PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/we-dont-know-midnight-goddali-politics-ys-sharmilaa557f57f-a6d3-4829-921e-dd85c1aed475-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/we-dont-know-midnight-goddali-politics-ys-sharmilaa557f57f-a6d3-4829-921e-dd85c1aed475-415x250-IndiaHerald.jpgఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మరోమారు సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. కడపలో వైసీపీ సింగిల్ ప్లేయర్ అంటూ భారతి కామెంట్లు చేసిన నేపథ్యంలో ఆ కామెంట్లపై షర్మిల ఫైర్ అయ్యారు. వాళ్లే అధికారంలో ఉండాలని వాళ్లకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లందరినీ నరికేయాలని వాళ్లే సింగిల్ ప్లేయర్ గా ఉండాలని భారతి స్ట్రాటజీ ఇదేనా అంటూ షర్మిల కామెంట్లు చేశారు. sharmila{#}bharathi old;Qualification;devineni avinash;prema;Gift;kadapa;court;Sharmila;Love;MP;Congress;YCP;Narendra Modi;Andhra Pradesh;Jaganగొడ్డలితో మిగతావాళ్లనూ నరికేయండన్న షర్మిల.. విమర్శలకు అడ్డూఅదుపు లేదా?గొడ్డలితో మిగతావాళ్లనూ నరికేయండన్న షర్మిల.. విమర్శలకు అడ్డూఅదుపు లేదా?sharmila{#}bharathi old;Qualification;devineni avinash;prema;Gift;kadapa;court;Sharmila;Love;MP;Congress;YCP;Narendra Modi;Andhra Pradesh;JaganWed, 08 May 2024 14:30:00 GMTఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మరోమారు సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. కడపలో వైసీపీ సింగిల్ ప్లేయర్ అంటూ భారతి కామెంట్లు చేసిన నేపథ్యంలో ఆ కామెంట్లపై షర్మిల ఫైర్ అయ్యారు. వాళ్లే అధికారంలో ఉండాలని వాళ్లకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లందరినీ నరికేయాలని వాళ్లే సింగిల్ ప్లేయర్ గా ఉండాలని భారతి స్ట్రాటజీ ఇదేనా అంటూ షర్మిల కామెంట్లు చేశారు.
 
గొడ్డలితో మిగతా వాళ్లనూ నరికేయండంటూ భారతిని టార్గెట్ చేస్తూ షర్మిల ఒకింత ఘాటు విమర్శలు చేశారు. ప్రజలకు ఎంపీ అందుబాటులో ఉండాలంటే నాకు ఓటెయ్యాలని మీ ఎంపీని జైలులో కలవాలంటే అవినాష్ రెడ్డికి ఓటెయ్యాలని ఆమె అన్నారు. దేవుడు మా వైపే ఉంటాడని గొడ్డలితో నరికే వాళ్ల వైపు కాదని కామెంట్లు చేశారు. అయితే విమర్శలకు అడ్డూఅదుపు లేదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
 
కోర్టు పరిధిలో కేసు ఉందని తుది తీర్పు వెలువడకుండానే రాజకీయ ప్రయోజనాల కోసం షర్మిల అవినాష్ ను, జగన్ కుటుంబాన్ని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కడప ప్రజల్లో తమ కుటుంబానికి, తమ పార్టీకి మంచి పేరు ఉందని అందువల్ల ఇక్కడి ప్రజలు తమ పార్టీకే మద్దతు ఇస్తారని భారతి చెప్పడం కూడా తప్పా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
 
అధికారమే పరమావధిగా షర్మిల తోడబుట్టిన అన్ననే దారుణంగా టార్గెట్ చేస్తున్నారని విమర్శలలో షర్మిల బాబు, పవన్ లను మించిపోయారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మోదీకి రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదని మోదీ ఏపీపై కపట ప్రేమ చూపిస్తున్నారని షర్మిల అన్నారు. ఏపీ ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలని ఆయనకు రేడియో గిఫ్ట్ గా పంపానని ఏపీ ప్రజల మన్ కీ బాత్ మోదీ వినాలని షర్మిల చెప్పుకొచ్చారు. షర్మిల కామెంట్లు ప్రస్తుతం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>