PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganb5d0cc86-adea-456e-83ac-c6f511a18ded-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganb5d0cc86-adea-456e-83ac-c6f511a18ded-415x250-IndiaHerald.jpgగత ఐదేళ్లలో జగన్ పై ఎప్పుడూ విమర్శలు చేయని మోదీ ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ జగన్ పాలనలో అవినీతి జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు పవన్, చంద్రబాబు మోదీ పాలనపై, మోదీపై ఏ స్థాయిలో విమర్శలు చేశారో ఆయన మరిచారా? అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ ఏనాడూ మోదీని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేయలేదు. jagan{#}polavaram;Polavaram Project;Nijam;Government;Hanu Raghavapudi;Narendra Modi;Bharatiya Janata Party;Andhra Pradesh;Jagan;CBN;TDPజగన్ ప్రశ్నలకు మోదీ జవాబులు చెప్పగలరా.. విమర్శించిన వాళ్లే మంచోళ్లయ్యారా?జగన్ ప్రశ్నలకు మోదీ జవాబులు చెప్పగలరా.. విమర్శించిన వాళ్లే మంచోళ్లయ్యారా?jagan{#}polavaram;Polavaram Project;Nijam;Government;Hanu Raghavapudi;Narendra Modi;Bharatiya Janata Party;Andhra Pradesh;Jagan;CBN;TDPWed, 08 May 2024 13:25:00 GMTగత ఐదేళ్లలో జగన్ పై ఎప్పుడూ విమర్శలు చేయని మోదీ ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ జగన్ పాలనలో అవినీతి జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు పవన్, చంద్రబాబు మోదీ పాలనపై, మోదీపై ఏ స్థాయిలో విమర్శలు చేశారో ఆయన మరిచారా? అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ ఏనాడూ మోదీని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేయలేదు.
 
మోదీ ప్రభుత్వానికి అవసరమైన ప్రతి సందర్భంలో ఆ సర్కార్ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలకు మంచి జరుగుతుందంటే జగన్ సపోర్ట్ చేశారు. అయితే తనపై విమర్శలు చేసిన నేపథ్యంలో జగన్ కొన్ని ప్రశ్నలు సంధిస్తుండగా ఆ ప్రశ్నలకు మోదీ లేదా కూటమి నేతలు సమాధానం చెబుతారేమో చూడాల్సి ఉంది. జగన్ అడిగిన ప్రశ్నలకు కూటమి నేతల దగ్గర జవాబులు లేవని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.
 
2018లో బీజేపీ నుంచి టీడీపీ వైదొలగిన తర్వాత మోదీ చంద్రబాబు మోసగాడని పోలవరం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడని, ఏపీ అభివృద్ధి కోసం ఏం చేయలేదని అన్నారు. అప్పుడు బాబు కరెక్ట్ కాదని చెప్పిన మోదీకి  ఇప్పుడు బాబు నీతిమంతుడు ఎలా అయ్యారని జగన్ అడుగుతున్నారు. ఎన్డీయేకు ఓటేస్తే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ఒప్పుకున్నట్లే అని జగన్ కామెంట్లు చేశారు.
 
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తమ ప్రభుత్వం అడ్డు పడుతోందని కూటమి గెలిస్తే స్టీల్ ప్లాంట్ ను కోల్పోవాల్సి వస్తుందని జగన్ వెల్లడిస్తున్నారు. ఆయన చేసిన కామెంట్లలో నిజం లేదని చెప్పే దమ్ము, ధైర్యం కూటమి నేతలకు ఉందా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మోదీ మోసగాడు అని విమర్శలు చేసిన బాబును ఇప్పుడు రాష్ట్రంలో గెలిపించాల్సిన ఆవసరం ఏముందనే ప్రశ్నల గురించి బీజేపీ నేతలు నోరు మెదుపుతారేమో చూడాల్సి ఉంది. జగన్ మాత్రం ఒకింత ఘాటుగానే బాబుకు షాకిచ్చేలా విమర్శలు చేశారు. అప్పుడు మోదీ విమర్శించిన వాళ్లే ఇప్పుడు మంచోళ్లు అయ్యారా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>