Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ticket082d498c-a6d2-4f68-9563-29a7130da1e4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ticket082d498c-a6d2-4f68-9563-29a7130da1e4-415x250-IndiaHerald.jpgమేము ఈసారి మెజారిటీ స్థానాలలో విజయం సాధించబోతున్నాం. లేదు మా పార్టీకే ఈసారి భారీ విజయం ఖాయం.. అంటూ ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో అన్ని పార్టీలు చెప్పుకుంటున్నాయ్. ఇక ఓటర్లు ఎవరికి విజయాన్ని కట్టబెట్టబోతున్నారు అన్నది మాత్రం మే 13వ తేదీన తెలియబోతుంది. అయితే అంతకుముందే ఇక ఓటరు మహాశయులను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు కూడా ప్రచార రంగంలో దూసుకుపోతున్నారు అని చెప్పాలి. అయితే తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉండగా.. ఒక్క పార్లమెంట్ స్థానం విజయంపTicket{#}Santosham;MIM Party;srinivas;MLA;Parliment;Hyderabad;Telangana;Elections;Congress;Assembly;Father;Partyపాపం.. ఆ యాదవ నేతకు టికెట్ అయితే వచ్చింది.. కానీ గెలుపే?పాపం.. ఆ యాదవ నేతకు టికెట్ అయితే వచ్చింది.. కానీ గెలుపే?Ticket{#}Santosham;MIM Party;srinivas;MLA;Parliment;Hyderabad;Telangana;Elections;Congress;Assembly;Father;PartyWed, 08 May 2024 10:29:00 GMTమేము ఈసారి మెజారిటీ స్థానాలలో విజయం సాధించబోతున్నాం. లేదు మా పార్టీకే ఈసారి భారీ విజయం ఖాయం.. అంటూ ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో అన్ని పార్టీలు చెప్పుకుంటున్నాయ్. ఇక ఓటర్లు ఎవరికి విజయాన్ని కట్టబెట్టబోతున్నారు అన్నది మాత్రం మే 13వ తేదీన తెలియబోతుంది. అయితే అంతకుముందే ఇక ఓటరు మహాశయులను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు కూడా ప్రచార రంగంలో దూసుకుపోతున్నారు అని చెప్పాలి.


 అయితే తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉండగా.. ఒక్క పార్లమెంట్ స్థానం విజయంపై మాత్రం అందరూ దృష్టి ఉంది. అది హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం. అయితే ఈ పార్లమెంట్ సెగ్మెంట్ ఏర్పడిన నాటి నుంచి ఇక్కడ మజిలీస్ పార్టీ విజయం సాధిస్తూ వస్తుంది. ఇక ఎంతోమంది రాజకీయ ఉద్దండులు ఇక్కడి నుంచి పోటీ చేసిన విజయం సాధించిన దాఖలాలు లేవు. ఇక ఇప్పుడు ఓటమి ఎరుగని పార్టీగా దూసుకుపోతున్న మజిలీస్ పార్టీని ఎదుర్కొనేందుకు బిఆర్ఎస్ నుంచి బరిలోకి దిగారు యాదవ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈయన కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ లో చేరారు.


 ఆ తర్వాత వివిధ హోదాల్లో పనిచేశారు. తన తండ్రి గడ్డం గంగాధర్ యాదవ్ పేరిట ఫౌండేషన్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నుండి టికెట్ ఆశించారు గడ్డం శ్రీనివాస్ యాదవ్. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ప్రత్యర్థిగా ఈయనకు గుర్తింపు ఉంది. ఎందుకంటే ఆయనపై పదునైన  విమర్శలు, ఆరోపణలతో ఎన్నోసార్లు వార్తల్లో నిలిచారు  గడ్డం శ్రీనివాస్ యాదవ్. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా గోషామహల్ ఎమ్మెల్యే టికెట్ తనకే వస్తుందని అనుకున్నప్పటికీ అది జరగలేదు. చివరికి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు టికెట్ కేటాయించింది పార్టీ అధిష్టానం. అయితే యాదవ నేతకు టికెట్ రావడంతో ఇక ఆ సామాజిక వర్గం కూడా సంతోషంగానే ఉంది.


 కానీ ఎంఐఎం తప్ప మరో పార్టీ విజయం సాధించని హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో గడ్డం శ్రీనివాస్ యాదవ్కి టికెట్ రావడం దురదృష్టకరమే. ఎందుకంటే అక్కడ ఏ పార్టీ ఎంత ప్రచారం నిర్వహించిన ఎంతల పోటీ ఇచ్చిన గెలుపు మాత్రం అసాధ్యం. అందుకే గడ్డం శ్రీనివాస్ యాదవ్ కు మరోచోట టికెట్ ఇచ్చి ఉంటే గెలిచే  అవకాశాలు ఉండేవేమో. కానీ హైదరాబాద్లో టికెట్ ఇవ్వడం కారణంగా టికెట్ వచ్చింది అనే సంతోషం తప్ప గెలుపు అవకాశాలు తక్కువగా ఉంటాయి అని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారట. అయితే గట్టి పోటీ ఇస్తే అటు యాదవ నేత గడ్డం శ్రీనివాస్ గెలిచే అవకాశాలు కూడా లేకపోలేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>