PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/palla-sreenivasarao604e6cda-d9ac-45a8-98e3-6bffcc80c3f4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/palla-sreenivasarao604e6cda-d9ac-45a8-98e3-6bffcc80c3f4-415x250-IndiaHerald.jpg•గాజువాకలో వైసీపీకి కంటే ముందంజలో ఉన్న టీడీపీ •తండ్రికి తగ్గ తనయుడిగా దూసుకుపోతున్న యాదవ నేత పల్లా శ్రీనివాసరావు •శ్రీనివాసరావుకి ప్లస్ పాయింట్ గా మారిన అమర్నాథ్ నెగటివ్ పాయింట్ గాజువాక - ఇండియా హెరాల్డ్: ఉత్తరాంధ్రలో గాజువాక నియోజకవర్గం కీలక నియోజకవర్గాల్లో ఒకటి. ఇక గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ నుంచి అమర్నాథ్‌, టీడీపీ తరపున శ్రీనివాసరావు బరిలో దిగారు.ఇప్పుడు అమర్నాథ్‌, శ్రీనివాసరావు విజయం కోసం ఢీ అంటే ఢీ అనే విధంగా తల పడుతున్నారు. వీరే కాదు గతంలో వీళ్ల తండ్రులు కూడా పరస్పరం తలపడ్డారుPalla Sreenivasarao{#}Simhachalam;Pendurthi;Gajuwaka;Yevaru;Anakapalle;Amarnath Cave Temple;Father;war;Survey;MLA;India;TDP;YCPగాజువాక: వైసీపీకి చెమటలు పట్టిస్తున్న శ్రీనివాసరావు?గాజువాక: వైసీపీకి చెమటలు పట్టిస్తున్న శ్రీనివాసరావు?Palla Sreenivasarao{#}Simhachalam;Pendurthi;Gajuwaka;Yevaru;Anakapalle;Amarnath Cave Temple;Father;war;Survey;MLA;India;TDP;YCPWed, 08 May 2024 11:49:15 GMT•గాజువాకలో వైసీపీకి కంటే ముందంజలో ఉన్న టీడీపీ
•తండ్రికి తగ్గ తనయుడిగా దూసుకుపోతున్న యాదవ నేత పల్లా శ్రీనివాసరావు
•శ్రీనివాసరావుకి ప్లస్ పాయింట్ గా మారిన అమర్నాథ్ నెగటివ్ పాయింట్


గాజువాక - ఇండియా హెరాల్డ్: ఉత్తరాంధ్రలో గాజువాక నియోజకవర్గం కీలక నియోజకవర్గాల్లో ఒకటి. ఇక గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ నుంచి అమర్నాథ్‌, టీడీపీ తరపున శ్రీనివాసరావు బరిలో దిగారు.ఇప్పుడు అమర్నాథ్‌, శ్రీనివాసరావు విజయం కోసం ఢీ అంటే ఢీ అనే విధంగా తల పడుతున్నారు. వీరే కాదు గతంలో వీళ్ల తండ్రులు కూడా పరస్పరం తలపడ్డారు.అమర్నాథ్ తండ్రి గుడివాడ గురునాధరావు, శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం గతంలో ఎమ్మెల్యేలుగా పని చేయడం జరిగింది. సరిగ్గా 35 ఏళ్ల క్రితం గురునాధరావు, సింహాచలం ప్రత్యర్థులుగా పోటీపడటం గమనార్హం.ఇక అప్పట్లో పెందుర్తి నియోజకవర్గంలోనే గాజువాక ఉండేది. 


1989 వ సంవత్సరం ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గంలో సింహాచలంపై అమర్నాథ్ తండ్రి గురునాధరావు గెలిచారు. ఇప్పుడు మూడున్నర దశాబ్దాల తర్వాత మళ్లీ వీళ్ల వారసుల మధ్య పొలిటికల్ వార్ అనేది సాగుతోంది.ఇప్పుడు అమర్నాథ్‌, శ్రీనివాసరావుల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఈ ఇద్దరూ కూడా తొలిసారి ఎంపీగా పోటీ చేసినప్పుడు ఓటమి పాలయ్యారు. అయితే ఆ తర్వాత ఎమ్మెల్యేలుగా గెలిచారు. పల్లా శ్రీనివాసరావు మూడోసారి ఎమ్మెల్యే ఎన్నికల్లో బరిలో దిగారు. గుడివాడ అమర్నాథ్ రెండో సారి పోటీకి సిద్ధమయ్యారు. గాజువాక నుంచి గుడివాడ తొలిసారి పోటీ చేయడంతో పల్లా శ్రీనివాసరావుతో యుద్దానికి సై అంటున్నారు. గత ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్‌.. అనకాపల్లి నుంచి పోటీ చేశారు. ఇలా అప్పుడు తండ్రుల మధ్య పోటీ.. ఇప్పుడు కొడుకుల మధ్య సమరంగా మారింది. ఈ ఇద్దరు నాయకులు కూడా తమదైన శైలిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.


మరి వీళ్లలో ఎవరు గెలుస్తారన్న విషయానికి వస్తే ఈసారి యాదవ నేత పల్లా శ్రీనివాసరావు గెలిచే ఛాన్స్ ఉన్నట్లు ఇండియా హెరాల్డ్ సర్వే ద్వారా తెలిసింది. ఈయన తండ్రి పల్లా సింహాచలం గారికి మంచి పేరుంది. ఆయన లాగే శ్రీనివాసరావు కూడా గాజువాకలో జనాలని తన ప్రచారాలతో ఆకట్టుకుంటున్నారు. పైగా గుడివాడ అమర్నాథ్ పై సోషల్ మీడియాలో బాగా నెగటివిటీ ఉంది.ఆ నెగటివిటీ పల్లా శ్రీనివాసరావుకి బాగా ప్లస్ అవుతుంది. అమర్నాథ్ బలమైన నేతే అయినా ఆయన లాజిక్ లేని కామెంట్స్ వల్ల సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ కి గురయ్యారు. అందువల్ల జనాల్లో ఆయనంటే నెగటివిటీ ఏర్పడింది. కానీ పల్లా శ్రీనివాసరావు ఇంకా ఆయన తండ్రికి చాలా మంచి పేరుంది. అందువల్ల జనాల్లో పాజిటివ్ గా దూసుకుపోతున్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>