MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgరాజామౌళి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘ఆర్ ఆర్ ఆర్’ ‘బాహుబలి 2’ రికార్డులను బ్రేక్ చేయలేకపోయినప్పటికీ ఆమూవీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. మరీ ముఖ్యంగా ఈమూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీతో పాటు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రి వర్గాలు కూడ చాల ఆనంద పడ్డాయి. రాజమౌళి ఈమూవీతో పాన్ వరల్డ్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇప్పుడు ఈసినిమాని ఈ ఎన్నికల హడావిడి మధ్య ఈనెల 10వ తారీఖున రీ రిలీజ్ చేయబోతున్నారు. గతంలో ఈమూవీకి ఆస్కార్ అవార్డు వచ్చిన తరువాత ఒRAJAMOULI{#}Ram Charan Teja;krishna;Rajamouli;Tollywood;Telugu;Director;Father;Indian;Oscar;Yevaru;Jr NTR;Cinema;Newsఆర్ ఆర్ ఆర్ సాహసం వెనుక ఆంతర్యం !ఆర్ ఆర్ ఆర్ సాహసం వెనుక ఆంతర్యం !RAJAMOULI{#}Ram Charan Teja;krishna;Rajamouli;Tollywood;Telugu;Director;Father;Indian;Oscar;Yevaru;Jr NTR;Cinema;NewsWed, 08 May 2024 19:00:00 GMTరాజామౌళి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘ఆర్ ఆర్ ఆర్’ ‘బాహుబలి 2’ రికార్డులను బ్రేక్ చేయలేకపోయినప్పటికీ ఆమూవీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. మరీ ముఖ్యంగా ఈమూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీతో పాటు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రి వర్గాలు కూడ చాల ఆనంద పడ్డాయి.



రాజమౌళి ఈమూవీతో పాన్ వరల్డ్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇప్పుడు ఈసినిమాని ఈ ఎన్నికల హడావిడి మధ్య ఈనెల 10వ తారీఖున రీ రిలీజ్ చేయబోతున్నారు. గతంలో ఈమూవీకి ఆస్కార్ అవార్డు వచ్చిన తరువాత ఒకసారి రీ రిలీజ్ చేశారు. అయితే అప్పట్లో ఈ రీ రిలీజ్ ను పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ఈమూవీని ఈనెల 10వ తారీఖున రీ రిలీజ్ చేస్తూ ఉండటం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.



ఎన్నికల సందడి మధ్య ఈ సినిమా రీ రిలీజ్ ను జనం ఎంతవరకు మళ్ళీ గుర్తుంచుకుంటారు అన్నసందేహాలు కొందరిలో ఉన్నాయి. వాస్తవానికి జనం మహేష్ రాజమౌళీ ల మూవీకి సంబంధించిన అప్ డేట్స్ గురించి ఎదురు చూస్తూ ఉంటే ఆసినిమా విషయాల గురించి అధికారికంగా రాజమౌళి నోరు విప్పడం లేదు. తెలుస్తున్న సమాచారం  మేరకు మహేష్ రాజమౌళిల క్రేజీ మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఒక చిన్న టీజర్ ను మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజునాడు విడుదల చేస్తారు అని అంటున్నారు.



ఇలాంటి పరిస్థితులలో ఈ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి కనీసపు కలక్షన్స్ అయినా వస్తాయా అన్నసందేహాలు ఉన్నాయి. ఇండస్ట్రిలో రీ రిలీజ్ అవుతున్న ఒకనాటి సినిమాలలో చాలమటుకు ఫెయిల్ అవుతున్నాయి. దీనితో ఈమూవీ రీ రిలీజ్ కు మంచి స్పందన రాకపోతే ‘ఆర్ ఆర్ ఆర్’ పై ఇప్పటివరకు ఉన్న క్రేజ్ తగ్గిపోయే ఆస్కారం ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి..











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>