Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder5e536b83-f0e5-479f-a820-71461dfe9e99-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder5e536b83-f0e5-479f-a820-71461dfe9e99-415x250-IndiaHerald.jpgభార్యాభర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉండాలి. ఒక్కసారి మూడుముళ్ల బంధంతో ఒక్కటైన తర్వాత కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడునీడగా ఉండాలి. కానీ నేటి రోజుల్లో భార్యాభర్తల మధ్య మాత్రం ఇలాంటి అన్యోన్యత ఎక్కడ కనిపించడం లేదు. చిన్న చిన్న కారణాలకే ఒకరిపై ఒకరు దారుణంగా దాడి చేసుకోవడానికి కూడా రెడీ అవుతున్నారు. భార్యాభర్తల్లా కాదు బద్ధ శత్రువులుగా బ్రతుకుతూ ఏకంగా ప్రాణాలు తీసుకునేందుకు కూడా వెనకడుగు వేయని పరిస్థితి నెలకొంది అన్న విషయం తెలిసిందే. అయితే భార్యాభర్తల బంధం అన్యోన్యంగా ఉండాలి అంటే వారMurder{#}Mirza;indra;Wife;Police Station;police;Husband;Huzur Nagar;Hyderabad;Murder.భార్యపై అనుమానం.. చివరికి భర్త ఏం చేశాడో తెలుసా?భార్యపై అనుమానం.. చివరికి భర్త ఏం చేశాడో తెలుసా?Murder{#}Mirza;indra;Wife;Police Station;police;Husband;Huzur Nagar;Hyderabad;Murder.Thu, 09 May 2024 08:30:00 GMTభార్యాభర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉండాలి. ఒక్కసారి మూడుముళ్ల బంధంతో ఒక్కటైన  తర్వాత కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడునీడగా ఉండాలి. కానీ నేటి రోజుల్లో భార్యాభర్తల మధ్య మాత్రం ఇలాంటి అన్యోన్యత ఎక్కడ కనిపించడం లేదు. చిన్న చిన్న కారణాలకే ఒకరిపై ఒకరు దారుణంగా దాడి చేసుకోవడానికి కూడా రెడీ అవుతున్నారు. భార్యాభర్తల్లా కాదు బద్ధ శత్రువులుగా బ్రతుకుతూ ఏకంగా ప్రాణాలు తీసుకునేందుకు కూడా వెనకడుగు వేయని పరిస్థితి నెలకొంది అన్న విషయం తెలిసిందే.


 అయితే భార్యాభర్తల బంధం అన్యోన్యంగా ఉండాలి అంటే వారి బంధంలో నమ్మకం అనేది ఎంతో ముఖ్యం. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉన్నప్పుడే అటు బంధం నిలబడుతూ ఉంటుంది. ఏ చిన్న అనుమానం ఉన్న కూడా అది చివరికి దారుణమైన పరిస్థితులకు దారితీస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు ఇలా కట్టుకున్న వారిపై అనుమానాన్ని పెంచుకొని ఏకంగా హత్యలు చేసిన ఘటనలు కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ వెలుగులోకి వచ్చింది కూడా ఇలాంటి తరహా ఘటనే అని చెప్పాలి. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త చివరికి ఓ రోజు దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్ నగర శివారులో వెలుగులోకి వచ్చింది.


 గచ్చిబౌలి సమీపంలోని మొకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది అని చెప్పాలి. మీర్జా గూడ పరిధి ఇంద్ర రెడ్డి నగర్ లో ఉండే వడ్డే. మాణిక్యం,  యాదమ్మ దంపతులు. కూలి పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. అయితే కొన్ని రోజుల నుండి అటు భార్య యాదమ్మను అనుమనిస్తూ వచ్చాడు భర్త మాణిక్యం. సూటిపోటి మాటలు అంటూ వేధిస్తూ ఉండేవాడు. అయితే అతనిలో ఉన్న అనుమానం పెనుభూతంగా మారింది. ఈ క్రమంలోనే ఇటీవల యాదమ్మ రాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో ఆమె తలపై బండరాయితో మోది.. దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>