PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/who-ate-those-crores-jagan90b8fef9-b12e-41d0-8ab1-c6db8d3997aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/who-ate-those-crores-jagan90b8fef9-b12e-41d0-8ab1-c6db8d3997aa-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని సందర్భాల్లో తెలిసి మాట్లాడతారో తెలీక మాట్లాడతారో తెలీదు కానీ ఆయన కామెంట్ల వల్ల జరిగే నష్టం మాత్రం అంతాఇంతా కాదు. సరిగ్గా ఎన్నికలకు రెండు రోజుల ముందు పవన్ కళ్యాణ్ ముస్లింలు, కాపులకు రిజర్వేషన్లకు సంబంధించి చేసిన కామెంట్లు కూటమికి తీరని నష్టం చేయడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. pawan kalyan{#}Supreme Court;television;kalyan;media;Pawan Kalyan;Jagan;Andhra Pradesh;Bharatiya Janata Partyముస్లింలు, కాపులకు రిజర్వేషన్లు అక్కర్లేదన్న పవన్.. ఈ వ్యాఖ్యలతో కూటమికి నష్టమే?ముస్లింలు, కాపులకు రిజర్వేషన్లు అక్కర్లేదన్న పవన్.. ఈ వ్యాఖ్యలతో కూటమికి నష్టమే?pawan kalyan{#}Supreme Court;television;kalyan;media;Pawan Kalyan;Jagan;Andhra Pradesh;Bharatiya Janata PartyFri, 10 May 2024 11:05:00 GMTజనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని సందర్భాల్లో తెలిసి మాట్లాడతారో తెలీక మాట్లాడతారో తెలీదు కానీ ఆయన కామెంట్ల వల్ల జరిగే నష్టం మాత్రం అంతాఇంతా కాదు. సరిగ్గా ఎన్నికలకు రెండు రోజుల ముందు పవన్ కళ్యాణ్ ముస్లింలు, కాపులకు రిజర్వేషన్లకు సంబంధించి చేసిన కామెంట్లు కూటమికి తీరని నష్టం చేయడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
ఒక ఇంగ్లీష్ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కోరుకున్న వారందరికీ రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదని పవన్ చేసిన కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. రిజర్వేషన్లకు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని పవన్ తెలిపారు. ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ ప్రకటనల వల్ల తాను నిరాశ చెందలేదని ఆయన చెప్పుకొచ్చారు. యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలు పెంచేలా శిక్షణ ఇవ్వాలని తాను కోరుకుంటున్నానని పవన్ పేర్కొన్నారు.
 
కాపు కులం కూడా రిజర్వేషన్ల కోసం దశాబ్దాలుగా పోటీ చేస్తోందని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని పవన్ పేర్కొన్నారు. పవన్ కనీస అవగాహన లేకుండా చేస్తున్న కామెంట్లు కూటమిని ముంచేయబోతున్నామని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కామెంట్లపై ఏ విధంగా వివరణ ఇవ్వాలో కూడా బాబుకు అర్థం కావడం లేదు.
 
మరోవైపు జగన్ మాత్రం తాను ముస్లింలకు అన్యాయం జరగనివ్వనని వాళ్లకు ఎప్పటికీ అండగా ఉంటానని చెబుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబుకు కాలం కలిసిరావడం లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఏపీలో ఎన్నికల ప్రచారం దాదాపుగా ముగిసినట్టేనని చెప్పవచ్చు. పోల్ మేనేజ్ మెంట్ విషయంలో జాగ్రత్త వహిస్తే మాత్రం ఆ పార్టీకే రాష్ట్రంలో గెలుపు సునాయాసంగా దక్కుతుందని చెప్పవచ్చు. ఏపీ ఎన్నికలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి.
 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>