PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu624a0624-51b6-4f95-9cc4-fb320e904e88-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu624a0624-51b6-4f95-9cc4-fb320e904e88-415x250-IndiaHerald.jpgఎన్నికలవేళ ఏపీ రాజకీయం భానుడి వేడిమిని మించిపోతుంది అనడానికి ఇదే ఉదాహరణ. అవును, పేదలకు పంచే ఉచిత ఇండ్ల పాస్ పుస్తకాలపై జగన్‌ ఫొటోలు ఉన్న కారణంగా పాసు పుస్తకాల నకళ్ల దహనానికి తెదేపా అధినేత చంద్రబాబు తాజాగా పిలుపునివ్వడం కలకలం రేపుతోంది. శుక్రవారం నిర్వహించిన ప్రజాగళం సభల్లో ఆయన మాట్లాడుతూ... వీధుల్లోకి వచ్చి ఆయా కాపీలు తగులబెట్టాలని కోరారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని రద్దు చేస్తామని, పాసు పుస్తకాలపై రాజముద్రని వేసి వాటిని తిరిగి అందిస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో Chandrababu{#}Telugu Desam Party;June;Friday;Government;Andhra Pradesh;TDP;Telangana Chief Minister;YCP;CBN;Jaganఏపీ: పాసు పుస్తకాలపై ఉన్న జగన్‌ బొమ్మని తగలబెట్టండి: చంద్రబాబుఏపీ: పాసు పుస్తకాలపై ఉన్న జగన్‌ బొమ్మని తగలబెట్టండి: చంద్రబాబుChandrababu{#}Telugu Desam Party;June;Friday;Government;Andhra Pradesh;TDP;Telangana Chief Minister;YCP;CBN;JaganSat, 11 May 2024 16:30:00 GMTఎన్నికలవేళ ఏపీ రాజకీయం భానుడి వేడిమిని మించిపోతుంది అనడానికి ఇదే ఉదాహరణ. అవును, పేదలకు పంచే ఉచిత ఇండ్ల పాస్ పుస్తకాలపై జగన్‌ ఫొటోలు ఉన్న కారణంగా పాసు పుస్తకాల నకళ్ల దహనానికి తెదేపా అధినేత చంద్రబాబు తాజాగా పిలుపునివ్వడం కలకలం రేపుతోంది. శుక్రవారం నిర్వహించిన ప్రజాగళం సభల్లో ఆయన మాట్లాడుతూ... వీధుల్లోకి వచ్చి ఆయా కాపీలు తగులబెట్టాలని కోరారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని రద్దు చేస్తామని, పాసు పుస్తకాలపై రాజముద్రని వేసి వాటిని తిరిగి అందిస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో మే 13వ తేదీ ఎప్పుడు వస్తుందా, తెలుగుదేశం కూటమికి ఓటు వేసి జగన్ పీడ ఎప్పుడు వదిలించుకుందామా అని ఆంధ్రప్రదేశ్ రైతులు ఎదురు చూస్తున్నట్టు బాబుతో మాట్లాడారు.

అవును, జూన్ 4న ఫలితాలు రాగానే తమ తమ పొలాల్లో సరిహద్దు రాళ్ళమీద వున్న జగన్ ముఖాన్ని చెక్కేయడానికి రైతులు కొడవళ్ళు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. బాబు ప్రభుత్వం రాగానే రాజముద్రతో కూడిన పాస్‌ బుక్ తమ చేతికి అందిన వెంటనే, జగన్ ముఖచిత్రంతో వున్న పట్టాదార్ పాస్ పుస్తకాలను సాముహికంగా దహనం చేయడానికి పిడకలు, కట్టెలు కూడా రెడీ చేసుకుంటున్నట్టు ఈ సందర్భంగా ప్రజలు తెలియజేసారు. ఈ నేపథ్యంలో బాబు మాట్లాడుతూ... "అసమర్థ ముఖ్యమంత్రి పిచ్చి చేష్టలతో ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. అయినా పట్టాదారు పాసు పుస్తకంపై ముఖ్యమంత్రి చిత్ర మేమిటి చిత్రంగా లేదూ? ప్రయివేట్‌ ఆస్తుల పత్రాలపై జగన్‌ బొమ్మలు ఎలా వేసుకుంటాడు? భూములు మీవి.. బొమ్మలు జగన్‌వా?" అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ... "ఆస్తి నాదా జగన్‌దా? అని వైసీపీ నాయకులు ఓట్లడగానికి వచ్చినపుడు మీరు అడగాలి. జగన్‌ తెచ్చిన లాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ చాలా ప్రమాదకరం! ఇది వస్తే ప్రజల భూమి ప్రజలది కాకుండా పోతుంది. ఆస్తి పత్రాల ఒరిజినల్స్‌ ప్రభుత్వం దగ్గర పెట్టుకుని.. కంప్యూటరు నకలు పత్రాలు ప్రజలకు ఇస్తామని చెప్పడం.. ఎంతవరకు సమంజసం? జగన్‌ పాలనలోనే నిత్యావసరాల ధరలు ఎందుకు పెరిగాయి? తొమ్మిదిసార్లు విద్యుత్‌ ఛార్జీలు ఎందుకు పెరిగాయి? జె.బ్రాండ్ల మద్యంతో తాను కోట్లు సంపాదించి ప్రజారోగ్యాన్ని అత్యంత దారుణంగా దెబ్బతీశాడు. గత మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం తరువాత ఓట్లడుతానన్న జగన్‌.. ఇప్పుడు ప్రజల ముందుకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నాడు." అంటూ దుయ్యబట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>