PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-betrayal-sr-ntrs-legacyed88e130-1d36-44a9-92c7-1ec070254e08-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-betrayal-sr-ntrs-legacyed88e130-1d36-44a9-92c7-1ec070254e08-415x250-IndiaHerald.jpgవైసీపీ పార్టీలో అత్యంత చురుకైన మరియు కీలకమైన వ్యక్తులలో కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) ఒకరు. ఈయన వైసీపీ పార్టీని గానీ, ఆ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని కానీ ఎవరైనా ఏమైనా అన్నట్లు అయితే వెంటనే స్పందిస్తూ వారిపై తనదైన స్థాయిలో కౌంటర్ ఇస్తూ ఉంటాడు. ఇలా తన పార్టీని , తన పార్టీ అధినేతను ఎవరు ఏమన్నా తనదైన స్థాయిలో స్పందిస్తూ ఎదుటి వ్యక్తికి కౌంటర్ ఇస్తూ ఉండడంతో ఈయనకు రాష్ట్రంలోనే అద్భుతమైన గుర్తింపు ఏర్పడింది. ఇక వైసీపీ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఈయన మొదట తెలుగుదేశం kn{#}Nani;Kodali Nani;sree;Hanu Raghavapudi;Telugu Desam Party;ramu;Amarnath Cave Temple;Yevaru;YCP;TDP;Andhra Pradesh;MLA;Partyకొడాలి నాని : అదే రూటు... అదే హీటు..?కొడాలి నాని : అదే రూటు... అదే హీటు..?kn{#}Nani;Kodali Nani;sree;Hanu Raghavapudi;Telugu Desam Party;ramu;Amarnath Cave Temple;Yevaru;YCP;TDP;Andhra Pradesh;MLA;PartyThu, 09 May 2024 09:34:00 GMTవైసీపీ పార్టీలో అత్యంత చురుకైన మరియు కీలకమైన వ్యక్తులలో కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) ఒకరు. ఈయన వైసీపీ పార్టీని గానీ, ఆ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని కానీ ఎవరైనా ఏమైనా అన్నట్లు అయితే వెంటనే స్పందిస్తూ వారిపై తనదైన స్థాయిలో కౌంటర్ ఇస్తూ ఉంటాడు. ఇలా తన పార్టీని , తన పార్టీ అధినేతను ఎవరు ఏమన్నా తనదైన స్థాయిలో స్పందిస్తూ ఎదుటి వ్యక్తికి కౌంటర్ ఇస్తూ ఉండడంతో ఈయనకు రాష్ట్రంలోనే అద్భుతమైన గుర్తింపు ఏర్పడింది. ఇక వైసీపీ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఈయన మొదట తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న సమయం లోనే 2004 వ సంవత్సరం గుడివాడ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.

ఆ తర్వాత జరిగిన 2009 వ సంవత్సరం ఎన్నికల్లో కూడా ఈయన తెలుగు దేశం పార్టీ తరపున పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక ఆ తర్వాత టిడిపి నుండి బయటకు వచ్చేసిన ఈయన వైసీపీ పార్టీలోకి జాయిన్ అయ్యారు. ఆ తర్వాత 2014 వ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుండి పోటీ చేసి మరోసారి గెలుపొందారు. ఈయన 2019 వ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో కూడా గెలుపొందారు. ఇకపోతే ఈయన మరికొన్ని రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో కూడా ఈ ప్రాంతం నుండే పోటీలోకి దిగబోతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతం నుండి చాలా సార్లు గెలిచిన అభ్యర్థి కావడంతో ఈయనకు ఈ ప్రాంతంలో అద్భుతమైన పట్టు ఉంది. దానితో ఈ సారి కూడా నాని నే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

ఇది ఇలా ఉంటే వైసీపీ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న నాని ఈసారి ప్రస్తుతం కూడా తనదైన స్థాయిలో ప్రత్యార్థులపై విరుచుకుపడుతున్నాడు. ఎప్పటికప్పుడు తన ఉనికిని చాటుకుంటునే ప్రత్యర్థులను తన మాటలతో కట్టిపడేస్తున్నాడు. అలాగే తన పార్టీని ఎవరేమైనా అన్నా కూడా తనదైన స్థాయిలో రియాక్ట్ అవుతూ వారందరికీ అదిరిపోయే కౌంటర్ ఇస్తున్నాడు. ఇక ఈ సారి గుడివాడ నుండి కూటమి అభ్యర్థిగా వెనిగండ్ల రాము బరిలోకి దిగబోతున్నాడు. మరి కొడాలి నాని , రాము మధ్య ఈ సారి పోటీ ఎలా ఉండబోతుందో అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>