PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pm-modiea18a6e5-aa06-4da6-a756-3cf8f3a29f2a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pm-modiea18a6e5-aa06-4da6-a756-3cf8f3a29f2a-415x250-IndiaHerald.jpgదేశంలో ఎన్నికలు సమీపిస్తున్నవేళ విపక్షాలు తమ ప్రచారాలను వేగవంతం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రధాని మోడీ మాట్లాడుతూ... తాను అస్సలు ఇస్లాంకు, ముస్లింలకు వ్యతిరేకం కాదని చెప్పారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ హిందువుల ఆస్తులను మాత్రం ముస్లింలకు పంచుతోంది అంటూ ఆరోపించారు. అయితే, ముస్లింలు తెలివైన వారని, కాంగ్రెస్‌ చెప్పే అబద్ధాలను వారు నమ్మే పరిస్థితులు లేవని, ఇదే ఇప్పుడు కాంగ్రెస్‌కు ఓ ప్రధాన సమస్యగా మారిందన్నారు. ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు. ఆయన ఈ సందర్భంగా pm modi{#}pragathi;Ishtam;Narendra Modi;Prime Minister;Bharatiya Janata Party;media;Loksabha;war;Congress;Party;Electionsముస్లింలకు మోదీ వ్యతిరేకమైతే అలా మాట్లాడుతారా?ముస్లింలకు మోదీ వ్యతిరేకమైతే అలా మాట్లాడుతారా?pm modi{#}pragathi;Ishtam;Narendra Modi;Prime Minister;Bharatiya Janata Party;media;Loksabha;war;Congress;Party;ElectionsWed, 08 May 2024 12:33:00 GMTదేశంలో ఎన్నికలు సమీపిస్తున్నవేళ విపక్షాలు తమ ప్రచారాలను వేగవంతం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రధాని మోడీ మాట్లాడుతూ... తాను అస్సలు ఇస్లాంకు, ముస్లింలకు వ్యతిరేకం కాదని చెప్పారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ హిందువుల ఆస్తులను మాత్రం ముస్లింలకు పంచుతోంది అంటూ ఆరోపించారు. అయితే, ముస్లింలు తెలివైన వారని, కాంగ్రెస్‌ చెప్పే అబద్ధాలను వారు నమ్మే పరిస్థితులు లేవని, ఇదే ఇప్పుడు కాంగ్రెస్‌కు ఓ ప్రధాన సమస్యగా మారిందన్నారు. ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ... "ముస్లిం సమాజం ఆలోచించాలి. దేశం ప్రగతి పథంలో దూసుకుపోతోంది. మీ వద్ద ఏమైనా పొరపాట్లు, పరిమితులు ఉన్నాయని భావిస్తే దానికి కారణాలేమిటో తక్షణమే గుర్తించాలి!" అని మోదీ పేర్కొన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ... ముస్లింలు తమ భవిష్యత్తు గురించి, తమ పిల్లల గురించి తప్పనిసరిగా ఆలోచించుకోవాలని అని సూచించారు. ఇంకా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బిజెపి-కాంగ్రెస్‌ మధ్య కొనసాగుతున్న రాజకీయ యుద్ధం మధ్య, మతపరమైన విభజనలను ఉపయోగించుకునేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాల పట్ల హెచ్చరించారు. అదేవిధంగా దేశ ప్రగతిలో ముస్లిం సమాజం తమ పాత్రను ప్రతిబింబించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఈ వేదికగా పిలుపు నిచ్చారు. "ముస్లిం 'సమాజ్' (కమ్యూనిటీ) మరియు వారి విద్యావంతులైన వర్గానికి నేను మొదటిసారిగా చెబుతున్నది ఒకటే... "దయచేసి ఆత్మపరిశీలన చేసుకోండి. దేశం ముందుకు సాగుతోంది, కానీ మీ సంఘం ఏదో తప్పిపోయినట్లు ఎందుకు భావిస్తోంది?" అంటూ ప్రశ్నించారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ... ఎవరైనాసరే భయాందోళనతో కూడిన వాతావరణాన్ని సృష్టిస్తున్నందున ఏ సమాజమూ కట్టుబానిస జీవితాన్ని గడపడం నాకు ససేమిరా ఇష్టం ఉండదు. "యే ఆప్కే(ముసల్మాన్) మన్ మే జో హై కి సత్తా పర్ హమ్ బైతాయేంగే, హమ్ ఉతారేంగే" అంటూ మోదీజీ ముస్లింలపై తన హృదయాంతరంలో ఉన్న ప్రేమను చాటుకున్నారు. ఎన్నికల ప్రయోజనాల కోసం హిందూ-ముస్లిం మధ్య విభేదాలను సృష్టించేందుకు ప్రయత్నించడం ద్వారా కాంగ్రెస్ నిప్పుతో ఆడుకుంటోందని బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో మోదీ నుంచి ఈ నిష్కపటమైన వ్యాఖ్యలు రావడం కొసమెరుపు. ముస్లిం కమ్యూనిటీకి చేరువయ్యేందుకు మోదీ చేస్తున్న ప్రయత్నాన్ని సోషల్ మీడియా వినియోగదారులు అయితే కొనియాడారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>