PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pm-modi-d35d441d-0cde-46d1-90ca-f948b67b8aff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pm-modi-d35d441d-0cde-46d1-90ca-f948b67b8aff-415x250-IndiaHerald.jpgమధ్యప్రదేశ్‌లోని ధార్‌, ఖర్గోన్‌లలో నిన్న అనగా మంగళవారంనాడు నిర్వహించిన ఎన్నికల ర్యాలీలలో మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్ పై విరుచుకు పడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ ‘ఓట్‌ జిహాద్‌’ను ప్రోత్సహిస్తూ, బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని ముస్లింలను మభ్యపెడుతోంది అని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "భారతదేశం జెండా ఈరోజు ప్రపంచ చిత్రపటంలో ఈరోజు రెపరెపలాడుతోంది. అంతటి సేవ చేసిన నన్ను ఈ మాయదారి కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోంది. తప్పులు చేశానంటూ ప్రజలను నమ్మించే పనిలో పడింది. దానికి మతాన్ని వాడుకోవాలని చూస్తpm modi {#}Terrorists;advertisement;Service;India;Narendra Modi;Scheduled Tribes;Congress;Loksabha;Bharatiya Janata Party;Partyభారత ప్రజలకు మోదీ సూటి ప్రశ్న... రామరాజ్యం కావాలా? ఓట్‌ జిహాద్ కావాలా?భారత ప్రజలకు మోదీ సూటి ప్రశ్న... రామరాజ్యం కావాలా? ఓట్‌ జిహాద్ కావాలా?pm modi {#}Terrorists;advertisement;Service;India;Narendra Modi;Scheduled Tribes;Congress;Loksabha;Bharatiya Janata Party;PartyWed, 08 May 2024 10:21:00 GMTమధ్యప్రదేశ్‌లోని ధార్‌, ఖర్గోన్‌లలో నిన్న అనగా మంగళవారంనాడు నిర్వహించిన ఎన్నికల ర్యాలీలలో మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్ పై విరుచుకు పడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ ‘ఓట్‌ జిహాద్‌’ను ప్రోత్సహిస్తూ, బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని ముస్లింలను మభ్యపెడుతోంది అని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "భారతదేశం జెండా ఈరోజు ప్రపంచ చిత్రపటంలో ఈరోజు రెపరెపలాడుతోంది. అంతటి సేవ చేసిన నన్ను ఈ మాయదారి కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోంది. తప్పులు చేశానంటూ ప్రజలను నమ్మించే పనిలో పడింది. దానికి మతాన్ని వాడుకోవాలని చూస్తోంది. ఇపుడు దేశ ప్రజలు నిర్ణయించుకోవలసిన సమయం ఆసన్నమైంది. దేశంలో ఓట్‌ జిహాద్‌ కొనసాగాలా లేక, రామ రాజ్యం కొనసాగాలా? అన్న విషయం మీరే నిర్ణయించుకోవాలి?"అని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. "పాక్‌ ఉగ్రవాదులు భారత్‌కు వ్యతిరేకంగా జిహాద్‌ పేరుతో ఎప్పటినుండో దాడులు చేస్తుంటే, కాంగ్రెస్‌ మాత్రం మోదీకి వ్యతిరేకంగా ఓట్‌ జిహాద్‌ను ప్రకటించింది. దేశ వ్యతిరేక ప్రకటనలు చేయడానికి ప్రస్తుతం విపక్ష ఇండియా కూటమి నేతలు పోటీ పడుతున్నారు. వారు మన విశ్వాసాలను, దేశ ప్రయోజనాలను తుంగలో తోక్కేస్తున్నారు. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని కాంగ్రెస్‌ తిరిగి తీసుకు రాకుండా ఉండేందుకు, అయోధ్యలో రామమందిరానికి బాబ్రీ తాళం పడకుండా ఉండేందుకు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 400 సీట్లు మేర గెలుసుకోవాలి. కాంగ్రెస్‌ తన ఓటు బ్యాంకుకు లబ్ధి చేకూర్చడానికి గాను వారు ఓబీసీ కోటాను దోచుకోకుండా ఉండటానికి 400 స్థానాలు కావాలని అడుగుతున్నా!" అని అన్నారు.

"బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు పార్లమెంట్‌లో 400కుపైగా సీట్లు ఉన్నాయని దేశ ప్రజలు గుర్తు పెట్టుకోవాలి. ఆర్టికల్‌ 370ని రద్దు చేయడానికి ఈ నంబరు సహకరించింది. ఎస్సీ, ఎస్టీ కోటాను పదేళ్ల కాంగ్రెస్‌, ఇండియా కూటమి ప్రతి కుట్రను అడ్డుకొనేందుకు తాను 400 సీట్లు అడుగుతున్నా. దళితులు, ఓబీసీల రిజర్వేషన్లను లాక్కొని ముస్లింలకు ఇవ్వాలని ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయి. అంబేడ్కర్‌ను, రాజ్యాంగాన్ని కాంగ్రెస్‌ వెన్నుపోటు పొడిచింది. అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ పరివారం తీవ్రంగా ద్వేషిస్తోందన్నది వాస్తవం. ఇలాంటి వారిని రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంచడమే మత రిజర్వేషన్లను వ్యతిరేకించిన అంబేడ్కర్‌కు అతిపెద్ద నివాళి!" అని చెప్పుకొచ్చారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>