PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-political-lates-news-tollywood-chiranjivi-brahmanandam924f0a27-7cad-4cb9-8cf0-06e37e63ef5c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-political-lates-news-tollywood-chiranjivi-brahmanandam924f0a27-7cad-4cb9-8cf0-06e37e63ef5c-415x250-IndiaHerald.jpgఏపీలో మరో రెండు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జగన్, టీడీపీ కూటమి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. వీరిలో ఎవరికి వారు ప్రజలను ఆకర్షించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి తాను చేసిన గత ఐదేళ్ల పరిపాలనే తనను గెలిపిస్తుందని బలంగా నమ్ముతున్నారు. ap political lates news tollywood chiranjivi brahmanandam{#}Brahmanandam;Chiranjeevi;kalyan;Industry;Cinema;Janasena;Jagan;Assembly;YCP;Andhra Pradesh;TDPమెగాస్టార్‌కి షాక్ ఇచ్చిన బ్రహ్మానందం.. ఆ పార్టీకే మద్దతు?మెగాస్టార్‌కి షాక్ ఇచ్చిన బ్రహ్మానందం.. ఆ పార్టీకే మద్దతు?ap political lates news tollywood chiranjivi brahmanandam{#}Brahmanandam;Chiranjeevi;kalyan;Industry;Cinema;Janasena;Jagan;Assembly;YCP;Andhra Pradesh;TDPFri, 10 May 2024 11:30:00 GMTఏపీలో మరో రెండు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జగన్, టీడీపీ కూటమి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. వీరిలో ఎవరికి వారు ప్రజలను ఆకర్షించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి తాను చేసిన గత ఐదేళ్ల పరిపాలనే తనను గెలిపిస్తుందని బలంగా నమ్ముతున్నారు. టీడీపీ వాళ్ళు మాత్రం ప్రజల నమ్మకాన్ని గెలుచుకునేందుకు కష్టపడుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ వాళ్లను కూడా రంగంలోకి దింపి తనకు అనుకూలంగా ప్రచారం చేయించుకుంటున్నారు.

అయితే ప్రజలపై బాగా ప్రభావం కలిగి ఉన్న స్టార్ హీరోలు, కమెడియన్లు మాత్రం జనసేన, టీడీపీ వారికి షాక్‌లు ఇస్తున్నారు. దిగ్గజ హాస్యనటుడు బ్రహ్మానందం కూడా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడిని గెలిపించాలని బాగా ఆశపడుతున్నారు చిరంజీవికి బ్రహ్మానందానికి మంచి సంబంధాలు ఉన్నాయి. మీరు ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉంటూ రాసుకుని పూసుకొని తిరుగుతుంటారు. అలాంటి చిరంజీవి ఏమనుకుంటారు అని ఎలాంటి నిర్మొహమాటం లేకుండా  బ్రహ్మానందం వైసీపీ సపోర్టును ప్రకటించారు. పవన్ తో పాటు చిరు కూడా షాక్ అయినట్లు తెలుస్తోంది.

పోలింగ్ తేదీకి రెండు రోజుల సమయం ఉండగా ఈ కీలక సమయంలో బ్రహ్మానందం మాట్లాడుతూ.. "మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు ఏపీ సీఎం జగన్ మహాయజ్ఞం ఇస్తున్నారు. అందులో భాగంగా ఉన్న చేయూత, ఆసరా వంటి పథకాలు ప్రవేశపెట్టారు. వీటివల్ల ప్రజలు వైసీపీ పార్టీకి బాగా దగ్గరయ్యారు ఇది చూడలేని టీడీపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతోంది. ప్రజలను వైసీపీకి దూరం చేయాలనే ఆలోచనతో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. ఆ సంక్షేమ పథకాలకు ఆపివేసి మహిళా సాధికారతకు బ్రేకులు వేశారు. ఇది చాలా దురదుష్టకరమైన విషయం. మహిళలందరికీ న్యాయం జరగాలంటే మళ్లీ జగన్ గెలవాలి, అందుకే మనమందరం ఓటు వేసి గెలిపించుకోవాలి." అని వైసీపీకి సపోర్ట్ గా వ్యాఖ్యానించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>