EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcr5a1c2fe0-53cc-4dfa-831a-2e8d046a2b92-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcr5a1c2fe0-53cc-4dfa-831a-2e8d046a2b92-415x250-IndiaHerald.jpgఎన్నికల ప్రచారంలో ఉన్న కేసీఆర్‌.. కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపిస్తే అరాచకాలు చేస్తారని ప్రజలను హెచ్చరిస్తున్నారు. BRS హయాంలో ఉన్న స్కీములు అమలు కావడం లేదన్న కేసీఆర్‌.. సీఎం రేవంత్ మెదక్ జిల్లాని తీసేసెటట్టు ఉన్నారని అన్నారు. మెదక్ జిల్లా ఉండాలంటే BRS ఎంపీ అభ్యర్థి గెలవాలని.. తాను మెదక్ జిల్లా వాడినే కాబట్టి ఈ జిల్లాని అభివృద్ధి చేసుకున్నామని కేసీఆర్‌ నిన్నటి ప్రచారంలో అన్నారు. 100 పడకల ఆస్పత్రి మెదక్ కి ఇస్తే దానిని 50 పడకలకు కుదించింది కాంగ్రెస్ పార్టీయేనని కేసీఆర్‌ గుర్తు చేశారు. ఏడు పాయల కోసం 1kcr{#}Krishna River;Medak;Tamilnadu;Godavari River;Telangana;CM;Prime Minister;MP;District;Assembly;Congress;Bharatiya Janata Partyకాంగ్రెస్‌ను గెలిపిస్తే అవి తీసేస్తారు.. బెదిరిస్తున్న కేసీఆర్‌కాంగ్రెస్‌ను గెలిపిస్తే అవి తీసేస్తారు.. బెదిరిస్తున్న కేసీఆర్‌kcr{#}Krishna River;Medak;Tamilnadu;Godavari River;Telangana;CM;Prime Minister;MP;District;Assembly;Congress;Bharatiya Janata PartyWed, 08 May 2024 09:01:00 GMTఎన్నికల ప్రచారంలో ఉన్న కేసీఆర్‌.. కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపిస్తే అరాచకాలు చేస్తారని ప్రజలను హెచ్చరిస్తున్నారు. BRS హయాంలో ఉన్న స్కీములు అమలు కావడం లేదన్న కేసీఆర్‌.. సీఎం రేవంత్ మెదక్ జిల్లాని తీసేసెటట్టు ఉన్నారని అన్నారు. మెదక్ జిల్లా ఉండాలంటే BRS ఎంపీ అభ్యర్థి గెలవాలని.. తాను మెదక్ జిల్లా వాడినే కాబట్టి ఈ జిల్లాని అభివృద్ధి చేసుకున్నామని కేసీఆర్‌ నిన్నటి ప్రచారంలో అన్నారు.


100 పడకల ఆస్పత్రి మెదక్ కి ఇస్తే దానిని 50 పడకలకు కుదించింది కాంగ్రెస్ పార్టీయేనని కేసీఆర్‌ గుర్తు చేశారు. ఏడు పాయల కోసం 100 కోట్లు ఇస్తే వెనక్కి తీసుకువెళ్లిపోయారని.. పాత ప్రభుత్వంలో ఇచ్చిన మంజూరులన్ని ఆపేశారని.. ప్రధాని మోడీ పదేళ్ల కింద అధికారంలోకి వచ్చి 150 హామీలు ఇచ్చారని.. సబ్ కా సాత్ సబ్ కా వికాస్, 15 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పారు.. మోడీ హయాంలో జరిగిందా అని కేసీఆర్‌ ప్రశ్నించారు.


కాంగ్రెస్ ఇస్తానన్న 4 వేల పెన్షన్ వచ్చిందా..నిరుద్యోగ భృతి వచ్చిందా అని కేసీఆర్‌ ప్రశ్నించారు. మోడీ గోదావరి నదిని తమిళనాడు కి అప్పచెబ్బుతాను అంటున్నారని.. కృష్ణా నదిని KRMB కి అప్పచెప్పారని.. తొమ్మిది ఏళ్లపాటు నేను ఒక్క నిమిషం కరెంట్ పోకుండా ఇస్తే వీళ్లకు చేత కావడం లేదని కేసీఆర్‌ విమర్శించారు. మంచినీళ్లు కూడా సరిగా రావడం లేదన్న కేసీఆర్‌.. అన్నిరకాలుగా కాంగ్రెస్ పార్టీ రైతులకు శాపంగా మారిందన్నారు.


ఎన్నికల సమయంలో ఆగమాగం జగన్నాథం కావద్దన్న కేసీఆర్‌.. గోదావరి మాయమైతే మన రాష్ట్ర గతి ఏం కావాలని ప్రశ్నించారు. గోదావరి కర్ణాటక, తమిళనాడు కి తరలిపోతే మన పరిస్థితి ఏంటి...? తెలంగాణ ఉద్యమంలో నన్ను మీరు అందరూ దీవించారు.. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు నమ్మి ఓటేశారు.. మళ్ళీ తెలంగాణ నిలబడాలంటే BRS గెలవాలి.. బీజేపీ అభ్యర్థి నోటికి ఏదివస్తే అదే మాట్లాడుతారు.. మోడీ ది గ్యాస్... రఘునందన్ ది గ్యాస్.. నేను ఇదే జిల్లా బిడ్డను..మీ కోసం ఏం చేశానో మీకు తెలుసని కేసీఆర్‌ అన్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>