PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bode-is-a-lightning-turning-point-for-yadavs2649157a-9957-48d9-92d5-06e91b24ac8e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bode-is-a-lightning-turning-point-for-yadavs2649157a-9957-48d9-92d5-06e91b24ac8e-415x250-IndiaHerald.jpg- యాద‌వుల ఐక్య‌త‌, రాజ్యాధికారం కోసం అలుపెర‌గ‌ని పోరాటం - పుంగ‌నూరులో పెద్దిరెడ్డిని ఢీ కొట్టి నిలిచిన గట్స్ ఉన్న లీడ‌ర్‌ - యాద‌వుల్లో యూత్ ఐకాన్‌గా త‌క్కువ టైంలోనే పాపులారిటీ ( చిత్తూరు - ఇండియా హెరాల్డ్ ) స‌మాజంలో అనేక సామాజిక‌వ‌ర్గాలు ఉన్నాయి. ఏపీలో అయితే బీసీలే ఎక్కువ‌. బీసీల‌లో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాలుగా ఉన్న యాద‌వులు రాజ్యాధికారానికి ఎప్పుడూ దూరంగానే ఉన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో యాద‌వులు బాగానే పుంజుకున్నా.. ఏపీ విష‌యానికి వ‌స్తే. మాత్రం కేవ‌లం ఎమ్మెల్యేలుగానే అది కూడా కొంద‌రే మిగిలిపోAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; Yadavs; Bode ; bode Ramachandra Yadav; tdp; ycp{#}Chittoor;Telugu;Hanu Raghavapudi;Andhra Pradesh;police;India;Partyబోడే ఒక మెరుపు... యాద‌వుల‌కు మ‌లుపు...!బోడే ఒక మెరుపు... యాద‌వుల‌కు మ‌లుపు...!AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; Yadavs; Bode ; bode Ramachandra Yadav; tdp; ycp{#}Chittoor;Telugu;Hanu Raghavapudi;Andhra Pradesh;police;India;PartyWed, 08 May 2024 10:50:00 GMT- యాద‌వుల ఐక్య‌త‌, రాజ్యాధికారం కోసం అలుపెర‌గ‌ని పోరాటం
- పుంగ‌నూరులో పెద్దిరెడ్డిని ఢీ కొట్టి నిలిచిన గట్స్ ఉన్న లీడ‌ర్‌
- యాద‌వుల్లో యూత్ ఐకాన్‌గా త‌క్కువ టైంలోనే పాపులారిటీ

( చిత్తూరు - ఇండియా హెరాల్డ్ )

స‌మాజంలో అనేక సామాజిక‌వ‌ర్గాలు ఉన్నాయి. ఏపీలో అయితే బీసీలే ఎక్కువ‌. బీసీల‌లో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాలుగా ఉన్న యాద‌వులు రాజ్యాధికారానికి ఎప్పుడూ దూరంగానే ఉన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో యాద‌వులు బాగానే పుంజుకున్నా.. ఏపీ విష‌యానికి వ‌స్తే. మాత్రం కేవ‌లం ఎమ్మెల్యేలుగానే అది కూడా కొంద‌రే మిగిలిపోతున్నారు. ఈ ప‌రిణామాల‌తో యాద‌వుల‌కు రాజ్యాధికారం ద‌క్క‌డం క‌ల్లే అనే మాట త‌ర‌చుగా వినిపిస్తూ ఉంటుంది. రాజ‌కీయాల్లోకి వ‌చ్చే నాయ‌కుల అంతిమ ల‌క్ష్యం రాజ్యాధికారం. ఈ క్ర‌మంలో యాద‌వులు ఎందుకు దూర‌మ‌య్యారు? అనేది కీల‌క ప్ర‌శ్న‌.


నిజానికి యాదవుల‌కు రాజ‌కీయంగా గుర్తింపు.. రాజ్యాధికారం దిశ‌గా అడుగులు వేసేందుకు ప‌లువురు నాయ‌కులు గతంలోనూ ఇప్పుడు కూడా కృషి చేశారు. ఇలాంటివారిలో జంగా కృష్ణ‌మూర్తి యాద‌వ్ ఒక‌రు. అయితే.. ఈయ‌న కొంత వ‌ర‌కు కృషి చేసినా.. ధైర్యంగా.. సాహ‌సోపేతంగా అయితే.. ముందుకు సాగ‌లేక పోయారు. ఒక వ్య‌క్తికో.. ఒక పార్టీకో.. ఆయ‌న ప‌రిమిత‌మ‌య్యారు. వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న‌కు ఇమేజ్ ఉండ‌డం గొప్ప‌కాక‌పోయినా.. యాద‌వ సామాజిక వ‌ర్గాన్ని రాజ్యాధికారం దిశ‌గా అడుగులు వేయించ‌డంలో మాత్రం విఫ‌ల‌మ‌య్యార‌నే చెప్పాలి.


ఈ క్ర‌మంతో 2019 ఎన్నిక‌ల‌కు ముందు అరంగేట్రం చేసిన బోడే రామ‌చంద్ర‌యాద‌వ్‌.. అత్యంత వేగంగా యాద‌వ సామాజిక వ‌ర్గం మేలు కోసం కృషి చేశార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. తొలుత ఈయ‌న కూడా.. జ‌న‌సేన నుంచి పోటీ చేసినా.. ఓడిపోయినా.. త‌ర్వాత‌.. ధైర్యంగా ముందుకు వ‌చ్చారు. సాహసోపే త నిర్ణ‌యాలు తీసుకున్నారు. యాద‌వుల ఐక్య‌త‌.. రాజ్యాధికారం.. వారికి గుర్తింపు కోసం.. అలుపెరుగ‌ని కృషి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌ట‌న‌లు చేసి.. యాదవుల‌ను ఐక్యం చేసే ప‌నికి శ్రీకారం చుట్టారు.


అంతేకాదు.. సొంత‌గా పార్టీ పెట్టుకున్నారు. భార‌త చైత‌న్య యాద‌వ‌ పార్టీ అని పెట్టుకున్నా.. త‌ర్వాత కాలంలో అంద‌రికీ చేరువ కావాలంటే ఉద్దేశంతో దీని పేరును భార‌త చైత‌న్య యువ‌జ‌న‌ పార్టీగా మార్చు కున్నారు. అనంత‌రం.. త‌నే స్వ‌యంగా పుంగ‌నూరు వంటి కీల‌క నియోజ‌క‌వర్గం నుంచి పోటీ చేయ‌డంతో పాటు.. ఆ వ‌ర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకునే విధంగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్న తీరున భూతో అనే చెప్పాలి. ముఖ్యంగా యాద‌వుల‌పై కులాధిప‌త్యం చేస్తున్న రెడ్లు, క‌మ్మ‌ల‌కు వ్య‌తిరేకంగా ఆయ‌న పోరు సాగించారు.


ఈ క్ర‌మంలో ఎదురైన అనేక స‌వాళ్ల‌ను ఆయ‌న ఎదుర్కొన్నారు. పోలీసులు కేసులు నిర్బంధాలను.. కూడా త‌ట్టుకుని యాద‌వ సామాజిక వ‌ర్గానికి రాజ్యాధికారం ద‌క్కాల‌న్న ఏకైక ల‌క్ష్యంతో బోడే ముందుకు సాగుతు న్నారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో కీల‌క రోల్ పోషిస్తున్నారు. యాద‌వుల కొర‌కు-యాద‌వుల చేత అన్న‌ట్టుగా బోడే సాగిస్తున్న ఈ రాజ‌కీయ యుద్ధంలో ఆయ‌న విజ‌యం దక్కించుకుంటే తెలుగు గ‌డ్డ‌పై అది ఓ సెన్షేష‌న‌ల్ విక్ట‌రీ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>