PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pitapuram-pawankalyan-vanga-geetha-tdp-ycp5bdffa5a-ac71-4e02-97bf-8cce46fa7b38-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pitapuram-pawankalyan-vanga-geetha-tdp-ycp5bdffa5a-ac71-4e02-97bf-8cce46fa7b38-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఏపీలో ఏం నడుస్తుందయ్యా అంటే ఎన్నికల పండుగ నడుస్తుందని చెప్పవచ్చు. కాదు కాదు సెలబ్రిటీల హవా నడుస్తోంది. ఎన్నికల సమయంలో సెలబ్రెటీల హవా ఏంటని మీరు అనుకుంటున్నారా.. అవునండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి చాలామంది సెలబ్రిటీలు పిఠాపురం ఎన్నికల సినిమా షూటింగులో పాల్గొనడానికి వస్తున్నారు. కామన్ సమయంలో కనీసం వారిని కలవడానికి కూడా ఛాన్స్ ఇవ్వని ఆ నటీనటులు ప్రస్తుతం పిఠాపురంలో 45 డిగ్రీల ఎండలో కూడా ప్రజలకు తారసపడుతున్నారు. పవన్ కళ్యాణ్ కోసం చెమటోడుస్తున్నారు. దీంతో ఏపీ రాష్ట్ర ప్రజలంతpitapuram ;pawankalyan;vanga geetha;tdp;ycp{#}geetha;getup srinu;kalyan;varun tej;pithapuram;festival;television;lion;Annayya;Janasena;YCP;Cinema;Telugu;Andhra Pradesh"పిఠాపురం" సినిమాలో ఇంతమంది నటులా.. చప్పట్లు తప్ప ఓట్లు రావట.!"పిఠాపురం" సినిమాలో ఇంతమంది నటులా.. చప్పట్లు తప్ప ఓట్లు రావట.!pitapuram ;pawankalyan;vanga geetha;tdp;ycp{#}geetha;getup srinu;kalyan;varun tej;pithapuram;festival;television;lion;Annayya;Janasena;YCP;Cinema;Telugu;Andhra PradeshTue, 07 May 2024 14:29:50 GMT ప్రస్తుతం ఏపీలో ఏం నడుస్తుందయ్యా అంటే  ఎన్నికల పండుగ నడుస్తుందని చెప్పవచ్చు. కాదు కాదు  సెలబ్రిటీల హవా నడుస్తోంది. ఎన్నికల సమయంలో సెలబ్రెటీల హవా ఏంటని మీరు అనుకుంటున్నారా.. అవునండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి చాలామంది సెలబ్రిటీలు  పిఠాపురం ఎన్నికల సినిమా షూటింగులో పాల్గొనడానికి వస్తున్నారు. కామన్ సమయంలో కనీసం వారిని కలవడానికి కూడా ఛాన్స్ ఇవ్వని  ఆ నటీనటులు  ప్రస్తుతం పిఠాపురంలో 45 డిగ్రీల ఎండలో కూడా  ప్రజలకు తారసపడుతున్నారు. పవన్ కళ్యాణ్ కోసం చెమటోడుస్తున్నారు. దీంతో ఏపీ రాష్ట్ర ప్రజలంతా పిఠాపురం నియోజకవర్గం గురించే ఆలోచిస్తున్నారు. అంతే కాదు పక్క నియోజకవర్గాల నుంచి కూడా జనాలు పిఠాపురం వస్తున్నారట. 

ఈ జనాలను చూసి పవన్ గెలుపు పక్క అంటూ  ఓవైపు టీవీ ఛానల్స్ లో, మరోవైపు సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నా పవన్ కు మాత్రం నమ్మకం లేదు. ఇండస్ట్రీలో ఉండేటువంటి పెద్ద పెద్ద సెలబ్రిటీలకు రెమ్యునరేషన్ ఇచ్చి మరీ ఇక్కడ ప్రచారం చేయించుకుంటున్నారు. మరి ఒక్క అభ్యర్థి కోసం ఇంత మంది ఎందుకు ప్రచారం చేస్తున్నారు. పవన్ కు అక్కడ గెలుస్తాననే నమ్మకం లేదా..నమ్మకం ఉంటే ఇన్ని ఆర్భాటాల అవసరం లేదు.  ఇంతమంది సెలబ్రిటీలు అక్కడికి రానవసరం లేదు. తాను ఆ నియోజకవర్గానికి ఏం చేస్తాడో, ఎలా డెవలప్ చేస్తాడో చెప్పి ప్రజల మనసును గెలుచుకోవాలి.

కానీ   హైపర్ ఆదిని, వరుణ్ తేజ్ ను, వైష్ణవ్  తేజ్ ను, గెటప్ శ్రీను ను, ఇంకా చిన్న చిన్న సెలబ్రిటీలను  తీసుకువచ్చి ప్రజలందరికీ సినిమా చూపించినట్టు చూపిస్తే ఓట్లు పడతాయని అనుకుంటున్నారట. కానీ పిఠాపురం ప్రజలు మాత్రం మరో విధంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కట్ చేస్తే అక్కడ వైసిపి నుంచి వంగ గీత కూడా చాలా సీనియర్ నాయకురాలు. మంచి పేరుంది. సింహం సింగిల్ గా వస్తుంది అన్నట్టు  ఒక మహిళ అయ్యుండి  జనసేన అధినేతతో  కొట్లాడుతుంది. అంతే కాదు తాను చేసేది ఏంటో  జనాలకు క్లియర్ గా చెబుతూ ముందుకు సాగుతోంది.  

సెలబ్రిటీలు ప్రచారం చేసినంత మాత్రాన  ఓట్లు వేయరని, కంటెంట్ ఉన్న నాయకులనే ఎన్నుకుంటారని  ఆమె అంటుంది. అంతేకాకుండా పిఠాపురం నియోజకవర్గంలో  పవన్ చేసే హంగు ఆర్భాటాలను చూడటానికి  ఆ నియోజకవర్గ ప్రజల కంటే బయటి వ్యక్తులే ఎక్కువగా వస్తున్నారని, వారి ఓట్లు పవన్ కు పడవని  కొంతమంది అంటున్నారు. తెలంగాణలో బర్రెలక్క పోటీ చేస్తే  ఆ నియోజకవర్గం కంటే ఎక్కువ బయట ఉన్న ప్రజలే మద్దతు తెలిపారు.  ఆ విధంగానే పవన్ విషయంలో కూడా అదే జరుగుతుందట. అందుకే పవన్ ఇంతమంది సెలబ్రిటీలను దింపి ప్రచారం చేయించినా వర్కౌట్ అవ్వడం లేదని  చివరికి వాళ్ళ అన్నయ్య చిరంజీవిని కూడా తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని, తన గెలుపు పై తనకు నమ్మకం లేదని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>