PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kangana-ranautdb159d69-3f73-478a-b498-902fed5a98a6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kangana-ranautdb159d69-3f73-478a-b498-902fed5a98a6-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ ముద్దుగుమ్మ కంగనా రనౌత్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యంత బీద కుటుంబం నుండి పైకి వచ్చిన ఆమె మోడీ సిద్ధాంతాలు నచ్చి బీజేపీలో చేరిన సంగతి తెలిసినదే. ఈ క్రమంలో ఆమెకి బీజేపీ ఎంపీ అభ్యర్థి స్థానం కల్పించింది. కాగా కంగనా తాజాగా తనదైన శైలిలో మరోసారి మోడీ పాలన గురించి ఆకాశానికెత్తేశారు. విషయం ఏమిటంటే, హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంగనా మండి సెగ్మెంట్‌లోని ఝకారీ ప్రాంతంలో జరిగిన బహిరంగ సభ వేదికగా మోడీపై ప్రశంసలు కురిపించKangana Ranaut{#}Kangana Ranaut;Pakistan;Russia;Ukraine;Fighter;war;Himachal Pradesh;Success;Cinema;bollywood;INTERNATIONAL;Prime Minister;India;Bharatiya Janata Partyమోడీని ఆకాశానికెత్తేసిన కంగనా రనౌత్!మోడీని ఆకాశానికెత్తేసిన కంగనా రనౌత్!Kangana Ranaut{#}Kangana Ranaut;Pakistan;Russia;Ukraine;Fighter;war;Himachal Pradesh;Success;Cinema;bollywood;INTERNATIONAL;Prime Minister;India;Bharatiya Janata PartyWed, 08 May 2024 11:00:00 GMTబాలీవుడ్ ముద్దుగుమ్మ కంగనా రనౌత్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యంత బీద కుటుంబం నుండి పైకి వచ్చిన ఆమె మోడీ సిద్ధాంతాలు నచ్చి బీజేపీలో చేరిన సంగతి తెలిసినదే. ఈ క్రమంలో ఆమెకి బీజేపీ ఎంపీ అభ్యర్థి స్థానం కల్పించింది. కాగా కంగనా తాజాగా తనదైన శైలిలో మరోసారి మోడీ పాలన గురించి ఆకాశానికెత్తేశారు. విషయం ఏమిటంటే, హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంగనా మండి సెగ్మెంట్‌లోని ఝకారీ ప్రాంతంలో జరిగిన బహిరంగ సభ వేదికగా మోడీపై ప్రశంసలు కురిపించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ వల్లే మూడో ప్రపంచ యుద్ధం ఆగిందని చెప్పుకొచ్చారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ... "రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరియు ఉక్రెయిన్ అధికారులతో సహా ప్రపంచ నాయకులు రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య వివాదాన్ని పరిష్కరించడంలో ప్రధాని మోడీ చాలా కీలక పాత్ర పోషించనున్నారు. అలాగే అగ్రశ్రేణి ప్రపంచ నాయకులు సైతం మోడీ వైపు చూస్తున్నారు. ప్రపంచ నాయకులు భారతదేశం నుంచి సహాయం కోరుతున్నాయన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ఈ ఖ్యాతి ఉంది! భారత వైమానిక దళం ఫైటర్ పైలట్ అభినందన్ వర్థమాన్‌ మోడీ చొరవ వల్లే పాక్ విడుదల చేసింది. అవును, మోడీ కారణంగా థర్డ్ వరల్డ్ వార్ ఆగింది. ప్రస్తుతం ఉన్న భారత్ ను ఎన్నడూ చూడలేదని, కాబట్టి ప్రజలు ఎవరికి ఓటు వేయాలో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది!" అని స్పష్టం చేశారు కంగనా.

ఇకపోతే కంగనాకు ఓవర్ నైట్ సక్సెస్ రాలేదు. బాలీవుడ్లో ఎన్నో ఉడుదుడుకులు, ఇబ్బందులు ఎదుర్కొన్న ఆమె తన స్వశక్తితో ముందుకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో బాలీవుడ్ అగ్ర హీరోల అందరితోనూ నటిస్తూ తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు కంగనా. ఆమధ్యలో ఎన్నో అవమానాలు, రూమర్స్ ఎదుర్కొన్న ఆమె ఎంతో ధైర్యంగా తన సినిమా జీవితాన్ని సక్సెస్ రూటులోకి ఎక్కించారు. అందుకే కంగనాకు ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. తన నట జీవితంలో ఆమె లెక్కలేనన్ని అవార్డులను అందుకున్నారు. అందులో 3 జాతీయ పురస్కారాలు కూడా ఉన్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>