MoviesChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sivangi6ec8e68a-6256-41e8-910a-7d5ec6a201ef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sivangi6ec8e68a-6256-41e8-910a-7d5ec6a201ef-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ రంగంలో ఓ రంగంలో పని చేస్తున్న వారు.. మరో రంగంలోకి అడుగుపెడుతుండటం మామూలే. 24 క్రాఫ్ట్‌లో ఏ పని లో ఉన్నా.. అందరి దృష్టి డైరెక్టర్ కుర్చీపైనే ఉంటుంది. అలా సినీ రంగంలోని ఎన్నో విభాగాల వారు డైరక్షన్‌లోనూ తమ ప్రతిభ చాటుకున్నారు కూడా. అలా మరో టెక్నీషియన్‌ డైరెక్టర్‌ కాబోతున్నారు. సినిమాటోగ్రఫర్ భరణి కే ధరన్ .. తాజాగా ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్ 'సివంగి' చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సివంగి.. ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్, జాన్ విజయ్.. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. sivangi{#}Naresh;allari naresh;bharani;raghu;sanjith;sharath;varalaxmi sarathkumar;Jaan;John;Sharrath Marar;Darsakudu;Thriller;Music;Chitram;Director;Cinemaఆనంది, వరలక్షీల "సివంగి".. డైరెక్టర్‌ అవుతున్న మరో టెక్నీషియన్‌?ఆనంది, వరలక్షీల "సివంగి".. డైరెక్టర్‌ అవుతున్న మరో టెక్నీషియన్‌?sivangi{#}Naresh;allari naresh;bharani;raghu;sanjith;sharath;varalaxmi sarathkumar;Jaan;John;Sharrath Marar;Darsakudu;Thriller;Music;Chitram;Director;CinemaWed, 08 May 2024 09:11:54 GMTతెలుగు సినీ రంగంలో ఓ రంగంలో పని చేస్తున్న వారు.. మరో రంగంలోకి అడుగుపెడుతుండటం మామూలే. 24 క్రాఫ్ట్‌లో ఏ పని లో ఉన్నా.. అందరి దృష్టి డైరెక్టర్ కుర్చీపైనే ఉంటుంది. అలా సినీ రంగంలోని ఎన్నో విభాగాల వారు డైరక్షన్‌లోనూ తమ ప్రతిభ చాటుకున్నారు కూడా. అలా మరో టెక్నీషియన్‌ డైరెక్టర్‌ కాబోతున్నారు. సినిమాటోగ్రఫర్ భరణి కే ధరన్ .. తాజాగా ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్ 'సివంగి' చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.


సివంగి.. ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్, జాన్ విజయ్.. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.  40 సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన భరణి కే ధరన్ ఈ చిత్రంతో దర్శకునిగా కొత్త సినీ జీవితం ప్రారంభిస్తున్నారు. ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్ పై నరేష్ బాబు పి ఈ సివంగి మూవీని నిర్మిస్తున్నారు.


ఫిమేల్ సెంట్రిక్ కథతో రూపొందుతున్న అన్ని కమర్షియల్ హంగులతో పాటు కుటుంబం విలువలకు ప్రాధాన్యతనిచ్చే అంశాలు కీలకంగా ఉండబోతున్నాయి. ఓ మహిళా తన జీవితం లో ఎదురైన అనూహ్యమైన పరిస్థితులకు ఎలా ఎదురు నిలిచింది అన్నది కథాంశం. డొమెస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సివంగి మూవీ రూపొందింది.  ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు భరణి తెలియజేశారు.


ఈ చిత్రానికి AH.కాసిఫ్ - ఎబినేజర్ పాల్ సంగీతం అందిస్తున్నారు. భరణి దర్శకత్వంలో పాటు డీవోపీగా కూడా ఈ సివంగి మూవీకి పని చేస్తున్నారు. ఇంక0 సంజిత్ Mhd ఎడిటర్. ఈ చిత్రానికి సంబధించిన మరిన్ని  వివరాలు త్వరలోనే నిర్మాతలు తెలియజేయనున్నారు.

ఈ సివంగి సినిమా వివరాలు..
నటీనటులు : ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్, జాన్ విజయ్ మరియు డా.కోయ కిషోర్
ప్రొడక్షన్ హౌస్: ఫస్ట్ కాపీ మూవీస్
నిర్మాత: నరేష్ బాబు.పి
రచన, దర్శకత్వం : భరణి కె ధరన్
సంగీతం : AH.కాసిఫ్ - ఎబినేజర్ పాల్
డీవోపీ: భరణి కె ధరన్
ఎడిటర్: సంజిత్ Mhd
ఆర్ట్ : రఘు కులకర్ణి
పీఆర్వో: తేజస్వి సజ్జా





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>