PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/congress-telangana-cm-revanth-batti-gadida-guddu-bjp4be6c2ea-8585-48ad-8a63-1552af63e2fe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/congress-telangana-cm-revanth-batti-gadida-guddu-bjp4be6c2ea-8585-48ad-8a63-1552af63e2fe-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలంగాణలో ఏం నడుస్తుందయ్యా అంటే చాలామంది ఎంపీ ఎలక్షన్స్ సంబంధించి పార్టీల ప్రచారం నడుస్తుంది అంటారు. ఇది కరెక్టే కానీ ఎలక్షన్స్ సమయంలోనే మరో విషయం కూడా విపరీతంగా వైరల్ అవుతుంది. అంతేకాదు ప్రతి సభలో ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అదేంటంటే గాడిద గుడ్డు..అవును కాంగ్రెస్ ఏ ప్రచార సభలో అయినా గాడిద గుడ్డు గురించే మాట్లాడుతూ ప్రజలందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. దీంతో చాలామంది ప్రజలు ప్రచారంలో ఈ గాడిద గుడ్డు గోలేంట్రా అని అనుకుంటున్నారు. కొంతమంది ఈ గాడిద గుడ్డు సింబల్ చూసి నవ్వుకుంటూ ఉంటే congress;telangana;cm revanth;batti;gadida guddu ;bjp{#}Egg;Parliment;Telangana;MP;Election;Congress;Government;Bharatiya Janata Partyతెలంగాణ:గాడిద గుడ్డు పాలిటిక్స్ తో ప్రజల్ని గుడ్డివాళ్లను చేస్తున్నారా.?తెలంగాణ:గాడిద గుడ్డు పాలిటిక్స్ తో ప్రజల్ని గుడ్డివాళ్లను చేస్తున్నారా.?congress;telangana;cm revanth;batti;gadida guddu ;bjp{#}Egg;Parliment;Telangana;MP;Election;Congress;Government;Bharatiya Janata PartyWed, 08 May 2024 10:15:47 GMT ప్రస్తుతం తెలంగాణలో ఏం నడుస్తుందయ్యా అంటే  చాలామంది ఎంపీ ఎలక్షన్స్ సంబంధించి పార్టీల ప్రచారం నడుస్తుంది అంటారు. ఇది కరెక్టే కానీ  ఎలక్షన్స్ సమయంలోనే  మరో విషయం కూడా విపరీతంగా వైరల్ అవుతుంది. అంతేకాదు  ప్రతి సభలో ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అదేంటంటే గాడిద గుడ్డు..అవును కాంగ్రెస్ ఏ ప్రచార సభలో అయినా గాడిద గుడ్డు గురించే మాట్లాడుతూ ప్రజలందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. దీంతో చాలామంది ప్రజలు ప్రచారంలో ఈ గాడిద గుడ్డు గోలేంట్రా అని అనుకుంటున్నారు.  కొంతమంది ఈ గాడిద గుడ్డు సింబల్ చూసి నవ్వుకుంటూ ఉంటే మరి కొంతమంది రాజకీయ విశ్లేషకులేమో  గాడిద గుడ్డు పేరుతో ప్రజల నోళ్లను కట్టివేసి, గుడ్డివాళ్లను చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఆ గాడిద గుడ్డు రాజకీయం ఎందుకు చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. 

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఐదు నెలలు అవుతోంది. ఇదే తరుణంలో వారు చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలలో  కొన్ని గ్యారెంటీలు అమలవుతున్నాయి. అంతేకాకుండా మరికొన్ని పథకాలు కూడా అమలు చేస్తానని, ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే పూర్తిస్థాయిలో ప్రజలకు అన్ని పథకాలు అందుబాటులోకి వస్తాయని చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ వంద రోజులు గడిచినా ఇంకా చాలా హామీలు అలాగే ఉన్నాయి. ఇదే తరుణంలో ప్రతిపక్ష పార్టీలన్నీ విమర్శిస్తూ వస్తున్నాయి. దీంతో ప్రజల్లో కూడా కాస్త నైరాశ్యం నెలకొన్నదని కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్టుంది. ఇది పార్లమెంట్ ఎలక్షన్స్ పై ప్రభావం చూపేలా ఉందని ముందుగానే గ్రహించిన కాంగ్రెస్ అధినాయకత్వం  ఒక గొప్ప ఆలోచన చేసి ప్రజల ఆలోచనలను మరో దారి పట్టిస్తోంది.

 ముఖ్యంగా గాడిద గుడ్డు అనే పేరుతో ప్రతి సభలో గుడ్డు సింబల్ కు, గాడిద గుడ్డని రాసిపెట్టి చూపిస్తోంది. అసలు గాడిద గుడ్డే పెట్టదు కదా.. మరి గాడిద గుడ్డు ఏంటని కొంతమంది ప్రశ్నిస్తే  గాడిద గుడ్డు అంటే బీజేపీ అని , రాష్ట్రానికి బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డే అని  కాంగ్రెస్ అగ్ర నేతలు ఆరోపిస్తున్నారు. అయితే వారు మొదలు పెట్టిన గాడిద గుడ్డు రాజకీయం  వారికే రివర్స్ అవుతోందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వంద రోజుల్లో వీరు అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పారు.  కానీ అమలు మరిచి తెలంగాణ ప్రజలకు గాడిద గుడ్డు చూపిస్తున్నారు అంటూ రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను ప్రశ్నించకుండా ఈ గాడిద గుడ్డుతో ప్రజలను కాస్త ట్రాక్ తప్పిస్తూ కాలయాపన చేస్తున్నారని కొంతమంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట... ఏది ఏమైనా వారు మొదలుపెట్టిన గాడిద గుడ్డు రాజకీయం  వారికే రివర్స్ పంచ్ లా మారిందని చెప్పవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>