MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manojb0beff65-2d9d-47c6-90c8-f46e109f6c1c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manojb0beff65-2d9d-47c6-90c8-f46e109f6c1c-415x250-IndiaHerald.jpgమనోజ్ బాజ్‌పాయ్ , ప్రియమణి ప్రధాన పాత్రల్లో రాజ అండ్ డీకే దర్శకత్వంలో ది ఫ్యామిలీ మెన్ అనే వెబ్ సిరీస్ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన రెండు సీజన్ లు కంప్లీట్ అయ్యాయి. ప్రియమణి ప్రధాన పాత్రలో నటించగా రెండవ సీజన్ లో వీరితో పాటు సమంత కూడా ప్రధాన పాత్రలో నటించింది. సమంత రెండవ సీజన్ లో ప్రధాన పాత్రలో నటించడంతో ఈ సీజన్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగినట్టు గానే ఈ సీజన్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే సమంత "ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2" Manoj{#}priyamani;Samantha;Amazon;Audienceస్టార్ట్ అయిన "ది ఫ్యామిలీ మెన్ సీజన్ 3"..!స్టార్ట్ అయిన "ది ఫ్యామిలీ మెన్ సీజన్ 3"..!Manoj{#}priyamani;Samantha;Amazon;AudienceTue, 07 May 2024 22:50:00 GMTమనోజ్ బాజ్‌పాయ్ , ప్రియమణి ప్రధాన పాత్రల్లో రాజ అండ్ డీకే దర్శకత్వంలో ది ఫ్యామిలీ మెన్ అనే వెబ్ సిరీస్ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన రెండు సీజన్ లు కంప్లీట్ అయ్యాయి. ప్రియమణి ప్రధాన పాత్రలో నటించగా రెండవ సీజన్ లో వీరితో పాటు సమంత కూడా ప్రధాన పాత్రలో నటించింది. సమంత రెండవ సీజన్ లో ప్రధాన పాత్రలో నటించడంతో ఈ సీజన్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగినట్టు గానే ఈ సీజన్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

 అలాగే సమంత "ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2" లో తన అద్భుతమైన నటనతో , అందచందాలతో ప్రేక్షకులను బాగా అలరించింది. ఇక ఇప్పటికే ది ఫ్యామిలీ మెన్ రెండు సీజన్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో మూడవ సీజన్ గురించి ప్రేక్షకులు ఎప్పటి నుండో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఎట్టకేలకు తాజాగా ది ఫ్యామిలీ మెన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

ఇక ది ఫ్యామిలీ మెన్ మొదటి సీజన్ తో పోలిస్తే రెండవ సీజన్ ను భారీగా తెరకెక్కించారు. రెండవ సీజన్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో మూడవ సీజన్ ను మరింత భారీ బడ్జెట్ తో రూపొందించడానికి మేకర్స్ డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. మనోజ్ బాజ్‌పాయ్ , ప్రియమణి , శరీబ్ హష్మీ తదితరులు ది ఫ్యామిలీ మెన్ సీజన్ 3 లో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ మూడో సీజన్ అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం తెరకెక్కుతుంది. మరి ఈ వెబ్ సీరీస్ మూడవ సీజన్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>