BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautyb6d0c0f1-ded0-4c2d-9428-ec41403e6f74-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautyb6d0c0f1-ded0-4c2d-9428-ec41403e6f74-415x250-IndiaHerald.jpgచాలా మందికి జుట్టు రాలిపోవడం ఇంకా మొటిమలు సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సమస్యలని కొన్ని న్యాచురల్ టిప్స్ తో తగ్గించుకోవచ్చు.అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముందుగా జుట్టు రాలకుండా ఒత్తుగా, పొడుగ్గా పెరగాలంటే .. ఐరన్, జింక్, విటమిన్లు A,D చాలా అవసరం. ఈ పోషకాల లోపం లేకుండా చూసుకుంటే జుట్టు బలంగా ఎదుగుతుంది. అలాగే మీ డైట్‌లో పండ్లు, కూరగాయలు, నట్స్ కూడా ఉండేలా చూసుకోండి. అన్ని పోషకాలతో నిండిన సమతుల్య ఆహారాన్ని తింటే జుట్టు రాలడం దానంతట అదే తగ్గుతుంది. అప్పుడప్పుడూ తలకు మసాజ్ చేస్తూ ఉండాలి. ఇలా చేయBeauty{#}thulasi;Rasam;Tulasi;Turmeric;Almonds;Manamహెయిర్ ఫాల్, పింపుల్స్ సమస్యని ఈజీగా తగ్గించే టిప్స్?హెయిర్ ఫాల్, పింపుల్స్ సమస్యని ఈజీగా తగ్గించే టిప్స్?Beauty{#}thulasi;Rasam;Tulasi;Turmeric;Almonds;ManamSat, 11 May 2024 16:19:00 GMTచాలా మందికి జుట్టు రాలిపోవడం ఇంకా మొటిమలు సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సమస్యలని కొన్ని న్యాచురల్ టిప్స్ తో తగ్గించుకోవచ్చు.అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముందుగా జుట్టు రాలకుండా ఒత్తుగా, పొడుగ్గా పెరగాలంటే .. ఐరన్, జింక్, విటమిన్లు A,D చాలా అవసరం. ఈ పోషకాల లోపం లేకుండా చూసుకుంటే జుట్టు బలంగా ఎదుగుతుంది. అలాగే మీ డైట్‌లో పండ్లు, కూరగాయలు, నట్స్ కూడా ఉండేలా చూసుకోండి. అన్ని పోషకాలతో నిండిన సమతుల్య ఆహారాన్ని తింటే జుట్టు రాలడం దానంతట అదే తగ్గుతుంది. అప్పుడప్పుడూ తలకు మసాజ్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల తలపై రక్త ప్రసరణ జరుగుతుంది. దీని వల్ల వెంట్రుకలకు పోషణ అందుతుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరగడానికి దోహద పడుతుంది. ఇందుకు కొబ్బరి నూనె, బాదం నూనె చక్కగా పని చేస్తుంది.పసుపు, తులసి మొటిమలను నయం చేయడానికి ప్రభావవంతంగా పనిచేస్తాయి. రెండు చెంచాల పచ్చి పసుపును గ్రైండ్ చేసి, అందులో ఇరవై, ముప్పై తులసి ఆకులను కడిగి రుబ్బుకోవాలి.


తులసి ఆకు పేస్ట్, పచ్చి పసుపు ముద్దను కలిపి మొటిమల మీద రాసి, ఆరిన తర్వాత కడిగేస్తే ఈజీగా మొటిమలు తగ్గిపోతాయి.రోజ్ వాటర్ లేదా ప్లెయిన్ వాటర్ లో గంధపు పొడిని కలిపి.. మందపాటి పేస్ట్ లా తయారు చేసుకుని మొటిమల మీద అప్లై చేయాలి. చర్మంపై అప్లై చేసిన వెంటనే చల్లదనపు అనుభూతి కలుగుతుంది. ఆ తర్వాత కొంతసేపు ఆరనిచ్చి నీటితో కడిగేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.రెండు నిమ్మకాయలను తీసుకొని ముక్కలు చేసి రసం తీయాలి. ఈ రసంలో రెండు చెంచాల నీరు కలపాలి. ఈ మిశ్రమంలో కాటన్ బాల్‌ను నానబెట్టి మొటిమలపై అప్లై చేయాలి. ఇలా చేస్తే మొటిమలు చాలా త్వరగా ఎండిపోతాయి. అయితే సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు నిమ్మరసానికి దూరంగా ఉండటం మంచిది.వేప ఆకులను చూర్ణం చేసి, అందులో కొన్ని చెంచాల రోజ్ వాటర్ కలిపి తీసుకున్నా ఫలితం ఉంటుంది. మరో మార్గం ఏంటంటే.. తేనె వివిధ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఒక టీ స్పూన్ స్వచ్ఛమైన తేనెలో చిన్న దూదిని ముంచి మొటిమలపై అప్లై చేసి, అరగంట తర్వాత కడిగేయాలి.అలా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>