Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle62dc2c6d-2246-403d-824b-a33b0e297dbc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle62dc2c6d-2246-403d-824b-a33b0e297dbc-415x250-IndiaHerald.jpgస్టార్ యాంకర్ రష్మీ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి టీవీ షోలతో బిజీ బిజీగా ఉంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మీ తన మీద వచ్చే ట్రోల్స్ కి కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తూ ఉంటుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక వ్యక్తి రష్మిని చెప్పుతో కొట్టాలి అని అన్నాడు. ఆ కామెంట్ కి కౌంటర్ ఇస్తూ రేపు నీ పిల్లలకి కూడా అదే జరుగుతుంది అని హెచ్చరించింది.వివరాల్లోకి వెళితే రష్మి గౌతమ్ జంతు ప్రేమికురాలు అన్న విషయం అందరికీ తెలిసిందే. జీవ హింసని ఆమె ఏమాత్రం తట్టుకోలేదు. మూగజీవాలను ఆహారం కోసం లేదా ఇతర కారణాల వల్socialstars lifestyle{#}rashmi gautham;Cow slaughter;Rashami Desai;gautham new;gautham;Dogs;televisionట్రోలర్ కి దిమ్మతిరిగే షాకింగ్ రిప్లై ఇచ్చిన రష్మీ..!!ట్రోలర్ కి దిమ్మతిరిగే షాకింగ్ రిప్లై ఇచ్చిన రష్మీ..!!socialstars lifestyle{#}rashmi gautham;Cow slaughter;Rashami Desai;gautham new;gautham;Dogs;televisionTue, 07 May 2024 18:30:00 GMTస్టార్ యాంకర్ రష్మీ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి టీవీ షోలతో బిజీ బిజీగా ఉంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మీ తన మీద వచ్చే ట్రోల్స్ కి కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తూ ఉంటుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక వ్యక్తి రష్మిని చెప్పుతో కొట్టాలి అని అన్నాడు. ఆ కామెంట్ కి కౌంటర్ ఇస్తూ రేపు నీ పిల్లలకి కూడా అదే జరుగుతుంది అని హెచ్చరించింది.వివరాల్లోకి వెళితే రష్మి గౌతమ్ జంతు ప్రేమికురాలు అన్న విషయం అందరికీ తెలిసిందే. జీవ హింసని ఆమె ఏమాత్రం తట్టుకోలేదు. మూగజీవాలను ఆహారం కోసం లేదా ఇతర కారణాల వల్ల హింసించే వారిపై ఆమె ఎప్పటికప్పుడు గొంతు విప్పుతూనే ఉంటారు.
రష్మీ గౌతమ్ ఈ నేపథ్యంలో వేగన్ గా మారిపోయారు. మాంసాహారమే కాకుండా పాలు, పాల ఉత్పత్తులు, కోడిగుడ్లకి కూడా ఆమె దూరంగా ఉంటారు. తాజాగా మూగజీవాలను సపోర్ట్ చేస్తూ రష్మీ చేసిన కామెంట్లు ట్రోల్ కి గురయ్యాయి.

హైదరాబాద్ లో ఒక చిన్న పిల్లాడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో చిన్నపిల్లాడి తల్లిదండ్రులది తప్పు అని రష్మీ వాదించింది. దాంతో అందరూ రష్మీని దారుణంగా ట్రోల్ చేశారు. బక్రీద్ సందర్భంగా జరిగే గోవధ పై కూడా ఆమె వ్యతిరేకంగా మాట్లాడడం వివాదాస్పదంగా మారింది.తాజాగా ఒక వ్యక్తి ఒక ఎద్దును కాల్చి చంపుతున్న వీడియో షేర్ చేస్తూ ఇది నిజంగా దారుణం అంటూ పేర్కొంది రష్మీ. ఇలాంటివి జరగకుండా ఎందుకు ఆపలేకపోతున్నాము అని ప్రశ్నించింది. దానికి ఒక వ్యక్తి ఆడపిల్లలు రేప్ కి గురవుతున్నారు. వాళ్ళని బట్టలు కూడా తీసి నగ్నంగా తిప్పుతున్నారు. వాటి మీద స్పందించని నువ్వు ఎద్దుని చంపితే కామెంట్లు చేస్తున్నావు. నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి అని కామెంట్ చేశాడు.దానికి రియాక్ట్ అయిన రష్మీ ఇవాళ ఎద్దును చంపిన వాడే రేపు మీ పిల్లల్ని కూడా చంపుతాడు. వాడికి మనిషికి పశువుకి తేడా తెలియదు అని ఇంకా ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఆమె పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>