PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/sharmila-d2df8932-b222-48ea-b7f0-28110a69a17c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/sharmila-d2df8932-b222-48ea-b7f0-28110a69a17c-415x250-IndiaHerald.jpg•కాంగ్రెస్ పార్టీకి పులిబోను లాంటి ఆంధ్రాలో షర్మిళ సాహసం •లాజిక్ లేని ప్రసంగాలకే పరిమితమవుతున్న షర్మిళ ఆంధ్రప్రదేశ్ లో నోటా కంటే తక్కువ ఓటు బ్యాంకు వున్న పార్టీ ఏదయ్యా అంటే ఖచ్చితంగా అందరికి గుర్తొచ్చే పార్టీ కాంగ్రెస్‌ పార్టీ. అసలు ఈ కాంగ్రెస్ పార్టీ వల్లే ఆంధ్రప్రదేశ్ కి నేడు రాజధాని లేని దుస్థితి వచ్చింది. దేశమంతా మన రాష్ట్రాన్ని రాజధాని లేదని చిన్న చూపు చూస్తుంది. అలాంటి పరిస్థితి మనకు కాంగ్రెస్ వల్లే వచ్చింది. వైసీపీ ఫ్యాన్స్ చంద్రబాబుని, టీడీపీ ఫ్యాన్స్ జగన్ ని తప్పుబడతారు కానీ.. మన రాషSharmila {#}Assam;zero;Survey;Tiger;Capital;Telangana;India;YCP;TDP;Jagan;Andhra Pradesh;Party;CM;Congressషర్మిళ: ప్రచార పదనిసకే తప్ప.. పోటీకి పనికిరారు?షర్మిళ: ప్రచార పదనిసకే తప్ప.. పోటీకి పనికిరారు?Sharmila {#}Assam;zero;Survey;Tiger;Capital;Telangana;India;YCP;TDP;Jagan;Andhra Pradesh;Party;CM;CongressThu, 09 May 2024 09:48:32 GMT•కాంగ్రెస్ పార్టీకి పులిబోను లాంటి ఆంధ్రాలో షర్మిళ సాహసం
•లాజిక్ లేని ప్రసంగాలకే పరిమితమవుతున్న షర్మిళ


ఆంధ్రప్రదేశ్ లో నోటా కంటే తక్కువ ఓటు బ్యాంకు వున్న పార్టీ ఏదయ్యా అంటే ఖచ్చితంగా అందరికి గుర్తొచ్చే పార్టీ కాంగ్రెస్‌ పార్టీ. అసలు ఈ కాంగ్రెస్ పార్టీ వల్లే ఆంధ్రప్రదేశ్ కి నేడు రాజధాని లేని దుస్థితి వచ్చింది. దేశమంతా మన రాష్ట్రాన్ని రాజధాని లేదని చిన్న చూపు చూస్తుంది. అలాంటి  పరిస్థితి మనకు కాంగ్రెస్ వల్లే వచ్చింది. వైసీపీ ఫ్యాన్స్ చంద్రబాబుని, టీడీపీ ఫ్యాన్స్ జగన్ ని తప్పుబడతారు కానీ.. మన రాష్ట్రానికి రాజధాని లేకుండా దేశమంతా మనల్ని చూసి నవ్వుకునేలా చేసింది మాత్రం ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీనే అనేది వాస్తవం. అందుకే రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ కి జీరో అంచనాలు ఉన్నాయి. అసలు ఆ పార్టీ అంటూ ఒకటి మన రాష్ట్రంలో ఉందనే సంగతి కూడా చాలా మందికి తెలీదు. అలా మన ఆంధ్రప్రదేశ్ నుంచి అస్సాం అయిన ఆ పార్టీ బాధ్యతలని తెలంగాణాలో దారుణంగా ఓడిపోయిన షర్మిళ తీసుకుంది. మరి గెలవడానికో లేదా తెలంగాణ ఓటమి ఆమెకు సరిపోలేదో తెలీదు కానీ అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏ అంచనాలు లేని కాంగ్రెస్ బాధ్యతలని షర్మిళ తీసుకుంది. 


అసలే కాంగ్రెస్ పరిస్థితి బాగలేదు. పైగా షర్మిళని నెట్టింటా దారుణంగా ట్రోల్ చేశారు. అలాంటి పరిస్థితి ఎదురుకున్న షర్మిళ కాంగ్రెస్ కి పులి బోను లాంటి ఆంధ్రప్రదేశ్లో ఏకంగా సీఎం సీటు కోసం పోటీ చేస్తుందంటే సాహసమనే చెప్పాలి. షర్మిళ ప్రచారాలతో పాపులర్ అయ్యారు. కానీ పాజిటివ్ గా కాదు నెగటివ్ గా పాపులర్ అయ్యారు. ఆమె కేవలం ప్రచార పదనిసకే తప్ప పోటీకి పనికిరారు అనే కామెంట్స్ ఇండియా హెరాల్డ్ చేసిన సర్వే ద్వారా తెలుస్తుంది.షర్మిళ చేసే ఆ ప్రసంగాల పదనిసలు కూడా లాజిక్ లేకుండా ఉంటున్నాయి. జనాలకి విసుగు పుట్టిస్తున్నాయి. తన అన్న జగన్ ని టార్గెట్ చేస్తూ పాడిన పాటే పాడుతూ ఉండటం ప్రజలకు విసుగు పుట్టిస్తుంది. పైగా ఆమె మాటలు  కూడా ప్రజలకి ఫేక్ గా అనిపిస్తున్నాయి. ఆమె లాజిక్ లేని ప్రసంగాల వల్ల సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ కూడా బాగా పెరుగుతుంది. అదే ఆమెకు బాగా మైనస్ గా మారింది.  అందుకే ఆమె మాటలకే తప్ప పోటీకి పనికి రారు అని పూర్తిగా స్పష్టమవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>