Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-18d047fa-6169-411f-8653-b2f476a105f2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-18d047fa-6169-411f-8653-b2f476a105f2-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉండగా ఒక్క హైదరాబాద్ స్థానంలో విజయం ఎవరిని వరిస్తుంది అనే విషయంపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇక్కడ ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా అటు ఎంఐఎం పార్టీని గెలుస్తూ వచ్చింది. ఎంతో మంది రాజకీయ ఉద్దండులు పోటీ చేసిన విజయం మాత్రం సాధించలేకపోయారు. అయితే ఇక్కడ ఈసారి బిజెపి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపింది. పూర్తిస్థాయి హిందుత్వాది అయిన మాధవి లత ఓవైసీ ని ఎదుర్కొనేందుకు రెడీ అయ్యారు. ఏకంగా మాధవి లత తన ప్రసంగాలతో ఓవైసీకి సైతం ఓటమి భయం కలిగిస్తBjp {#}madhavi;madhavi latha;MIM Party;Cheque;Hyderabad;Parliment;Elections;Population;Party;Telangana;Bharatiya Janata Party;Teluguబిజెపిలో కొత్త జోష్.. మాధవి లత, రాజాసింగ్ కలిశారు?బిజెపిలో కొత్త జోష్.. మాధవి లత, రాజాసింగ్ కలిశారు?Bjp {#}madhavi;madhavi latha;MIM Party;Cheque;Hyderabad;Parliment;Elections;Population;Party;Telangana;Bharatiya Janata Party;TeluguThu, 09 May 2024 09:23:00 GMTప్రస్తుతం తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉండగా ఒక్క హైదరాబాద్ స్థానంలో విజయం ఎవరిని వరిస్తుంది అనే విషయంపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇక్కడ ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా అటు ఎంఐఎం పార్టీని గెలుస్తూ వచ్చింది. ఎంతో మంది రాజకీయ ఉద్దండులు పోటీ చేసిన విజయం మాత్రం సాధించలేకపోయారు. అయితే ఇక్కడ ఈసారి బిజెపి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపింది. పూర్తిస్థాయి హిందుత్వాది అయిన మాధవి లత ఓవైసీ ని ఎదుర్కొనేందుకు రెడీ అయ్యారు.


 ఏకంగా మాధవి లత తన ప్రసంగాలతో ఓవైసీకి సైతం ఓటమి భయం కలిగిస్తుంది అంటూ తెలంగాణ రాజకీయాల్లో ప్రచారం జరుగుతుంది. హిందూ జనాభా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే కాదు ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రచారం నిర్వహిస్తూ స్పష్టమైన హామీలను ఇస్తూ ఉన్నారు మాధవి లత. ఇక ఆమె పోటీని తట్టుకునేందుకు ఏకంగా ఎప్పుడూ లేనివిధంగా ఓవైసీ తెలుగు పాటలను పాడించుకుని  మరి ప్రచారం చేస్తున్నారు. ఏకంగా హిందువులు ఉండే ప్రాంతాల్లో సైతం ప్రచారం చేయడానికి రెడీ అయ్యారు. అయితే ఇలా మాధవి లత ప్రచారంలో దూసుకుపోతున్న ఇక హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని బిజెపి కీలక నేత రాజాసింగ్ మాత్రం అటు మాధవిలకు ఎక్కడ మద్దతు ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.


ఎంపీ టికెట్ ఆశించిన తనకు ఆ టికెట్ దక్కకపోవడంతోనే రాజాసింగ్ దూరంగా ఉంటున్నాడని.. లేదంటే తన అభిప్రాయం తీసుకోకుండానే మాధవి లతకు టికెట్ ఇచ్చారు అంటూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడంటూ విమర్శలు వచ్చాయి. అయితే ఇటీవల రాజాసింగ్ విమర్శలు అన్నింటికీ చెక్ పెట్టే విధంగా మాధవి లతతో కలిసి ఇక ఒక సమావేశంలో పాల్గొన్నారు. తద్వారా తాను మాధవి లత వెనకే ఉన్నానని.. పార్టీ విజయం కోసం కృషి చేస్తాను అని చెప్పకనే చెప్పారు. ఇక ఒంటరిగానే ఓవైసీ ని ఎంతో బలంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైన మాధవి లత.. ఇక ఇప్పుడు రాజాసింగ్ మద్దతుతో మరింత జోరు చూపించే అవకాశం ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>