PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/modi05df68f4-83da-4760-87e7-92f0ce0c429b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/modi05df68f4-83da-4760-87e7-92f0ce0c429b-415x250-IndiaHerald.jpgదేశంలోనే అత్యత కీలకమైన లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కదనరంగంలోకి దిగాయి. మండుటెండలను సైతం లెక్కచేయకుండా నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే వారి మధ్య మాటలు, తూటాలు పేలుతున్నాయి. ఇలా సీరియస్ గా ఉన్న రాజకీయ వాతావరణాన్ని కూల్ చేస్తూ ప్రధాని మోదీ.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డ్యాన్సింగ్ వీడియోలు బయటకు వచ్చాయి. ఎవరు రూపొందించారో గానీ.. ప్రధాని మోదీ కుర్రాడిలా డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సేమ్modi{#}West Bengal - Kolkata;Mamta Mohandas;Narendra Modi;Prime Minister;police;Yevaru;media;Electionsమమత.. మోదీని మించిన నియంత.. ఇదిగో సాక్ష్యం?మమత.. మోదీని మించిన నియంత.. ఇదిగో సాక్ష్యం?modi{#}West Bengal - Kolkata;Mamta Mohandas;Narendra Modi;Prime Minister;police;Yevaru;media;ElectionsThu, 09 May 2024 09:52:23 GMTదేశంలోనే అత్యత కీలకమైన లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కదనరంగంలోకి దిగాయి. మండుటెండలను సైతం లెక్కచేయకుండా నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే వారి మధ్య మాటలు, తూటాలు పేలుతున్నాయి. ఇలా సీరియస్ గా ఉన్న రాజకీయ వాతావరణాన్ని కూల్ చేస్తూ ప్రధాని మోదీ.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డ్యాన్సింగ్ వీడియోలు బయటకు వచ్చాయి.


ఎవరు రూపొందించారో గానీ.. ప్రధాని మోదీ కుర్రాడిలా డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సేమ్ టూ సేమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా హుషారుగా డ్యాన్స్ చేస్తున్న వీడియో కూడా వైరల్ గా మారింది. అయితే ఇద్దరూ రాజకీయ నాయకులే. ఉన్నత పదవుల్లో ఉన్నవారే. కానీ డ్యాన్సింగ్ వీడియోపై.. మోదీ ఒకలా.. దీదీ మరోలా రియాక్ట్ అవ్వడం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.


దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. ఈ వీడియో చూసి మీరంతా ఎంజాయ్ చేసినట్టే నేను కూడా నా డ్యాన్సింగ్ చూసి సంతోషపడ్డా. ఈ వీడియో అత్యంత సృజనాత్మకంగా ఉంది. ఎన్నికల హడావుడి సమయంలో ఇలాంటి వీడియోలు ఎంతో ఉపశమనంగా అనిపిస్తాయి. ఇలాంటివి తనకెంతో సంతోషాన్ని కలిగిస్తాయి అనేలా ప్రధాని తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చి.. పోస్ట్ చేసిన నెటిజన్ ను, క్రియేటర్ ను ప్రశంసించారు.


ఇక దీదీ విషయానికొస్తే ఆమె ప్రధానికి భిన్నంగా స్పందించారు. ఈ డ్యాన్సింగ్ వీడియో తనను అవమానించేలా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వీడియో పోస్టు చేసిన, క్రియేట్ చేసిన వారిని గుర్తించి వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు కదన రంగంలోకి దిగి ఈ వీడియోను రూపొందించింది ఎవరో గుర్తించే పనిలో పడ్డారు. అయితే  ఈ వీడియో పోస్టు చేసిన నెటిజన్ దానికి  ఓ క్యాప్షన్ రాసుకొచ్చారు.  దీన్ని చూసిన ఆ నియంత నన్ను అరెస్టు చేయరని తెలుసు అని సరదా క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పుడు దీనిపై దీదీ స్పందించిన తీరు చూస్తుంటే ఎవరు నియంత అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>