PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cm-jagan3831f8c3-4498-4126-a982-a1407997dffa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cm-jagan3831f8c3-4498-4126-a982-a1407997dffa-415x250-IndiaHerald.jpgఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ గడువు ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలి వుంది. వచ్చే సోమవారం రాష్ట్రంలో గల 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎలక్షన్ జరుగనుంది. దాంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు. దాంతో శనివారం సాయంత్రానికి ఎన్నికల ప్రచారానికి తెరపడుతుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేశాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవనcm jagan{#}Srikakulam;Ananthapuram;Y. S. Rajasekhara Reddy;Master;Saturday;monday;Pawan Kalyan;Telangana Chief Minister;Wife;Loksabha;Vishakapatnam;Janasena;CBN;Gajuwaka;East;Party;Assembly;June;Jaganఏపీ: పోలింగ్ ముగిసాక జగన్ అమలు చేయబోయే మాస్టర్ ప్లాన్ అదేనా?ఏపీ: పోలింగ్ ముగిసాక జగన్ అమలు చేయబోయే మాస్టర్ ప్లాన్ అదేనా?cm jagan{#}Srikakulam;Ananthapuram;Y. S. Rajasekhara Reddy;Master;Saturday;monday;Pawan Kalyan;Telangana Chief Minister;Wife;Loksabha;Vishakapatnam;Janasena;CBN;Gajuwaka;East;Party;Assembly;June;JaganWed, 08 May 2024 13:00:00 GMTఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ గడువు ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలి వుంది. వచ్చే సోమవారం రాష్ట్రంలో గల 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎలక్షన్ జరుగనుంది. దాంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు. దాంతో శనివారం సాయంత్రానికి ఎన్నికల ప్రచారానికి తెరపడుతుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేశాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ రోడ్ షోలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

ఈ క్రమంలో ఓ విషయం మీడియాలో జోరుగా చక్కెర్లు కొడుతోంది. అధికార పార్టీ వైఎస్ జగన్ ఈసారి మాస్టర్ ప్లాన్ తో ముందుకుపోతున్నాడని దాని సారాంశం. జగన్ ప్రస్తుతం చివరి విడత ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో తీరిక లేకుండా కష్టపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నారు. ఒకే రోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ రోడ్ షోలను నిర్వహిస్తూ వస్తోన్నారు.

మంగ‌ళ‌వారం నాడు తూర్పు గోదావరి రాజాన‌గ‌రం, అదేవిధంగా ఒకవైపు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, మరోవైపు విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజ‌క‌వ‌ర్గాల్లో రోడ్ షోలను దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పాత గాజువాక సెంట‌ర్‌లో బ‌హిరంగ స‌భ‌లో ఆయన ప్ర‌సంగించారు. కాగా నేడు విరామం తీసుకుంటున్నారు. రేపు అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గంలో జగన్ పర్యటిస్తారు. ఇక పోలింగ్ ముగిసిన తరువాత వైఎస్ జగన్.. లండన్‌కు వెళ్లనున్నారు. భార్య వైఎస్ భారతితో కలిసి ఈ నెల 15వ తేదీన లండన్‌కు బయలుదేరి, 30వ తేదీ వరకు అక్కడే ఉంటారు. మరలా జూన్ 1వ తేదీన జగన్ దంపతులు రాష్ట్రానికి తిరిగి వస్తారు. ఈ లోపు తాను అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందని జగన్ తన సన్నిహితులతో చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈసారి కూడా తాను అధికారం చేపట్టబోతున్నట్టు ధీమా వ్యక్తం చేశారట జగన్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>