటు వేయాలని ప్రజలు అనుకుంటున్నారట.  ఈ విధంగా పులివెందులలో అవినాష్ కంటే షర్మిలకే ఎక్కువగా ఓట్లు పడే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా వివేకానంద రెడ్డి ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి జమ్మలమడుగులో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉందట. ఈ అంశాలన్నీ గమనిస్తే మాత్రం కడపలో   అవినాష్ రెడ్డి ఓటమి ఖాయమని  కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>