MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jayashankar228d7e4c-7c7e-4630-98d2-6106b71c6fb0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jayashankar228d7e4c-7c7e-4630-98d2-6106b71c6fb0-415x250-IndiaHerald.jpgకొంతమంది దర్శకులు తక్కువ సినిమాలే తెరకెక్కించినా దర్శకులుగా తమకంటూ ప్రత్యేక ముద్రను కలిగి ఉండి సత్తా చాటుతారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని అలాంటి దర్శకులలో పేపర్ బాయ్ సినిమాతో తనకంటూ మార్క్ ను సొంతం చేసుకున్న డైరెక్టర్ జయశంకర్ ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా తన సినిమాలతో ప్రశంసలు అందుకుంటున్న ఈ డైరెక్టర్ తర్వాత సినిమా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో తెరకెక్కనుందని తెలుస్తోంది. jayashankar{#}Darsakudu;India;Director;Success;Tollywood;Industry;Cinemaపేపర్ బాయ్ డైరెక్టర్ తో జాక్వెలిన్ మూవీ.. ఈ కాంబో బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమా?పేపర్ బాయ్ డైరెక్టర్ తో జాక్వెలిన్ మూవీ.. ఈ కాంబో బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమా?jayashankar{#}Darsakudu;India;Director;Success;Tollywood;Industry;CinemaThu, 09 May 2024 21:05:00 GMTకొంతమంది దర్శకులు తక్కువ సినిమాలే తెరకెక్కించినా దర్శకులుగా తమకంటూ ప్రత్యేక ముద్రను కలిగి ఉండి సత్తా చాటుతారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని అలాంటి దర్శకులలో పేపర్ బాయ్ సినిమాతో తనకంటూ మార్క్ ను సొంతం చేసుకున్న డైరెక్టర్ జయశంకర్ ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా తన సినిమాలతో ప్రశంసలు అందుకుంటున్న ఈ డైరెక్టర్ తర్వాత సినిమా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో తెరకెక్కనుందని తెలుస్తోంది.
 
సున్నితమైన ఎమోషన్స్‌ను ఎంతో అద్భుతంగా చూపించే ఈ దర్శకుడు అదిరిపోయే లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ ను సిద్ధం చేశారని భోగట్టా. త్వరలో అరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ దర్శకుడు మొదట నయనతారకు లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ ను చెప్పారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ను కలిగి ఉన్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ ను ఈ సినిమా కోసం ఫైనల్ చేశారని తెలుస్తోంది.
 
జయశంకర్ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీతో పాటు మరిన్ని అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ కాంబో క్రేజీ కాంబో అవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఏపీలో ఎన్నికల హడావిడి పూర్తైన తర్వాత అరి సినిమా థియేటర్లలో విడుదల కానుందని తెలుస్తోంది.
 
సినిమా రిలీజ్ ఒకింత ఆలస్యం అయినప్పటికీ ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా ఇండస్ట్రీని షేక్ చేసే సినిమా అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటంతో అరి సినిమాపై క్రేజ్ పెరుగుతోంది. దర్శకుడు జయశంకర్ భవిష్యత్తులో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధించే ఛాన్స్ ఉందని అరి సినిమాతో ఆయన టాలెంట్ ఏంటో అర్థమవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. జయశంకర్ కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. త్వరలో అరి సినిమా ప్రమోషన్స్ మొదలుకానున్నాయి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>