Politicsmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-assembly-electionsc0984bad-1239-423f-b932-ab589f2e1629-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-assembly-electionsc0984bad-1239-423f-b932-ab589f2e1629-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో మరో 6 రోజులలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి..దీనితో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రధాన రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తూ ఒకరి మీద ఒకరు మీద ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.. అధికార వైసీపీ పార్టీ అధినేత జగన్ ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు చేస్తూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. అలాగే కూటమి నేతలు సైతం అధికార పార్టీ మోసాలను ప్రజలలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాజమండ్రి రూరల్ వేమగిరిలో ఏర్పాటుచేసిన కూటమి సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు#assembly elections{#}Godavari River;Capital;Service;central government;Rajahmundry;Narendra Modi;Telugu Desam Party;Prime Minister;Elections;Gift;TDP;history;YCP;Andhra Pradesh;Jagan;Partyఏపీ : టీడీపీకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మోదీ..!!ఏపీ : టీడీపీకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మోదీ..!!#assembly elections{#}Godavari River;Capital;Service;central government;Rajahmundry;Narendra Modi;Telugu Desam Party;Prime Minister;Elections;Gift;TDP;history;YCP;Andhra Pradesh;Jagan;PartyTue, 07 May 2024 18:13:48 GMTఆంధ్రప్రదేశ్ లో మరో 6 రోజులలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి..దీనితో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రధాన రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తూ ఒకరి మీద ఒకరు మీద ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.. అధికార వైసీపీ పార్టీ అధినేత జగన్ ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు చేస్తూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. అలాగే కూటమి నేతలు సైతం అధికార పార్టీ మోసాలను ప్రజలలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాజమండ్రి రూరల్ వేమగిరిలో ఏర్పాటుచేసిన కూటమి సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు.వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని ఆ సభలో ప్రధాని మోదీ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగులో తన ప్రసంగం ప్రారంభించారు."నా ఆంధ్రా కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు, రాజమండ్రి వాసులందరికీ నమస్కారాలు, గోదావరి నదీ తల్లికి ప్రణామం చేస్తున్నాను ఆదికవి నన్నయ నడయాడిన నేల ఇది… ఇక్కడే ఆయన తెలుగులో తొలి కావ్యాన్ని రచించారు. ఇప్పుడు ఈ గడ్డ నుంచి కొత్త చరిత్ర ప్రారంభం కానుందని నాకు స్పష్టంగా తెలుస్తోంది" అని మోదీ వివరించారు.

అలాగే వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు నిర్మిస్తామని చెప్పింది. మరి ఇన్నేళ్లలో ఒక్క రాజధాని అయినా కట్టారా? మూడు రాజధానుల పేరిట చాలా భారీ ఎత్తున లూటీ చేసే ప్రయత్నంలో వున్నారు. ప్రస్తుత ప్రభుత్వ ఖజానా పూర్తిగా ఖాళీ అయింది. వీళ్లు అవినీతిని మాత్రమే చేయగలరు, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ మాత్రం ఈ వైసీపీ ప్రభుత్వానికి తెలియనే తెలియదు. ప్రజలకు సేవ చేయాలన్న కోరిక లేని వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇలాంటి ఫలితాలే ఎదురైవుతాయని మోదీ విమర్శించారు..పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిలిపివేసి ఆంధ్రప్రదేశ్ జీవనాడికి వైసీపీ బ్రేక్ వేసింది.. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం రూ.15 వేల కోట్లు ఇచ్చింది. కానీ వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మాత్రం ముందుకు తీసుకెళ్లలేదని మోదీ విమర్శించారు... ఇదిలా ఉంటే మోదీ స్పీచ్ పై తెలుగు దేశం పార్టీ ఫుల్ హ్యాపీగా వుంది. అయితే  కూటమికి మద్దతు ఇచ్చిన కూడా మోదీ వైసీపీ ని విమర్శించకపోవడంతో టీడీపీ డీలా పడింది. ఇప్పటి స్పీచ్ తో మోదీ టీడీపీకి అదరిపోయే గిఫ్ట్ ఇచ్చారంటూ టీడీపీ వర్గాలు వారు ఆనందిస్తున్నారు..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>