PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politics-ycp-tdp-pole-stratogy-survey-jagan-chandrababu359355be-d0d3-46ef-aa1d-8eb40442eef9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politics-ycp-tdp-pole-stratogy-survey-jagan-chandrababu359355be-d0d3-46ef-aa1d-8eb40442eef9-415x250-IndiaHerald.jpgఏపీలో ఎన్నికలకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఇదే తరుణంలో టిడిపి కూటమి, వైసీపీ అభ్యర్థులు వారి యొక్క ప్రచారాన్ని స్పీడ్ చేశారు. గెలుపే లక్ష్యంగా అనేక వాగ్దానాలు చేస్తూ ప్రజలను మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా అయితే ప్రజలు పార్టీల వైపు మొగ్గు చూపుతారో ఆ విధమైనటువంటి ప్రలోభాలు కూడా మొదలుపెట్టేశారు. ఈ క్రమంలోనే కొన్ని సర్వే సంస్థలు చేసినటువంటి సర్వేలను కూడా బయట పెడుతున్నారు. కొన్ని సర్వే సంస్థలేమో టిడిపి విజయం సాధిస్తుంది అంటే, మరి కొన్ని సర్వే సంస్థలు వైసీపీకి అనుకూలంగా ఉంటుంAP;POLITICS;YCP;TDP;POLE STRATOGY SURVEY;JAGAN;CHANDRABABU{#}Parliament;local language;Survey;MLA;YCP;TDPఏపీ: సంచలన సర్వే..మళ్లీ సీఎం జగనే.. ఎన్ని సీట్లంటే.?ఏపీ: సంచలన సర్వే..మళ్లీ సీఎం జగనే.. ఎన్ని సీట్లంటే.?AP;POLITICS;YCP;TDP;POLE STRATOGY SURVEY;JAGAN;CHANDRABABU{#}Parliament;local language;Survey;MLA;YCP;TDPFri, 10 May 2024 18:18:00 GMT ఏపీలో ఎన్నికలకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఇదే తరుణంలో టిడిపి కూటమి, వైసీపీ అభ్యర్థులు వారి యొక్క ప్రచారాన్ని స్పీడ్ చేశారు.  గెలుపే లక్ష్యంగా అనేక వాగ్దానాలు చేస్తూ ప్రజలను మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా అయితే ప్రజలు పార్టీల వైపు మొగ్గు చూపుతారో ఆ విధమైనటువంటి ప్రలోభాలు కూడా మొదలుపెట్టేశారు. ఈ క్రమంలోనే కొన్ని సర్వే సంస్థలు  చేసినటువంటి సర్వేలను కూడా బయట పెడుతున్నారు. కొన్ని సర్వే సంస్థలేమో టిడిపి విజయం సాధిస్తుంది అంటే, మరి కొన్ని సర్వే సంస్థలు వైసీపీకి అనుకూలంగా ఉంటుందని చెబుతున్నాయి. ఈ విధంగా సాగుతున్న ఈ తరుణంలో  ఒక సర్వే సంస్థ పూర్తి స్థాయిలో వైసీపీ విజయమని బాహాటంగా చెబుతోంది. 

ఇంతకీ ఆ సర్వే సంస్థ ఏంటయ్యా అంటే.. పోల్ స్ట్రాటజీ గ్రూప్స్. ఏపీలో రాజకీయ పరిస్థితులపై వారి యొక్క సర్వేను పూర్తిస్థాయిలో నిర్వహించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి మొదలు  మే 7వ తేదీ వరకు  పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజలు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు  అనే దానిపై వారు దాదాపుగా 2 లక్షలకు పైగా ఓటర్ల అభిప్రాయాలను సేకరించారట.  ఈ సర్వేలో వారికి అందిన వివరాలను తాజాగా బయటపెట్టేసింది.  వారు తెలిపిన వివరాల ప్రకారం ఎన్నికల్లో వైసీపీకే ఎక్కువగా సపోర్టు లభిస్తుందట. 175 నియోజకవర్గాలకు గాను  120 నుంచి 130 ఎమ్మెల్యే సీట్లు గెలుస్తుందని, అంతేకాకుండా టిడిపి కూటమి 45 నుంచి 55 స్థానాలు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉందని తెలియజేసింది.  అలాగే పార్లమెంటు స్థానాల్లో కూడా వైసీపీ విజయ ఢంకా మోగిస్తుందని  వారి సర్వేలో వెల్లడైంది.

ఈ సర్వేలో వారికి వచ్చిన వివరాల ప్రకారం.. వాలంటీర్ వ్యవస్థ వల్ల చాలా మంది పేద ప్రజలు ఆనందంగా ఉన్నారట. కుల,మత, ప్రాంతాల ప్రతిపాదికన కాకుండా నిజమైన పేదలకు పథకాలు అందాయట. అంతేకాకుండా కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా చెప్పారట.  దీనికి కారణం లోకల్ వైసిపి లీడర్ల వల్ల ఇబ్బంది పడ్డామని చెప్పారట. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు తీసుకొని చేసినటువంటి సర్వే ఫలితాలను బయట పెట్టేశారు. ఈ సర్వేపై  టిడిపి నాయకులు స్పందిస్తూ అదంతా ఫేక్ సర్వే, రాబోయేది టిడిపి ప్రభుత్వమే అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇక ఏ సర్వే సంస్థ ఎన్ని చెప్పినా  ప్రజల మనసులో ఏముంది అనేది ఎన్నికల  రిజల్ట్ తర్వాత తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>