MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/preminchoddu583d9794-3fa0-445e-97d7-e60689c721a9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/preminchoddu583d9794-3fa0-445e-97d7-e60689c721a9-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు కలెక్షన్ల పరంగా అదరగొడుతున్న సంగతి తెలిసిందే. శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ప్రేమించొద్దు జూన్ నెల 7వ తేదీన విడుదల కానుంది. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకు వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తుండగా ఈ మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. బ‌స్తీ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ ప్రేమ కథాంశంగా ఈ మూవీ తెరకెక్కింది. preminchoddu{#}manasa;shirin;sriram;Chaitanya;June;News;prema;Love;Director;Cinemaపాన్ ఇండియా మూవీగా ప్రేమించొద్దు.. చిన్న సినిమాల్లో సంచలనం సృష్టిస్తుందా?పాన్ ఇండియా మూవీగా ప్రేమించొద్దు.. చిన్న సినిమాల్లో సంచలనం సృష్టిస్తుందా?preminchoddu{#}manasa;shirin;sriram;Chaitanya;June;News;prema;Love;Director;CinemaThu, 09 May 2024 18:23:00 GMTఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు కలెక్షన్ల పరంగా అదరగొడుతున్న సంగతి తెలిసిందే. శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ప్రేమించొద్దు జూన్ నెల 7వ తేదీన విడుదల కానుంది. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకు వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తుండగా ఈ మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. బ‌స్తీ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ ప్రేమ కథాంశంగా ఈ మూవీ తెరకెక్కింది.
 
సినిమా ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకోగా సెన్సార్ సభ్యుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని సమాచారం అందుతోంది. 5 భాషల్లో ఈ సినిమా తెరకెక్కగా జూన్ నెల 7వ తేదీన ఈ సినిమా తెలుగు వెర్షన్ విడుదల కానుంది. యువతలో చాలా మంది నిజమైన ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియకుండా తప్పటడుగులు వేస్తున్నారని ఈ విధంగా చేయడం వాళ్ల జీవితాలపై ప్రభావం చూపుతుందని శిరిన్ శ్రీరామ్ కామెంట్లు చేశారు.
 
వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించామని అందరికీ కనెక్ట్ అయ్యే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోందని ఆయన అన్నారు. తెలుగులో రిలీజ్ తర్వాత ఇతర భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ చెప్పుకొచ్చారు. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని మేకర్స్ కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
 
సినిమా చిన్న సినిమాల్లో సంచలనం సృష్టించి ప్రేక్షకులను మెప్పిస్తుందేమో చూడాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం. చైతన్య స్రవంతి ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారని తెలుస్తోంది. ప్రేమించొద్దు మూవీతో శిరీన్ శ్రీరామ్ ఏ రేంజ్ హిట్ సాధిస్తారో చూడాల్సి ఉంది. ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>