PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tuni-yanamala-divya-dadishetty-raja-yanamala-ramakrishnudu-ycp-tdp1ad7a7a0-b15c-4bee-8a05-2984b168d928-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tuni-yanamala-divya-dadishetty-raja-yanamala-ramakrishnudu-ycp-tdp1ad7a7a0-b15c-4bee-8a05-2984b168d928-415x250-IndiaHerald.jpgకాకినాడ లోక్ సభ స్థానంలో ఉండేటువంటి నియోజకవర్గాలలో తుని నియోజకవర్గం చాలా కీలకంగా ఉంటుంది. ఇక్కడి ప్రజలు ఎప్పుడైనా సరే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఏకపక్షంగా పార్టీలను గెలిపిస్తూ ఉంటారు. ఇలాంటి తుని నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో 1952 నుంచి 1978 వరకు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 1983 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి 2014, 19 లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం 15 సార్లు ఎన్నికలు జరగగా.. వెంకట కృష్ణంరాజు, రాజా అశోక్ బాబు, విజయలకTUNI;YANAMALA DIVYA;DADISHETTY RAJA;YANAMALA RAMAKRISHNUDU;YCP;TDP{#}krishnudu;DADISETTI RAJA;Yanamala Ramakrishnudu;Tuni;Divya Bhatnagar;raja;Telugu Desam Party;Yevaru;Father;Scheduled caste;Backward Classes;YCP;Jagan;TDP;MLA;Minister;Elections;Congressయాదవాంధ్రప్రదేశ్: తునిలో మంత్రిని ఢీకొట్టబోతున్న కొత్త అభ్యర్థి.. పై చేయి ఎవరిదంటే..?యాదవాంధ్రప్రదేశ్: తునిలో మంత్రిని ఢీకొట్టబోతున్న కొత్త అభ్యర్థి.. పై చేయి ఎవరిదంటే..?TUNI;YANAMALA DIVYA;DADISHETTY RAJA;YANAMALA RAMAKRISHNUDU;YCP;TDP{#}krishnudu;DADISETTI RAJA;Yanamala Ramakrishnudu;Tuni;Divya Bhatnagar;raja;Telugu Desam Party;Yevaru;Father;Scheduled caste;Backward Classes;YCP;Jagan;TDP;MLA;Minister;Elections;CongressWed, 08 May 2024 08:54:34 GMT•ప్రభుత్వ వ్యతిరేకత దివ్యకు కలిసొస్తుందా..
•బీసీ ఓట్లు ఏ వైపు..
•దాడిశెట్టి రాజా హ్యాట్రిక్ కష్టమేనా.?



కాకినాడ లోక్ సభ స్థానంలో ఉండేటువంటి నియోజకవర్గాలలో తుని నియోజకవర్గం చాలా కీలకంగా ఉంటుంది. ఇక్కడి ప్రజలు ఎప్పుడైనా సరే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఏకపక్షంగా పార్టీలను గెలిపిస్తూ ఉంటారు. ఇలాంటి తుని నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో  1952 నుంచి 1978 వరకు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 1983 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి 2014, 19 లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం 15 సార్లు ఎన్నికలు జరగగా.. వెంకట కృష్ణంరాజు, రాజా అశోక్ బాబు, విజయలక్ష్మి, యనమల రామకృష్ణుడు, దాడిశెట్టి రాజా  ఇలా అయిదుగురు మాత్రమే గెలుపొందారు. ఇందులో అత్యధికంగా యనమల రామకృష్ణుడు విజయం సాధించాడు. గత రెండు పర్యాయాల నుంచి దాడిశెట్టి రాజా నియోజకవర్గాన్ని ఏలుతున్నాడు. ఈసారి కూడా ఆయన గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ తరుణంలో తుని నుంచి రామకృష్ణుడు కూతురు దివ్యను టిడిపి నుంచి బరిలో ఉంచారు. దీంతో అక్కడ రసవత్తరమైన పోరు సాగుతోంది. ఇందులో ఎవరు గెలుస్తారు అనే వివరాలు చూద్దాం.
 
 రాజా వర్సెస్ దివ్య:
 వైసిపి అభ్యర్థి సిట్టింగ్ మంత్రి దాడిశెట్టి రాజా..ఈయన కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు. నగల వ్యాపారం చేయడంలో వీరి కుటుంబం సిద్ధహస్తులు. రాజా 2014, 2019లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి జగన్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు.  టిడిపి అభ్యర్థి యనమల దివ్య విషయానికి వస్తే.. యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత.  యనమల రామకృష్ణుడు కుమార్తె. తన తండ్రి రాజకీయ నేపథ్యం ఈమెకి కలిసొచ్చే అంశం.  ఈ నియోజకవర్గంలో మొత్తం 2,22,000 ఓట్లు ఉన్నాయి. ఇందులో 1,11,000 పురుషులు ఉండగా, 1,10,000 మహిళలు ఉన్నారు. సామాజిక వర్గాల విషయానికి వస్తే..కాపు సామాజిక వర్గం నేతలు 35%, బిసి 30%,  ఎస్సీ 25,  మైనారిటీ 10 % ఉన్నారు.
 దాడిశెట్టి రాజా
 బలాలు:
వైసిపి అందించిన పథకాలు.
 నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి.
 బలహీనతలు:
పెరిగిన రైతాంగ సమస్యలు.
సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి వ్యతిరేకత.

 దివ్య
బలాలు:

మహిళా ఓట్లు, బీసీ ఓట్లు..
ప్రభుత్వ వ్యతిరేకత కలిసి రావడం.
తండ్రి చేసిన అభివృద్ధి.
బలహీనతలు:
యనమల కృష్ణుడు సపోర్ట్ చేయకపోవడం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>