MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-antony8ab54366-0943-4a31-964b-b14f8e3802de-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-antony8ab54366-0943-4a31-964b-b14f8e3802de-415x250-IndiaHerald.jpgతమిళ నటుడు విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో నటించినప్పటికీ వాటి ద్వారా ఈయనకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. అలాంటి సమయం లోనే ఈయన బిచ్చగాడు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ పెద్ద విజయం సాధించడంతో ఈయనకు తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఏర్పడింది. ఇక ఈ మూవీ కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ కావడంతో ఈ సినిమాని తెలుగు లో కూడా విడుదల చేశారు. పెద్దగా అంచనాలు లేకుండా తెలుగులో విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన మౌత్ టాక్ ను తెచ్చుకొని భారీ విvijay antony{#}vijay antony;Joseph Vijay;Tollywood;Amazon;Success;Love;Tamil;Box office;Cinema;Teluguరోమియో "ఓటిటి"విడుదలకు అంతా సిద్ధం..!రోమియో "ఓటిటి"విడుదలకు అంతా సిద్ధం..!vijay antony{#}vijay antony;Joseph Vijay;Tollywood;Amazon;Success;Love;Tamil;Box office;Cinema;TeluguThu, 09 May 2024 11:33:02 GMTతమిళ నటుడు విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో నటించినప్పటికీ వాటి ద్వారా ఈయనకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. అలాంటి సమయం లోనే ఈయన బిచ్చగాడు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ పెద్ద విజయం సాధించడంతో ఈయనకు తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఏర్పడింది. ఇక ఈ మూవీ కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ కావడంతో ఈ సినిమాని తెలుగు లో కూడా విడుదల చేశారు.

పెద్దగా అంచనాలు లేకుండా తెలుగులో విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన మౌత్  టాక్ ను తెచ్చుకొని భారీ విజయాన్ని అందుకొని సూపర్ సాలిడ్ కలెక్షన్ లను రాబట్టింది. ఈ మూవీ తో తెలుగు లో కూడా విజయ్ కి సూపర్ క్రేజ్ లభించింది. ఇక ఆ తర్వాత నుండి ఈయన నటించిన ప్రతి సినిమాను కూడా తెలుగు లో విడుదల చేస్తూ వస్తున్నాడు. కానీ అందులో బిచ్చగాడు 2 మూవీ తప్పితే ఏ సినిమా కూడా ఈయనకు కమర్షియల్ గా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని అందించలేదు. ఇకపోతే తాజాగా విజయ్ ఆంటోనీ , వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో రూపొందిన రోమియో అనే సినిమాలో హీరోగా నటించాడు.

మూవీ తెలుగు లో లవ్ గురు అనే పేరుతో విడుదల అయింది. ఇలా తమిళ్ మరియు తెలుగు లో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా "ఓ టి టి" లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. ఈ మూవీ యొక్క తమిళ వర్షన్ రోమియో హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు ఆహా సంస్థలు దక్కించుకున్నాయి. అందులో భాగంగా ఈ సినిమాను ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుండి స్రీమింగ్ చేయనున్నట్లు ప్రైమ్ వీడియో , ఆహా సంస్థలు అధికారికంగా ప్రకటించాయి. ఇక ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>